వాట్సాప్ ద్వారా COVID-19 వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేసుకోవడం ఎలా?

|

COVID-19 సంబంధిత ప్రశ్నలకు సమాధానమివ్వడానికి మరియు కరోనావైరస్ మహమ్మారి యొక్క తప్పుడు సమాచారాన్ని నిరోధించడానికి వాట్సాప్‌లో MyGov కరోనా హెల్ప్‌డెస్క్‌ చాట్‌బాట్ మార్చి 2020 లో ప్రవేశపెట్టబడింది. ఇది ఇప్పటివరకు టీకా సర్టిఫికెట్‌లను డౌన్‌లోడ్ చేయడానికి వినియోగదారులు అనుమతించింది. ఇప్పటి వరకు వినియోగదారులు COVID-19 వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేసుకోవడానికి కోవిన్ వెబ్‌సైట్ మరియు ఇతర సైట్ లను ఉపయోగించేవారు. అయితే వాట్సాప్ ఇప్పుడు మీ సమీప టీకా కేంద్రాన్ని గుర్తించడానికి మరియు వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజర్లు ఇప్పుడు ప్రభుత్వం యొక్క MyGov కరోనా హెల్ప్‌డెస్క్‌ చాట్‌బోట్ బుక్ టీకా స్లాట్‌ను వాట్సాప్ నంబర్ 9013151515 కు పంపడం ద్వారా ఉపయోగించవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
వాట్సాప్ ద్వారా COVID-19 వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేసుకోవడం ఎలా?

WhatsApp లో COVID-19 వ్యాక్సిన్ టీకా స్లాట్‌ను బుక్ చేసుకునే విధానం

స్టెప్ 1: అన్నిటికంటే ముందుగా వినియోగదారులు తమ ఫోన్‌లలో 9013151515 WhatsApp నంబర్‌ను సేవ్ చేయవలసి ఉంటుంది.

స్టెప్ 2: తరువాత చాట్ ఓపెన్ చేసి "బుక్ స్లాట్" అని టైప్ చేయండి మరియు వాట్సాప్‌లో ఈ నంబర్‌కు పంపండి. ఇది సంబంధిత మొబైల్ ఫోన్ నంబర్‌లో 6 అంకెల వన్-టైమ్ పాస్‌వర్డ్‌ని ఉత్పత్తి చేస్తుంది. మీరు ఆ OTP ని చాట్‌లో పంపవలసి ఉంటుంది.

స్టెప్ 3: మీరు OTP ని నమోదు చేసిన తర్వాత CoWIN వెబ్‌సైట్‌లో నమోదు చేయబడిన వ్యక్తుల పేర్లను ప్రదర్శిస్తుంది.

స్టెప్ 4: ఇప్పుడు టీకా స్లాట్‌ను బుక్ చేయాలనుకుంటున్న వినియోగదారుడి నెంబర్ ను టైప్ చేయాలి. అలాగే ఈ బోట్ మీ మునుపటి టీకా వివరాలను కూడా ప్రదర్శిస్తుంది.

స్టెప్ 5: ఇప్పుడు "పిన్‌కోడ్ ద్వారా శోధించండి" పై నొక్కండి. మీరు టీకా కోసం చెల్లించాలనుకుంటున్నారా లేదా ఉచితంగా కావాలా అని బాట్ మిమ్మల్ని అడుగుతుంది.

స్టెప్ 6: మీరు ఇప్పుడు మీ ప్రాంతం పిన్ కోడ్‌ని నమోదు చేయాలి. వినియోగదారులు పిన్‌కోడ్ మరియు టీకా రకం ఆధారంగా బుకింగ్ తేదీ మరియు స్థానాన్ని ఎంచుకోవచ్చు.

COVID-19 Vaccine Certificate: WhatsApp ద్వారా COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా??COVID-19 Vaccine Certificate: WhatsApp ద్వారా COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా??

Most Read Articles
Best Mobiles in India

English summary
How To Book Covid-19 Vaccination Slot Through WhatsApp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X