Just In
- 11 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 13 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 16 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 18 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
Har Ghar Tiranga: పోస్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో జెండా ఆర్డర్ చేసుకోండిలా!
భారతదేశానికి స్వాతంత్య్రo వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా కేంద్రం అజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ 75వ ఇండిపెండెన్స్ డే దగ్గర పడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల మీద జాతీయ పతాకాన్ని ఎగుర వేసి ఐక్యతను చాటాలని కేంద్రం దేశ ప్రజానీకానికి పిలుపునిచ్చింది. ఆగస్టు 13, 14, 15వ తేదీల్లో జాతీయ పతాకాన్ని ఇళ్లపై ఎగుర వేయాలని సూచించింది. ఈ కార్యక్రమానికి కేంద్రం హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) అనే పేరును పెట్టింది.

అయితే, ప్రస్తుతం మన జాతీయ జెండాలు బయట దుకాణాలతో పాటు, పోస్ట్ ఆఫీస్ వారు ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. ఆఫ్‌లైన్ లో దక్కించుకోలేని వారు ఆన్‌లైన్‌లో పోస్టల్ డిపార్ట్‌మెంట్ అధికారిక సైట్ ద్వారా కూడా జాతీయ పతాకాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే, ఇందుకోసం మీరు రూ.25 చెల్లించవలసి ఉంటుంది. ఇప్పుడు ఆన్‌లైన్ లో జాతీయ పతాకాన్ని ఏవిధంగా ఆర్డర్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం. మీరు కూడా ఆన్‌లైన్ లో జెండాను పొందాలని భావిస్తే ఈ పద్దతి పాటించి ఆర్డర్ చేసుకోండి.

పోస్టల్ విభాగం ద్వారా ఆన్‌లైన్‌లో జాతీయ జెండాను ఇలా ఆర్డర్ పెట్టుకోండి:
* ముందుగా భారత పోస్టల్ విభాగానికి చెందిన అధికారిక వెబ్‌సైట్ ఇండియా పోస్ట్‌ను (https://www.indiapost.gov.in/VAS/Pages/IndiaPosthome.aspx) ఓపెన్ చేయాలి.
* సైట్‌లోకి ఎంటర్ అవగానే నాలుగు స్లైడ్ ఇమేజెస్ కనిపిస్తాయి. అందులో హర్ ఘర్ తిరంగా అనే పేరుతో ఓ స్లైడ్ ఉంటుంది. ఆ స్లైడ్‌పై ఉన్న ఇమేజ్‌పై క్లిక్ చేయగానే ఈ పోస్ట్‌కు సంబంధించిన మీకు మరో కొత్త ట్యాబ్ (https://www.epostoffice.gov.in/) ఓపెన్ అవుతుంది.
* అందులో మీరు లాగిన్ అవడానికి ముందుగా మీరు మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీతో ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవాలి. (కుడి వైపు పైభాగంలో లాగిన్ ఆప్షన్ ఉంటుంది.. అది ఎంపిక చేసుకున్న తర్వాత రిజిస్టర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది.)
* రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత మీ ఐడీతో పాస్‌వర్డ్‌తో ప్రొఫైల్ లాగిన్ చేయాలి.
* లాగిన్ విజయవంతం అయిన తర్వాత హోం పేజీలో హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) పేరుతో ఉన్న స్లైడ్ పై క్లిక్ చేయాలి.
* అలా హర్ ఘర్ తిరంగా పేరుతో ఉన్న స్లైడ్ పై క్లిక్ చేసిన వెంటనే బయ్ నౌ (Buy Now) అనే ఆప్షన్ కనిపిస్తుంది.
* బయ్ నౌ పై క్లిక్ చేయగానే మీ మొబైల్ నంబర్ కన్‌ఫాం చేసుకోవడానికి ఓటీపీ అడుతుంది.. అది కన్‌ఫాం చేసిన తర్వాత డెలివరీ అడ్రస్ సహా మీ వివరాలను అక్కడ ఇచ్చిన ఫాం లో పొందుపరచాలి.
* అనంతరం పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. పేమెంట్ సెక్షన్‌లోకి వెళ్లి రూ.25ను పేమెంట్ చేయడం ద్వారా మీ ఆర్డర్ విజయవంతం అని మెసేజ్‌తో పాటు ట్రాకింగ్ ఐడీ కూడా వస్తుంది.
* ఇలా ఇండియా పోస్ట్ ద్వారా ఆన్‌లైన్ లో మీరు జెండాను ఆర్డర్ చేసుకోవచ్చు.
ఈ హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) తో పాటు ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మరో సూచన కూడా చేశారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం సందర్భంగా దేశ ప్రజలంతా దేశ ఐక్యతను చాటే విధంగా తమ సోషల్ మీడియా అకౌంట్లకు జాతీయ పతాకంతో కూడిన ప్రొఫైల్ పిక్ పెట్టుకోవాలని సూచించారు. దీంతో సామాజిక మాధ్యమాలు తిరంగా జెండాలతో ప్రత్యేక ఆకర్షణ సంతరించుకున్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470