మొబైల్ నుండి రెల్వే టికెట్ క్యాన్సిల్ చేసుకుని రీఫండ్ పొందడం ఎలా, సింపుల్ స్టెప్స్ మీకోసం !

రైళ్లలో టికెట్లు బక్‌ చేసుకునే వాళ్లందరికీ ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌ తెలుసు.అందరూ అందులోకి వెళ్లి ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తారు.

|

రైళ్లలో టికెట్లు బక్‌ చేసుకునే వాళ్లందరికీ ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌ తెలుసు. అందరూ అందులోకి వెళ్లి ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తారు. దేశమంతా అదే సైట్‌ను ఓపెన్‌ చేస్తుంటారు ప్రయాణికులు. ఒక్కోసారి ట్రాఫిక్‌ ఎక్కువైపోయి ఆ సైటు ఎంతకూ ఓపెన్‌ అవ్వదు. టికెట్లు బుక్‌ చేసుకోవాలన్నా, క్యాన్సిల్‌ చేయాలన్నా చాలా టైమ్‌ పడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఐఆర్‌సిటిసి యాప్‌ను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) అందుబాటులోకి తీసుకువచ్చింది. మీరు అన్నిరకాల పనులు ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు. బుకింగ్, క్యాన్సిలైజేషన్ లాంటివి చేయవచ్చు. అదీగాక గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌కు ఫోర్‌స్టార్‌ రేటింగ్‌ వచ్చింది. అయితే టికెట్ క్యాన్సిల్ ఎలా చేసుకోవాలి అనేదానిపై మీకు కొన్ని రకాల టిప్స్ ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ. 14 వేలకే ఆకట్టుకునే ల్యాప్‌టాప్, మంచి అవకాశంరూ. 14 వేలకే ఆకట్టుకునే ల్యాప్‌టాప్, మంచి అవకాశం

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా మీరు మీ మొబైల్ లోని ప్లే స్టోర్ నుండి IRCTC Rail Connect Appని డౌన్లోడ్ చేసుకోవాలి. అది డైన్లోడ్ అయిన తరువాత ఇన్ స్టాల్ చేయాలి. అందులో మీ వివరాలతో లాగిన్ కావాలి.

స్టెప్ 2

స్టెప్ 2

లాగిన్ కాగానే మీకు లెప్ట్ వైపున ఓ మెనూ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ మీకు వివిధ రకాల ఆప్సన్లు కనిపిస్తాయి. అందులో టికెట్ క్యాన్సిల్ అనే ఆప్సన్ కూడా ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి.

Image source : zeebiz.com

స్టెప్ 3
 

స్టెప్ 3

దాన్ని క్లిక్ చేయగానే మీరు క్యాన్సిల్ చేయాలనుకున్న టికెట్ల వివరాలు అన్ని ప్రత్యక్షమవుతాయి. వాటిల్లో మీరు ఏది క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ టికెట్లు బుక్ చేసి అన్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే సెలక్ట్ ఆల్ కొడితే సరిపోతుంది.

Image source : zeebiz.com

స్టెప్ 4

స్టెప్ 4

అది క్లిక్ చేయగానే మీకు లెప్ట్ పేజీలో File TDR కనిపిస్తుంది. అందులో మీరు ప్రయాణించే టికెట్ వివరాలు కనిపిస్తాయి.

Image source : zeebiz.com

 స్టెప్ 5

స్టెప్ 5

దాన్ని చివరిగా సెలక్ట్ చేసుకుని మీరు అక్కడ కింద కనిపించే కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు మీరు వేరే పేజీలోకి వెళతారు.

Image source : zeebiz.com

స్టెప్ 6

స్టెప్ 6

వేరే పేజీలోకి వెళ్లగానే అక్కడ మీకు టికెట్ క్యాన్సిల్ ఎందుకు చేసుకుంటున్నారు అనే వివరాలు కనిపిస్తాయి. మీరు ఏదో ఒక రీజన్ అందులో టైప్ చేయాల్సి ఉంటుంది.

Image source : zeebiz.com

 స్టెప్ 7

స్టెప్ 7

రీజన్ ఎంటర్ చేసిన తరువాత మీకు టికెట్ క్యాన్సిల్ కన్ఫర్మ్ చేయాలా అని అడుగుతుంది. మీరు వివరాలు అన్నీ చెక్ చేసుకుని దాన్ని ట్యాప్ చేస్తే మీ టికెట్ క్యాన్సిల్ అవుతుంది.

Image source : zeebiz.com

Image source : zeebiz.com

Best Mobiles in India

English summary
How to cancel train ticket online and get refund: Indian Railways IRCTC Rail Connect App makes it easy; check steps More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X