తిరుమల రూ.300 దర్శన్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం ఎలా?

|

ఇండియాలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాలలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నిటికంటే ముందు వరుసలో ఉంటుంది. దేశంలోనే అత్యంత ప్రసిద్ధ చెందిన మరియు అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో ఇది ఒకటి. రోజుకు సుమారు 60,000 నుండి 80,000 మంది యాత్రికులు సందర్శించే శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కరోనా సమయంలో చాలా రోజులు భక్తులను దర్శనానికి అనుమతించలేదు. అయితే తరువాత పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. 2021 కొత్త సంవత్సరం ప్రారంభం అయినందున చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని చూస్తుంటారు. టీటీడీ దేవస్థానం వారు ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా పరిమిత సంఖ్యలో శీఘ్ర దర్శన టిక్కెట్ లను రూ.300 ధర వద్ద అందిస్తున్నారు. ఇప్పటికే జనవరి నెల 15 వరకు ముందస్తు దర్శన టిక్కెట్లు బుక్ అవ్వడంతో మిగిలిన రోజుల దర్శన టిక్కెట్లను మరొక మరొక రెండు రోజులలో విడుదల చేయనున్నారు. ఈ టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా ఎలా పొందాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Book TTD Rs.300 Darshan Tickets on online

తిరుమల రూ.300 దర్శన్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోనే విధానం

స్టెప్ 1: టిటిడి యొక్క అధికారిక వెబ్‌సైట్ tirumala.org ‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: తరువాత హోమ్ పేజీలోని ఆన్‌లైన్ బుకింగ్ ఎంపిక మీద క్లిక్ చేయండి.

స్టెప్ 3: ఆన్‌లైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మీరు ఆన్‌లైన్‌ అకౌంటును కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోతే కనుక సృష్టించడానికి న్-అప్ ఎంపికపై క్లిక్ చేసి మీ అకౌంటును నమోదు చేయండి.

How to Book TTD Rs.300 Darshan Tickets on online

స్టెప్ 4: మీరు అకౌంటును సృష్టించిన తర్వాత మీ యొక్క ఇమెయిల్ ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి హోమ్ పేజీలో నేరుగా లాగిన్ అవ్వవచ్చు.

స్టెప్ 5: లాగిన్ అయిన తరువాత ఇ-ఎంట్రీ దర్శన్ ఎంపికను ఎంచుకోవాలి.

స్టెప్ 6: తరువాత ఎంత మంది దర్శనానికి వెళుతున్న వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి. అలాగే మీకు అవసరమైతే అదనపు లడ్డస్ కూడా ఎంచుకోవచ్చు.

స్టెప్ 7: తరువాత తేదీని ఎంచుకోండి మరియు అందుబాటులో ఉన్న సమయ స్లాట్‌లను ఎంచుకోని ముందుకు కొనసాగడానికి 'కంటిన్యూ' ఎంపిక మీద నొక్కండి.

How to Book TTD Rs.300 Darshan Tickets on online

స్టెప్ 8: ఇప్పుడు యాత్రికులుగా మీతో పాటు వచ్చే ఇతర వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి. ప్రజల చెల్లుబాటు అయ్యే ID లను నమోదు చేయండి.

స్టెప్ 9: ఇది పూర్తయిన తర్వాత పేమెంట్ ఎంపికపై క్లిక్ చేసి మీకు అనుకూలమైన మోడ్ ప్రకారం ఆన్‌లైన్‌లో డబ్బును చెల్లించండి. పేమెంట్స్ విజయవంతమైన తరువాత మీరు మీ టిక్కెట్లను అందుకుంటారు. వీటిని మీరు PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
How to Book TTD Rs.300 Darshan Tickets on online

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X