చిన్నపిల్లల కోసం కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంబమైంది!! CoWIN యాప్‌లో నమోదు చేసుకోవడం ఎలా??

|

భారతదేశంలో చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్‌లను అందించడం కోసం భారత ప్రభుత్వం తన యొక్క సన్నాహాలను మరింత ముమ్మరం చేసింది. దేశంలోని 15 నుంచి 18 ఏళ్ల గ్రూప్‌లోని పిల్లలకు అందరికి టీకాలు వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. ఈ టీకాలు జనవరి 3, 2022న ప్రారంభం కానుంది. అయితే రిజిస్ట్రేషన్ జనవరి 1, 2022న నుంచి మొదలయ్యాయి.

 
చిన్నపిల్లల కోసం కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంబమైంది!!నమోదు చేసుకోవడం

కరోనా యొక్క కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఆఫ్ కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి నుండి 15-18 ఏళ్ల మధ్య వయస్సు వారికి టీకాలు వేయడంతో సహా కరోనాపై పోరాటంలో మూడు ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు. ఇది కాకుండా మరొక పెద్ద ప్రకటన చేస్తూ జనవరి 10 నుండి వృద్ధులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు 60 ఏళ్లు పైబడిన ఫ్రంట్‌లైన్ కార్మికులకు బూస్టర్ డోస్ ప్రారంభించబడుతుందని కూడా ప్రధాని ప్రకటించారు.

కోవిడ్ పోర్టల్‌లో 15-18 ఏళ్ల మధ్య వయససు గల పిల్లల టీకా కోసం జనవరి 1 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ప్రారంభమైంది. అదే సమయంలో జనవరి 3 నుండి ప్రారంభమయ్యే టీకా సమయంలో వాక్-ఇన్ ద్వారా కూడా టీకాలు వేయవచ్చు. సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ పాఠశాల స్థాయిలలో ప్రాధాన్యతా ప్రాతిపదికన టీకా సెషన్‌లు నిర్వహించబడతాయి. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్న బాలబాలికలకు 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల కో-వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వబడుతుంది.

చిన్నపిల్లల కోసం కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంబమైంది!!నమోదు చేసుకోవడం

దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా వేగాన్ని మనం పరిశీలిస్తే ఈ వయస్సు వారికి టీకాలు వేయడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 16,764 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే కరోనా కేసులు 27.4 శాతం పెరిగాయి. అంతేకాకుండా దేశంలో ఓమిక్రాన్ వేరియంట్‌ల కేసులు 1270కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీ, ముంబైలలో ఓమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉంది.

పిల్లల కోసం టీకా అపాయింట్‌మెంట్‌లను నమోదు చేసుకునే విధానం

చిన్నపిల్లల కోసం కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంబమైంది!!నమోదు చేసుకోవడం

స్టెప్ 1: పిల్లల కోసం టీకాబుక్ చేసుకోవడం కోసం ముందుగా మీరు Cowin ప్లాట్‌ఫారమ్‌కి వెళ్లాలి.

స్టెప్ 2: ఇక్కడ మీరు పేరు మరియు వయస్సుతో సహా మీ పిల్లల సమాచారాన్ని అందివ్వవలసి ఉంటుంది.

స్టెప్ 3: దీని తర్వాత మీ యొక్క పిల్లల ఆధార్ లేదా 10వ తరగతి I కార్డ్ అందించాలి.

స్టెప్ 4: దీని తర్వాత ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది.

తల్లిదండ్రులు ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు PCల ద్వారా టీకా స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు. దేశంలోని వయోజన జనాభాలో 61 శాతం మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోస్‌లు ఇవ్వగా, వయోజన జనాభాలో 90 శాతం మందికి మొదటి డోస్ ఇవ్వబడింది. 15-18 సంవత్సరాల వయస్సు గల వారికి టీకాలు వేయడం పాఠశాలల్లో విద్యను సాధారణంగా అందించడానికి సహాయపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Book Covid-19 Vaccination Slot For Children in CoWIN App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X