Home
How to

Right Geyser : గీజర్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. ఇవి కచ్చితంగా చూసుకోవాలి..!

శీతాకాలంలో అనేక మంది గీజర్‌లు (Geyser) కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అనేక సంస్థల గీజర్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే గీజర్‌లను కొనుగోలు చేసే సమయంలో అవగాహన కలిగి ఉండడం ఉత్తమం. లేకుంటే జేబు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. అయితే గీజర్‌ ను కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. పూర్తి వివరాలు.

గీజర్‌లు కొనుగోలు చేసే సమయంలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దీంతో ప్రమాదాలకు జరగకుండా నివారించవచ్చు. దీంతోపాటు కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా గీజర్‌ సామర్థ్యాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటితోపాటు మరిన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.

How to Buy right geyser telugu news

* అవసరానికి తగినట్లుగా గీజర్‌ సామర్థ్యం ఉండాలి :
సరైన అవగాహన లేకపోవడంతో అనేక మంది అధిక సామర్థ్యం కలిగిన గీజర్‌లను ఎంచుకుంటారు. దీని వల్ల డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరియు విద్యుత్ ఛార్జీలు కూడా అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.

మీ ఇంట్లో 2-3 మంది సభ్యులు ఉంటే.. 15 లీటర్ల వరకు సామర్థ్యం కలిగిన గీజర్‌ మీ అవసరాలు తీరుస్తుంది. అదే అంతకంటే ఎక్కువ మంది సభ్యులు కలిగిన ఇళ్లల్లో 25 లీటర్లు సామర్థ్యం కలిగిన గీజన్‌ ను కొనుగోలు చేయడం ఉత్తమం.

* విద్యుత్ వినియోగం :
సాధారణంగా గీజర్‌ లు అధికంగా విద్యుత్‌ ను ఉపయోగించుకుంటాయి. అందువల్ల BEE రేటింగ్‌ కలిగిన ఉత్పత్తులను ఎంచుకోవాలి. 5 - స్టార్‌ రేటింగ్ కలిగిన గీజర్‌ ధర కాస్త ఎక్కువగా ఉంటాయి. అయినా అలాంటి మోడల్స్‌నే కొనుగోలు చేయడం ఉత్తమం. ఫలితంగా తక్కువ విద్యుత్‌ తో సరైన పనితీరును అందిస్తుంది.

How to Buy right geyser telugu news

* వీటిని పట్టించుకోవడం లేదా? :
గీజర్‌లను కొనుగోలు చేసే సమయంలో అనేక మంది ప్రముఖ బ్రాండ్‌ లకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే బ్రాండ్‌తోపాటు ట్యాంక్‌ నాణ్యత, వారంటీని కూడా కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. స్టీల్‌ లేదా గాజు కోటింగ్‌ కలిగి ఉన్న (Glass Lined) ట్యాంకులు మన్నిక ఇస్తాయి.

గీజర్‌ ట్యాంకుతోపాటు వారంటీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కనీసం 4-5 సంవత్సరాల వారంటీని పొందే మోడల్‌ ను ఎంచుకోవడం ఉత్తమం. ఏదైనా సందర్భంలో డ్యామేజీ అయితే, మరమ్మతు చేయించేందుకు అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు.

* భద్రతే అత్యంత ప్రధానం :
గీజర్‌ను కొనుగోలు చేసే సమయంలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రెజర్‌ రిలీజ్‌ వాల్వ్, థర్మోస్టాట్‌ కంట్రోల్‌, ఆటో కటాఫ్‌ వంటి భద్రతా ఫీచర్లు ఉండాలి. దీంతోపాటు ఇన్‌స్టాల్‌ చేసే సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్‌స్టాల్‌ సమయంలో అప్రమత్తంగా లేకుంటే షార్ట్‌ సర్క్యూట్‌ లేదా గీజర్‌ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.

* డిస్కౌంట్‌ల పేరుతో మోసపోవద్దు :
ఆన్‌లైన్ లేదా స్థానిక మార్కెట్లలో గీజర్‌లు కొన్ని సందర్భాల్లో భారీ డిస్కౌంట్‌, తగ్గింపు ధరలకు అందుబాటులోకి వస్తుంటాయి. అయితే తక్కువ ధరను చూసి, కొనుగోలు చేయకుండా.. వారంటీ, భద్రతా ఫీచర్లు, BEE రేటింగ్‌, సరైన భద్రతా ప్రమాదాలు పాటించే బ్రాండ్‌లను ఎంచుకోవడం ఉత్తమం.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Buy right geyser here are the best tips in telugu, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X