ఆండ్రాయిడ్ ఫోన్‌లో గేమ్స్‌ని పరిగెత్తించడం ఎలా ? ( సింపుల్ ట్రిక్స్ )

Posted By: M KRISHNA ADITHYA

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది కామన్ అయిపోయింది. అందరూ స్మార్ట్‌ఫోన్లను రకరకాలుగా వాడేందుకు ప్రయత్నిస్తుంటారు. కొంతమంది సోషల్ మీడియా కోసం, మరికొంతమంది ఛాటింగ్ కోసం, ఇంకొంతమంది గేమ్స్ కోసం ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా గేమ్స్ కొరకు ఫోన్లను ఉపయోగించే వారికోసం గూగుల్ ప్లే స్టోర్లో ఎన్నో రకాల గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి అన్నింటినీ టచ్ చేసి గేమ్స్ ఆడాలని చాలామంది భావిస్తుంటారు. అయితే వారి స్మార్ట్‌ఫోన్ ఆ గేమ్స్ కి సపోర్ట్ చేయకపోయినా వాటిని ఇన్‌స్టాల్ చేసుకుని ఆడేస్తుంటారు. దీనివల్ల ఫోన్ స్ట్రక్ అయి నానా ఇబ్బందుకులకు గురిచేస్తూ ఉంటుంది. అలాంటి వారు వెంటనే ఇంకో ఫోన్ కొనలేక ఉన్న ఫోన్ పనిచేయక గేమ్స్ ఆడలేక చాలా బాధపడుతుంటారు. అయితే వారు బాధపపపడనవసరం లేకుండా కొన్ని ట్రిక్స్ పాటిండం ద్వారా ఫోన్లో గేమ్ performanceని మరింతగా పెంచుకుని ఎంజాయ్ చేయవచ్చు. అదెలాగో చూద్దాం.

మీ మొబైల్ ఫోన్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి ( సింపుల్ ట్రిక్స్ )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూటింగ్ చేయగడం ద్వారా..

1.మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్ రూట్ చేయనట్లయితే ఓ సారి దాన్ని రూట్ చేయండి.

2.రూట్ చేసిన తరువాత మీరు మీ ఫోన్లో ప్లే స్టోర్ నుండి GITools (Graphic Optimizer)ఆండ్రాయిడ్ యాప్ ని ఇన్‌స్టాల్ చేయండి. ఇది మీ ఫోన్ performanceని మరింతగా బూస్ట్ చేస్తుంది.

3. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే మీరు దాన్ని ఒకే చేయడం ద్వారా ఇన్‌స్టాల్ విజయవంతం అయినట్లు కనిపిస్తుంది. తరువాత సిస్టం సెట్టింగ్స్ ని కంట్రోల్ చేయడం ద్వారా మంచి పనితీరుని పొందవచ్చు.

4. GIToolsలో మీకు అదనపు plugin అవసరం ఉంటుంది. TEX(DE)coderద్వారా ఇది పనిచేస్తుంది. దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి.

5. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తరువాత మీరు అక్కడ కనిపించే సూచనలు పాటించాలి. టర్మ్స్ కండీషన్ల్స్ ఓకే చేయాలి. అది ఒకే చేయగానే మీ ఫోన్ మళ్లీ ఓ సారి రీబూటెడ్ చేయాల్సిఉంటుంది.

6. రీ బూటెడ్ చేసిన తరువాత మీరు ఏ గేమ్ కావాలనుకుంటున్నారో దాన్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేసుకోండి. గేమ్స్ డౌన్లోడ్ కాగానే ఏ గేమ్ అయితే మీరు బూస్ట్ కావాలనుకుంటున్నారో దాన్ని లిస్ట్ చేసుకుంటే సరిపోతుంది.

 

రూటింగ్ చేయగడం ద్వారా..

7.మీరు గేమ్ ని బూస్ట్ కోసం సెలక్ట్ చేసుకున్న తరువాత మీకు కొన్ని రకాల ఆప్సన్లు కనిపిస్తాయి. వాటిని మీరు మీ requirementsకి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మీరు ఈ మార్పులను చేయాల్సి ఉంటుంది.
1)Anti-aliasing (MSAA/CSAA)

2)Render resolution (రెండర్ రిజల్యూషన్ )

3)Force 16-bit rendering ( ఫోర్స్ 16 బిట్ రెండరింగ్ )

4)Optimize GLSL shaders ఆప్టిమైజ్ GLSL షేడర్స్ )

5)Enable Texture decompression

6)Enable Texture recompression

7)Downscale Textures

8)Use FPS counter

9)FPS update delay

ఈ ప్రాసెస్ పూర్తికాగానే మీ డివైస్ గేమ్ బూస్టింగ్ కి రెడి అయినట్లే. మీరు మీకు నచ్చిన గేమ్ ని ఎటువంటి అంతరాయం లేకుండా ఆడుకోవచ్చు.

 

ఆండ్రాయిడ్ డెవలపర్ ఆప్సన్ ఉపయోగించి..

మీ మొబైల్ కొనుగోలు సమయంలోనే మీకు అనేక రకాలైన యాప్స్ అందులో ఫ్రీ లోడెడ్ అయి వస్తాయి. వాటిల్లో option Force 4x MSAA కూడా ఒకటి. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవడం ద్వారా కూడా మీ ఫోన్ పనితీరుని వేగవంతం చేసుకోవచ్చు.ఎలాగంటే..

1.ముందుగా మీరు మీ డెవలపర్ ఆప్సన్ ఎనేబుల్ చేసుకోవాలి. సెట్టింగ్స్ ఆప్సన్ యాక్సెస్ చేసుకున్న తరువాత మీరు డెవలపర్ ఆప్సన్ ని 4 లేక 5 సార్లు ట్యాప్ చేయండి.

2. ఆ తరువాత డెవలపర్ ఆప్సన్ యాక్సెస్ చేయండి.

3.తరువాత 4x MSAA optionని ఎనేబుల్ చేయండి.

4.అయితే ఈ రకమైన మెథడ్ లో మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోయే సమస్య ఉంటుంది. కాని గేమ్ పనితీరు చాలా స్మూత్ గా ఉంటుంది. కాబట్టి ఆలోచించుకుని ఈ స్టెప్ ఫాలో కావాల్సి ఉంటుంది.

 

ర్యామ్ పెంచుకోవడం ద్వారా

మీరు మీ ర్యామ్ పెంచుకోవడం ద్వారా కూడా మీరు మంచి పనితీరుని కనపరిచే విధంగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ ని మలుచుకోవచ్చు. దానికోసం ఈ స్టెప్స్ ఫాలో కండి.

1. మీ ఆండ్రాయిడ్ ఫోన్ ముందుగా రూట్ చేయాలి.

2. ఆ తరువాత మీరు Roehsoft RAM Expanderని డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి.

3. అది ఇన్ స్టాల్ కాగానే superuser permissionని అనుమతించాల్సి ఉంటుంది.

4. మీ మెమొరీ కార్డు నుంచి కాని లేకుంటే మొత్తం మీ మొబైల్లో ఉన్న ఉచిత ర్యామ్ ని కాని మీరు ఇప్పుడు సెట్ చేసుకోవాలి.

5. ఈ ప్రాసెస్ ముందుకెళ్లేందుకు ఓ రెండు నిమిషాల సమయం తీసుకుంటుంది.

6. ప్రాసెస్ పూర్తి అయిన తరువాత మీరు మీ ఎస్ డి కార్డుని సెలక్ట్ చేసుకుని ఆ ఫైల్ ని యాక్టివ్ చేసుకోవాలి.

7. ఆ తరువాత మీరు వెనకకు వెళ్లి అక్కడ మెయిన్ పేజీలో కనిపించే Swipe/Activeని ట్యాప్ చేసిన తరువాత కొద్ది సెకండ్లు వెయిట్ చేయండి.

 

 

ప్రత్యామ్నాయ మార్గాలు

వీటితో పాటు కొన్ని ప్రత్యామ్నాయ యాప్స్ కూడా గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో గేమ్స్ పనితీరుని మరింతగా పెంచుకోవచ్చు. అవి
a)Dr. Booster

b)Game Booster

c)CM GameBooster

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The array of games flooding the Play Store is a delight to many and sour grapes for another many. Not everyone has the phone equipped with the hardware capable of handling the demands of high-end games available in the market.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot