Indane గ్యాస్ సిలిండర్ Whatsapp లో బుక్ చేయడం ఎలా? కొత్త నెంబర్ ఇదే ..!

By Maheswara
|

వంట గ్యాస్ సీలిండర్ల బుకింగ్ పద్దతిని మరింత సరళతరం చేయడానికి, ఇండెన్ తమ సిలిండర్ల బుకింగ్ కోసం కొత్త నంబర్ ప్రకటించబడింది. వాట్సాప్ ద్వారా కూడా ఇండెన్ సిలిండర్లను బుక్ చేసుకోవటానికి అవకాశం ఉంది. ఈ క్రింది సూచనలను పాటించి చూడండి.

సిలిండర్ బుకింగ్ కోసం కొత్త నెంబర్

సిలిండర్ బుకింగ్ కోసం కొత్త నెంబర్

వంట గ్యాస్ సిలిండర్లను బుక్ చేయడానికి కొత్త విధానాన్ని ప్రకటించారు. ఈ కొత్త విధానాన్ని నవంబర్ 1 నుండి అమలు చేయాల్సి ఉంది. ఇండెన్ కస్టమర్ ల కోసం  సిలిండర్ బుకింగ్ కోసం ఫోన్ నంబర్ కొత్త పద్ధతిలో మార్చబడింది. భారతీయ వినియోగదారులకు సిలిండర్ బుక్ చేసుకోవడానికి కొత్త సంఖ్య 7718955555.ఈ నెంబర్ కు ఫోన్ చేసి బుక్ చేయవచ్చు.

Also Read:Flipkart మరియు Amazon లలో దీపావళి ఆఫర్స్ ! 20 వేల లోపు మంచి ఆఫర్లు ఉన్న ఫోన్లు ఇవే.Also Read:Flipkart మరియు Amazon లలో దీపావళి ఆఫర్స్ ! 20 వేల లోపు మంచి ఆఫర్లు ఉన్న ఫోన్లు ఇవే.

వాట్సాప్ ద్వారా సిలిండర్ బుకింగ్
 

వాట్సాప్ ద్వారా సిలిండర్ బుకింగ్

అదనంగా ఇండెన్ కస్టమర్ల కోసం అదనపు బుకింగ్ వ్యవస్థను ప్రకటించారు. అంటే వాట్సాప్ ద్వారా సిలిండర్లను బుక్ చేసుకోండి.  అదేవిధంగా వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ మెసేజింగ్ కోసం కొత్త నంబర్ ప్రకటించబడింది. కస్టమర్లు ఇప్పుడు వాట్సాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవటానికి మీరు 7588888824 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. ఆపై వాట్సాప్ సందేశంలో REFILL అని టైప్ చేసి 7588888824 కు పంపండి.

REFILL అని టైప్ చేసి సందేశం పంపడం ద్వారా సిలిండర్ బుక్ అవుతుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, వినియోగదారులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి మాత్రమే సందేశాలను పంపాలి.

సిలిండర్ దుర్వినియోగం

సిలిండర్ దుర్వినియోగం

చమురు కంపెనీలు వంట గ్యాస్ సిలిండర్లను పొందటానికి కొత్త విధానాన్ని కూడా ప్రకటించాయి. ఈ విధానం ఇంకా ప్రయోగాత్మక రీతిలో ఉన్నప్పటికీ, కొత్త విధానం నవంబర్ 1 నుండి చాలా మెట్రో సిటీ లలో అంతటా పరీక్ష దశలో అమలు కానుంది. ఈ కొత్త పద్ధతి ద్వారా చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ దుర్వినియోగం ను అడ్డుకోవచ్చు.  మరియు నిజమైన వినియోగదారులను తెలుసుకోవడానికి ఈ పద్దతి ఎంతో ఉపయోగపడుతుంది.

OTP తప్పనిసరి

OTP తప్పనిసరి

ఇంట్లో ఎల్‌పిజి సిలిండర్‌ను పంపిణీ చేసేటప్పుడు వన్‌టైమ్ పాస్‌వర్డ్ అని కూడా పిలువబడే OTP తప్పనిసరి అని తెలుస్తోంది. భారతీయ చమురు కంపెనీలు డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డెలివరీ అథెంటికేషన్ కోడ్) అనే కొత్త విధానాన్ని అమలు చేశాయి.కస్టమర్లు సిలిండర్‌ను బుక్ చేసినప్పుడు OTP రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది. సిలిండర్ పంపిణీ చేయడానికి వచ్చిన ఉద్యోగి వారికి పంపిన OTP నంబర్ చెబితేనే సిలిండర్ పంపిణీ చేయబడుతుంది.

Best Mobiles in India

English summary
How To Book Indane Gas Online via WhatsApp In Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X