Google Chrome లో సైట్ నోటిఫికేషన్‌లను బ్లాక్ చేయడం ఎలా?

|

ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం వినియోగదారులు అధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్‌లలో ఒకటి గూగుల్ క్రోమ్. సురక్షితమైన బ్రౌజింగ్ కోసం బాగా ప్రాచుర్యం పొందిన దానిగా కూడా గూగుల్ క్రోమ్ ను పిలుస్తారు. గూగుల్ బ్రౌజర్ వినియోగాన్ని మరింత మెరుగుపర్చడానికి ఇది వివిధ రకాల ఫీచర్లతో వస్తుంది. కావున ప్రజలు ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం మరొక ప్లాట్‌ఫామ్ కోసం చూడకుండా దీనినే అధికంగా వాడుతున్నారు.

 
How to Block Website Notifications in Google Chrome?

ఎప్పటికప్పుడు కొత్తగా విడుదలవుతున్న ఫీచర్ల జాబితాలో మీరు సందర్శించే వెబ్‌సైట్ల నుండి నోటిఫికేషన్‌లను నిరోధించే సామర్థ్యం కూడా ఉంది. ఈ రోజుల్లో నోటిఫికేషన్‌లను పొందడం అనేది తరచుగా జరిగే సంఘటన. ఈ నోటిఫికేషన్‌లు మిమ్మల్ని కూడా బాధపెడుతూ ఉంటే కనుక కింద గల సరళమైన దశలను అనుసరించి వాటిని సులభంగా వదిలించుకోవచ్చు. అది ఎలాగో చూడండి.

 

Google Chrome లో సైట్ నోటిఫికేషన్‌లను బ్లాక్ చేసే విధానం

How to Block Website Notifications in Google Chrome?

ఈ పద్ధతి విండోస్, మాక్ మరియు లైనక్స్ ల్యాప్‌టాప్‌లు / డెస్క్‌టాప్‌లలోని గూగుల్ క్రోమ్‌ను కవర్ చేస్తుంది.

స్టెప్ 1: మీ PC లేదా ల్యాప్‌టాప్‌లో Google Chrome కి వెళ్ళండి.

స్టెప్ 2: కుడి వైపున గల మూడు-చుక్కల మెనుని ఎంచుకోండి.

స్టెప్ 3: సెట్టింగుల ఎంపికను ఎంచుకోవడం కోసం కొంచెం క్రిందికి స్క్రోల్ చేయండి మరియు దానిపై నొక్కండి.

స్టెప్ 4: ఇప్పుడు మీరు 'గోప్యత మరియు భద్రతా' విభాగాన్ని కనుగొని క్రిందికి స్క్రోల్ చేయండి. ఇందులో సైట్ సెట్టింగుల ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 5: ఇందులో మీరు నోటిఫికేషన్ల ఎంపికను కనుగొంటారు. 'సైట్‌లు నోటిఫికేషన్‌లు పంపమని అడగవచ్చు' ఎంపిక ఉంటుంది. Google Chrome లో సైట్ నోటిఫికేషన్‌లను తొలగించే ఎంపికను నిలిపివేయండి.

Best Mobiles in India

English summary
How to Block Website Notifications in Google Chrome?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X