కేవలం ఒక్క ఎసెమ్మెస్‌తో జియో ఫోన్ మీ చేతికి !

Written By:

మార్కెట్లో ప్రకంపనలు రేపుతున్న జియో ఫోన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఫోన్ ఎప్పుడు మీ చేతికి వస్తుందా అని చాలామంది ఇప్పటికే ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమయినట్లు తెలుస్తోంది. అయితే కేవలం ఎసెమ్మెస్ ద్వారా జియో ఫోన్ బుక్ చేసుకోవచ్చని మీకు తెలుసా..జియో ఆ అవకాశాన్ని ఇప్పుడు మీకు కల్పిస్తోంది. అదెలాగూ చూద్దాం.

జియో ఫోన్ రూ. 1500 డిపాజిట్‌పై అదిరిపోయే న్యూస్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా

జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను యూజర్లు ఆన్‌లైన్‌లో, రిలయన్స్ స్టోర్‌లో, జియో యాప్‌లో బుక్ చేసుకునేందుకు వీలుండగా ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా దీన్ని బుక్ చేసుకునేందుకు ప్రస్తుతం వీలు కల్పించారు.

7021170211 ఫోన్ నంబర్‌కు

అందుకు యూజర్లు ఏం చేయాలంటే.. JP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు ఉంటున్న ఏరియా పిన్ కోడ్ టైప్ చేసి మళ్లీ స్పేస్ ఇచ్చి మీకు దగ్గర్లోని జియో లేదా రిలయన్స్ స్టోర్ కోడ్‌ను ఎంటర్ చేసి ఆ ఎస్‌ఎంఎస్‌ను 7021170211 ఫోన్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాల్సి ఉంటుంది.

మీ దగ్గర్లోని జియో లేదా రిలయన్స్ స్టోర్‌కు వెళ్లి

ఒకవేళ మీకు మీ దగర్లోని జియో స్టోర్ కోడ్ తెలియకుంటే మీ దగ్గర్లోని జియో లేదా రిలయన్స్ స్టోర్‌కు వెళ్లి ఆ స్టోర్ కోడ్‌ను కనుక్కోవచ్చు.

స్పష్టత లేదు

అయితే మీరు జియో ఫోన్ నుంచి చేయాలా లేక ఏ ఫోన్ సిమ్ నుంచైనా చేయవచ్చా అనే దానిపై స్పష్టత లేదు. కంపెనీ దీనిపై ఇంకా ఎటువంటి వివరాలను తెలియపరచలేదు.

సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4 మధ్య

ఇలా బుక్ చేసిన ఫోన్లు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4 మధ్య డెలివరీ చేయబడతాయి. మీరు జియో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలంటే ఆగస్టు 24 నుంచి బుకింగ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కేవలం ఒక్క ఎసెమ్మెస్‌తో జియో ఫోన్ మీ చేతికి !

ఇంగ్లీష్ లో ఈ కింది విధంగా ఎంటర్ చేయండి. JP [PIN CODE] [Store code] send SMS to 7021170211. ఇలా పంపిన తరువాత మీకు కన్పర్మేషన్ మెసేజ్ వస్తుంది. 

English summary
How To Book JIO Mobile Phone By SMS With Aadhar Card – Process For JIO Rs 1500 Phone Register Link Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot