మీ ఫోన్ వాల్‌పేపర్ గంటగంటకి మారిపోవాలా..?

తన ఫోన్‌ను మరింత క్రియేటివ్‌గా మార్చుకోవాలని ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ తాపత్రపడుతుంటాడు. ఫోన్‌‍ను అందమైన‌లుక్‌ను తీసుకువచ్చు అంశాల్లో స్ర్కీన్ వాల్ పేపర్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఓ డిఫరెంట్ లుక్‌తో కూడిన స్ర్కీన్ వాల్‌పేపర్ మీ ఫోన్ లుక్‌నే మార్చివేయగలదు.

మీ ఫోన్ వాల్‌పేపర్ గంటగంటకి మారిపోవాలా..?

యూట్యూబ్ గో.. ఇంటర్నెట్ లేకుండా వీడియోలు చూడండి

అటువంటి వాల్‌పేపర్స్ గంటగంటకి మీ ఫోన్ పై స్ర్కీన్ ఛేంజ్ అవుతున్నట్లయితే, ఎప్పుడు చూసినా మీ ఫోన్ ఫ్రెష్ లుక్‌లోనే కనిపిస్తుంది. ఫోన్ వాల్‌పేపర్స్ షెడ్యూల్ టైమ్‌లో మారిపోయే విధంగా మీ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వాల్‌‌ పేపర్‌లను వరస క్రమంలో సెట్ చేసుకుని వాటిని స్ర్కీన్ పై ర్యాండమైజ్ చేసుకునేందుకు అనేక ప్రొసీజర్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ప్రొసీజర్ 1

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Wallpaper Changer అనే అప్లికేషన్‌ను, మీ ఫోన్‌‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.

స్టెప్ 2

ఇన్ స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత యాప్‌ను మీ డివైస్‌లో లాంచ్ చేయండి. యాప్ ఓపెన్ అయిన తరువాత యాప్ పేజీకి సంబంధించిన డిస్‌ప్లే పై కనిపించే red barను క్లిక్ చేయటం ద్వారా live wallpaper feature ఎనేబుల్ అవుతుంది.

స్టెప్ 3

ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. వాటిలో మొదటి ఆప్షన్ ద్వారా వాల్‌పేపర్ ప్రతి 30 నిమిషాలు లేదు ప్రతి 60 నిమిషాలకు మారిపోయే విధంగా టైం ఇంటర్వెల్‌‌ను సెట్ చేసుకోవచ్చు. ఇక రెండవ ఆప్షన్‌లో భాగంగా లాక్ స్ర్కీన్ పై మారే వాల్‌పేపర్ లను కాన్ఫిగర్ చేసుకోవచ్చు.

స్టెప్ 4

ఈ రెండు ఆప్షన్‌లను మీ అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకున్న తరువాత యాప్ స్ర్కీన్ పై ఎడమ వైపు నుంచి కుడి వైపుకు స్వైప్ చేయటం ద్వారా కొన్ని సెక్షన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో album సెక్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీకు నచ్చిన ఫోటోలను సెలక్ట్ చేసుకునే వీలుంటుంది. ఇవే ఆండ్రాయిడ్ వాల్ పేపర్స్‌లా మారిపోతాయి. ఇప్పుడు యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాల్ పేపర్స్ సైజ్ అలానే అప్పీరియన్స్‌ను, మీకు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

స్టెప్ 1

ప్రొసీజర్ 2

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి SB Wallpaper Changer అనే అప్లికేషన్‌ను, మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత యాప్‌ను మీ డివైస్‌లో లాంచ్ చేయండి.

స్టెప్ 2

యాప్ స్ర్కీన్ పై కనిపించే "Settings" పై టాప్ ఇవ్వండి. ఇక్కడ enable the checker అనే ఆప్షన్‌ను టిక్ చేసి directoryని సెలక్ట్ చేసుకోండి. డైరక్టరీ ద్వారా, ఫోన్ ఇమేజ్ గ్యాలరీలోకి వెళ్లి మీకు కావల్సిన ఫోటోలను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 3

ఇప్పుడు యాప్ హోమ్ స్ర్కీన్ పైకి వచ్చి "Set This App To Live Wallpaper" ఆప్షన్ పై టాప్ ఇవ్వండి. ఇక్కడ టైం ఇంటర్వెల్‌ను మార్చుకున్నట్లయితే వాల్ పేపర్స్ వాటంతటకవే మారిపోతుంటాయి.

ఎలాంటి వెబ్‌సైట్ నుంచైనా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Change Android Wallpaper After A Particular Time Interval. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting