ఎటిఎం పిన్ మర్చిపోతే మార్చుకోవడం ఎలా ?

ఇప్పుడున్న ప్రస్తుత కాలానికి చేతిలో స్మార్ట్ ఫోన్ లేనివాళ్లు వ్యాలెట్ లో ఎటిఎం కార్డు లేని వాళ్ళు ఎవరు ఉండరు.

By Anil
|

ఇప్పుడున్న ప్రస్తుత కాలానికి చేతిలో స్మార్ట్ ఫోన్ లేనివాళ్లు వ్యాలెట్ లో ఎటిఎం కార్డు లేని వాళ్ళు ఎవరు ఉండరు.ఎందుకంటే ప్రతిఒక్కరికి ఇవి రెండు తప్పనిసరి. అయితే ఒక్కోసారి మనం డెబిట్ కార్డు పిన్ మర్చిపోయి 3 సార్లు రాంగ్ పిన్ ఎంటర్ చేస్తుంటాం. ఆలా రాంగ్ పిన్ ఎంటర్ చేసినప్పుడు డెబిట్ కార్డు వెంటనే బ్లాక్ అయిపోతుంది మల్లి డెబిట్ కార్డు తిరిగి పని చేయడానికి 24 గంటల సమయం పడుతుంది.అయితే ఇప్పుడున్న టెక్నాలజీకి కొత్త పిన్ యాక్టివేట్ చేసుకోవడానికి పెద్ద సమయం పట్టదు వెంటనే యాక్టివేట్ చేసుకోవచ్చు . ఈ శీర్షికలో భాగంగా ఎటిఎం కార్డు పిన్ మర్చిపోతే తిరిగి కొత్త పిన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో మీకు తెలుపుతున్నాము.

ఎటిఎం కార్డు పిన్ తెలుసుకోవడనికి....

ఎటిఎం కార్డు పిన్ తెలుసుకోవడనికి....

ఎటిఎం కార్డు పిన్ తెలుసుకోవడానికి డెబిట్ కార్డు బ్యాంకు అకౌంట్ నెంబర్ అలాగే బ్యాంకు అకౌంట్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్ కచ్చితంగా ఉండాలి.

BANKING అనే ఆప్షన్ ....

BANKING అనే ఆప్షన్ ....

ATM మెషిన్ లోATM కార్డు పెట్టిన వెంటనే మీకు BANKING అనే ఆప్షన్ కనిపిస్తుంది. వెంటనే BANKING ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.

PIN CHANGE /ATM PIN RESET....

PIN CHANGE /ATM PIN RESET....

బ్యాంకింగ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే PIN CHANGE లేదా ATM PIN RESET అనే ఆప్షన్ కనిపిస్తుంది అది సెలెక్ట్ చేయండి.

ENTER BANK ACCOUNT NUMBER ....

ENTER BANK ACCOUNT NUMBER ....

PIN CHANGE లేదా ATM PIN RESET ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ENTER BANK ACCOUNT NUMBER అని మిమ్మల్ని అడుగుతుంది వెంటనే బ్యాంకు అకౌంట్ నెంబర్ ను ఎంటర్ చేయండి.

PHONE NUMBER....

PHONE NUMBER....

బ్యాంకు అకౌంట్ నెంబర్ ను ఎంటర్ చేసాక మీ PHONE NUMBER ను కూడా అడుగుతుంది వెంటనే బ్యాంకు అకౌంట్ కు లింక్ చేసిన ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేయండి

OTP....

OTP....

ఫోన్ నెంబర్ ఎంటర్ చేసాక మీ ఫోన్ నెంబర్ కు OTP రావడం జరుగుతుంది. ఆ OTP ను ATM లో ఎంటర్ చేసాక PIN CHANGE అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ లోకి వెళ్ళి ఎటిఎం కార్డు పిన్ ను చేంజ్ చేసుకోవచ్చు. ఆలా చేసుకోవడం ద్వారా పాత ఎటిఎం పిన్ డిలీట్ అయ్యిపోయి కొత్త ఎటిఎం పిన్  యాక్టివేట్ అవుతుంది.

 

 

Best Mobiles in India

English summary
How To Change ATM Pin If You Forgot.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X