Zoom app యొక్క వీడియో కాన్ఫరెన్సింగ్ లో బ్యాక్‌గ్రౌండ్ మార్చడం ఎలా?

|

కరోనావైరస్ మహమ్మారి కారణంగా అన్ని దేశాలు తమ ప్రజలను ఇంటిలో ఉండమని లాక్డౌన్లను ప్రకటించింది. ఈ సమయంలో చాలా మంది ప్రజలు లైవ్ వీడియో కాలింగ్‌ ద్వారా వారి యొక్క పనిని ఇంటి వద్ద నుండే చేస్తున్నారు. సౌకర్యవంతంగా ఉన్నప్పుడు మీ యొక్క గది నుండి వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా మీ యొక్క ఆఫీస్ సహా ఉద్యుగులతో మాట్లాడవచ్చు. కానీ మీ యొక్క గది కారణంగా ఈ వీడియో కాన్ఫరెన్సింగ్‌ చాలా వరకు గజిబిజిగా ఉంటుంది. అయితే మీరు వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం జూమ్‌ను ఉపయోగిస్తుంటే కనుక మీరు మీ యొక్క బ్యాక్ గ్రౌండును మార్చుకోవడానికి అవకాశం ఉంది.

జూమ్ బ్యాక్ గ్రౌండ్ చేంజ్ ఫీచర్

జూమ్ బ్యాక్ గ్రౌండ్ చేంజ్ ఫీచర్

మీరు మీ యొక్క గదిలోని అన్ని రకాల విషయాలను దాచాలనుకుంటున్నారా? లేదా మీ తోటివారిని అలరించాలనుకుంటున్నారా అనే దానితో సంబంధం లేకుండా జూమ్ యొక్క బ్యాక్ గ్రౌండ్ చేంజ్ ఫీచర్ మీకు ఉపయోగపడుతుంది. మీకు కావలసిందల్లా సాదారణమైన బ్యాక్ గ్రౌండ్ లేదా ఆకుపచ్చ కలర్ లో గల ఒక స్క్రీన్ . మీరు గ్రీన్ స్క్రీన్ ఉపయోగిస్తే కనుక మీ బట్టలు రంగుతో సరిపోలడం లేదని నిర్ధారించుకోండి. మీ బ్యాక్ గ్రౌండును మార్చడానికి మీరు దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.

 

 

 

Google Duo లో ఒకే సారి 12 మందితో మాట్లాడవచ్చు!!!!Google Duo లో ఒకే సారి 12 మందితో మాట్లాడవచ్చు!!!!

జూమ్ యొక్క వర్చువల్ బ్యాక్ గ్రౌండ్ ను ఎలా సెట్ చేయాలి?
 

జూమ్ యొక్క వర్చువల్ బ్యాక్ గ్రౌండ్ ను ఎలా సెట్ చేయాలి?

స్టెప్ 1: వర్చువల్ బ్యాక్ గ్రౌండ్ ను సెట్ చేయడానికి మీకు కావలసినది శుభ్రమైన మరియు సాధారణ బ్యాక్ స్క్రీన్. మీ వెనుక శుభ్రమైన గోడ లేకపోతే గ్రీన్ స్క్రీన్ ఉపయోగించడం చాలా మంచిది. మీరు గ్రీన్ స్క్రీన్ ఉపయోగిస్తే మీరు ఇలాంటి రంగును ధరించకూడదు. ఇది మీ శరీరాన్ని వర్చువల్ నేపథ్యంతో విలీనం చేస్తుంది. అదేవిధంగా మీరు ఆకుపచ్చ తెరను ఉపయోగించకపోతే మీ గోడకు సమానమైన రంగును ధరించకుండా ఉండటానికి ప్రయత్నించండి.

స్టెప్ 2: ఈ ట్రిక్ జూమ్ డెస్క్‌టాప్ క్లయింట్ వెర్షన్ 4.6.0 మరియు అంతకంటే ఎక్కువ ఉంటె మాత్రమే పని చేస్తుంది. మీరు తక్కువ వెర్షన్ లో ఉంటే కనుక అన్నిటికంటే ముందుగా దాని యొక్క క్రొత్త అప్ డేట్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

 

 

 

వీడియో కాల్స్ చేస్తున్నారా, డేటా తగ్గించే చిట్కా మీకోసంవీడియో కాల్స్ చేస్తున్నారా, డేటా తగ్గించే చిట్కా మీకోసం

 

జూమ్

స్టెప్ 3: మూడవ దశలో మీ యొక్క జూమ్ పోర్టల్‌కు సైన్ ఇన్ చేయడం. మీరు సైన్ ఇన్ అయిన తర్వాత మీటింగ్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. ఇప్పుడు మీరు అకౌంట్ సభ్యులైతే మీరు మీటింగ్ సెట్టింగుల ట్యాబ్‌ను సులభంగా కనుగొనవచ్చు. మీరు అకౌంట్ నిర్వాహకులైతే మై మీటింగ్ సెట్టింగ్‌లకు వెళ్లండి.


స్టెప్ 4: సెట్టింగ్‌ల ఎంపికలలోని ‘వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్' ఎంపిక మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ స్వంత అధిక రిజల్యూషన్ ఇమేజ్ ను అప్‌లోడ్ చేయవచ్చు. లేదా ప్రత్యామ్నాయంగా మీరు వెబ్ నుండి ఏదైనా రాయల్టీ రహిత ఇమేజ్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ఎంచుకోవచ్చు. మీరు వీడియోలను మీ నేపథ్యంగా కూడా సెట్ చేయవచ్చని గమనించండి. మీకు ఇప్పుడు జూమ్‌లో వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది.


వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్ ట్రిక్ iOS మరియు ఆపిల్ ఐప్యాడ్‌లలోని జూమ్ యాప్ లలో కూడా పని చేస్తుంది. మీరు మీటింగ్ లకు చేరుకున్న తర్వాత మోర్ ట్యాబ్‌కు నావిగేట్ చేయండి. అప్పుడు వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్ ఎంపిక కోసం చూడండి మరియు మీ యొక్క ఇమేజ్ ను సెట్ చేయండి.

 

Best Mobiles in India

English summary
How to Change Background during Zoom Video Conferences

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X