గ్యాస్ కనక్షన్ ఆన్‌లైన్‌లో బుక్ చేయడం ఎలా ?

By Gizbot Bureau
|

ఈ రోజు గ్యాస్ కనక్షన్ లేని ఇల్లు ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ కనక్షన్ ఉంటుంది. అయితే దేశంలో ఇంకా గ్యాస్ కనక్షన్ లేని గ్రామాలు చాలా ఉన్నాయి. వీళ్లంతా గ్యాస్ కనక్షన్ కోసం కాళ్లు అరిగేలా తిరిగినా ఒక్కోసారి పనికావడం లేదు. పైగా సమయం అంతా వృధా అవుతోంది. అక్కడ లైన్లో నిలబడటం దగ్గర నుంచి డాక్యుమెంట్లు సబ్ మిట్ చేసేవరకు తల ప్రాణం తోకకు వస్తుంది. ఇలాంటి సమయంలోనే గ్యాస్ కనక్షన్ ఆన్ లైన్లో బుక్ చేయడం ఎలా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే మనం ఆన్ లైన్లో గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. డిజిటల్ రంగం దూసుకుపోతున్ సమయంలో LPG suppliers అయిన Bharat Gas, Indane Gas and HP Gas వంటివి. ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాయి.

గ్యాస్ కనక్షన్ ఆన్‌లైన్‌లో బుక్ చేయడం ఎలా ?

 

ఈ కంపెనీలు అన్నీ యాప్స్ విడుదల చేశాయి. ఈ యాప్స్ ద్వారా మీరు గ్యాస్ బుకింగ్ లాంటి సదుపాయాలు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో చూద్దాం.

  • స్టెప్ 1 - ముందుగా గ్యాస్ ఏజెన్సీల పోర్టల్ ఓపెన్ చేయండి

HP Gas: https://myhpgas.in/myHPGas/NewConsumerRegistration.aspx

Bharat Gas: https://my.ebharatgas.com/LPGServices/ApplyNewConnection

Indane Gas: https://cx.indianoil.in/webcenter/portal/Customer?_afrRedirect=13915242512181853

  • స్టెప్ 2 - మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిబూటర్ ని చెక్ చేయండి. అందులో మీకు దగ్గర్లో ఉన్న వారి వివరాలు కనిపిస్తాయి.
  • స్టెప్ 3 - తర్వాత మీరు అందులో కనిపించే దానిలో మీ వివరాలను ఎంటర్ చేయండి. అడ్రస్, సబ్సిసిడరీ, క్యాష్ వివరాలు, సిలిండర్ టైప్, సిలిండర్ కెపాసిటీ మొదలగు వివరాలు ఎంటర్ చేయాలి.
  • స్టెప్ 4 - తర్వాత POI (Proof of Identity) and POF (Proof of Address)ను సెలక్ట్ చేసుకోండి. ఏం అడుగతున్నారో వాటిని అందులో అప్ లోడ్ చేయండి. తర్వాత అగ్రిమెంట్ టర్మ్స్ ఓ సారి చదివి సబ్ మిట్ బటన్ క్లిక్ చేయండి.
  • స్టెప్ 5 - ఆ తర్వాత పేజీ రీడైరక్ట్ అవుతుంది. పేమెంట్ ఆప్సన్ అడుగుతుంది. మీరు డెబిట్ కార్డు ద్వారా కాని క్రెడిట్ కార్డు ద్వారా కాని ఆన్ లైన్ పేమెంట్ చేయవచ్చు. అలాగే క్యాష్ అండ్ డెలివరీ ఆప్సన్ పెట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత మీరు బుకింగ్ స్టేటస్ ని ట్రాక్ చేసుకోవచ్చు. డెలివరీ డేట్ ఎప్పుడనేది కూడా తెలుసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to book LPG gas connection online

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X