గూగుల్ ఇమేజ్ సెర్చి మాయం అయ్యిందా..అయితే వెతకండిలా !

Posted By: M KRISHNA ADITHYA

గూగుల్ లో ఇమేజ్ సెర్చి బటన్ మీ బ్రౌజర్ లో మిస్ అయ్యిందా ? అయితే ఖంగారు పడకండి ఇది సాధారణమే. ఫోటోస్ లేదా పెయింటింగ్స్, ఇతర చిత్రాల కాపీ రైట్స్ ను కాపాడుకోవడంలో భాగంగా గూగుల్ ఇమేజ్ సెర్చి ఆప్షన్ ను తొలగించింది. ఫలితంగా వ్యూ ఇమేజ్, అలాగే సెర్చి బై ఇమేజ్ (అంటే ఫోటోను అప్‌లోడ్ చేసి బ్రౌజ్ చేసే పద్ధతి)ని తొలగించింది. ఇది ఒక రకంగా కంటెంట్ ప్రొటెక్షన్ కోరుకునే పలువురు పబ్లిషర్స్ మేలు చేసే మూవ్ గానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైన కంటెంట్ కి సంబంధించిన ఇమేజీలను వెతికే ఈ టూల్స్ మాయం కావడం పట్ల చాలా మంది నెటిజన్లు ఇబ్బంది పడుతున్నారు.

అదిరే ఆఫర్లతో షియోమి స్మార్ట్‌టీవీ అమ్మకాలు, ఫీచర్లు, ధర, మరిన్ని వివరాలు మీకోసం..

అయితే పూర్తిగా ఖంగారు పడాల్సిన పనిలేదు ఎందుకంటే, అఫిషియల్ గా కాకపోయినా అనఫిషియల్ అయిన థర్డ్ పార్టీ టూల్స్ ద్వారా ఈ సెర్చి బై ఇమేజి ఆప్షన్ పొందవచ్చు. అది ఎలాగో చూద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అఫీషియల్ గా వ్యూ ఇమేజ్ ఆప్షన్ పొందే మార్గం..

ఎలాంటి థర్డ్ పార్టీ యాడ్ ఆన్స్ లేకుండా వ్యూ ఇమేజెస్ ఆప్షన్ పొందవచ్చు. ముందుగా మీరు పొందాలనుకుంటున్న ఇమేజ్ ని సెర్చింజన్ లో వెతికండి. ఇమేజీ ప్రత్యక్షం అవ్వగానే దాన్ని క్లిక్ చేయండి, "ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ టాబ్" ఆప్షన్ క్లిక్ చేయగానే సోర్స్ ఫైల్ లోకి వెళుతుంది. అనంతరం సేవ్ ఇమేజ్ యాస్ ఆప్షన్ ద్వారా సెర్చి ఇమేజెస్ ఆప్షన్ పొందవచ్చు.
ఆలస్యం మీకు నచ్చిన ఇమేజెస్ పొందండి.

 

 

 

థర్డ్ పార్టీ టూల్ ద్వారా ఇమేజెస్ పొందడం

గూగుల్ క్రోమ్ లేదా మోజిల్లా ఫైర్ ఫాక్ష్ లాంటి పాత వెర్షన్లను వాడుతూ ఉంటే ఈ థర్డ్ పార్టీ టుల్స్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. వ్యూ ఇమేజ్ థర్డ్ పార్టీ టూల్ ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఇమేజీ సెర్చి చేయవచ్చు. ఈ ఎక్స్ టెన్షన్‌టూల్ క్రోమ్ వెబ్ స్టోర్, అలాగే ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్స్ లో లభిస్తుంది. ఒక్కసారి ఈ ఎక్స్ టెన్షన్ ను యాడ్ చేయగానే వ్యూ ఇమేజ్ ఆప్షన్ అలాగే, సెర్చ్ బై ఇమేజ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మరింకెందుకు

విజిట్‌ పేజ్‌ బటన్‌ ద్వారా..

వ్యూ ఇమేజ్‌ బటన్‌ను తొలగించేశాం అని, యూజర్లకు, ఆధారిత వెబ్‌సైట్లకు ఉపయోగకరంగా ఉండాలనే ఈ పని చేశామని గూగుల్‌ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. దీని ద్వారా విజిట్‌ పేజ్‌ బటన్‌ ద్వారా ఆధారిత వెబ్‌‌సైట్‌కు యూజర్‌ వెళ్తాడు. తద్వారా తమ ఆదాయం పెంచుకునేందుకే గూగుల్‌ ఈ పని చేసినట్లు స్పష్టమౌతోంది.

హై డెఫినేషన్‌ ఫోటోలు కావాలనుకుంటే..

హై డెఫినేషన్‌ ఫోటోలు కావాలనుకుంటే తప్పనిసరిగా ఆ వెబ్‌సైట్‌ను ఆశ్రయించాల్సిందేనని గూగుల్‌ చెబుతుండగా.. ప్రత్యామ్నయ మార్గాలను కూడా వెతుక్కునే పనిలో యూజర్లు పడ్డారు. మరి ఇది నిజంగా యూజర్లను నిరాశకు గురిచేసే వార్తేనంటూ పలువురు నిరాశను వ్యక్తం చేశారు కూడా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to bring back the missing 'View Image' and 'Search by Image' buttons on Google search more news at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot