గూగుల్ ప్లే స్టోర్ లో కంట్రీను మార్చడం ఎలా?

|

ఆండ్రాయిడ్ యూజర్లు తమ గూగుల్ ప్లే స్టోర్ అకౌంట్ లో ఏ కంటెంట్ ను చూడగలరో అనేది గూగుల్ ప్లే కంట్రీ నిర్ణయిస్తుంది. దేశాన్ని బట్టి గూగుల్ ప్లే స్టోర్ లోని యాప్ లు, గేమ్ లు మరియు ఇతర కంటెంట్ కూడా మారవచ్చు.

ఆండ్రాయిడ్
 

కాబట్టి ఆండ్రాయిడ్ వినియోగదారులు మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్ లో కంట్రీను మార్చగలిగితే కనుక మీరు మరిన్ని కంటెంట్ లను కూడా యాక్సిస్ చేయవచ్చు. కంట్రీను మార్చడానికి అనుసరించాల్సిన కొన్ని సాధారణ దశలు తెల్సుకోవడానికి ముందుకు చదవండి.

ZEE5,హాట్స్టార్ సభ్యత్వంను ఉచితంగా అందిస్తున్న జియో ఫైబర్ కనెక్షన్

గూగుల్ ప్లేలో  కంట్రీను మార్చడం ఎలా?

గూగుల్ ప్లేలో కంట్రీను మార్చడం ఎలా?

గూగుల్ ప్లేలో ప్రస్తుతం ఉంటున్న మీ యొక్క దేశాన్ని మార్చడానికి మీరు గూగుల్ పేలో క్రొత్తగా మరొక దేశాన్ని సెటప్ చేయాలి. క్రొత్త దేశాన్ని సెటప్ చేయడానికి గూగుల్ ప్రకారం మీరు ఆ దేశంలో ఉండాలి మరియు క్రొత్త దేశం యొక్క పేమెంట్ పద్ధతిని కలిగి ఉండాలి. మీ గూగుల్ ప్లేలో దేశాన్ని మార్చడానికి క్రింద పేర్కొన్న ఈ దశలను అనుసరించండి.

ఛానెల్‌ల ధరలను పెంచుతున్న స్టార్ ఇండియా

ఆండ్రాయిడ్ ఫోన్

స్టెప్ 1: మొదటగా మీరు మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో గూగుల్ ప్లే స్టోర్‌ను ఓపెన్ చేయాలి.

స్టెప్ 2: ఇక్కడ మీరు మెనూ బటన్ మీద క్లిక్ చేసి ఆపై అకౌంట్ మరియు తరువాత కంట్రీ మరియు ప్రొఫైల్స్ ఎంపిక మీద నొక్కాలి.

స్టెప్ 3: తరువాత మీరు మీ యొక్క అకౌంట్ లో జోడించదలిచిన దేశాన్ని ఎన్నుకోవాలి.

ఆండ్రాయిడ్ 10 MIUI 11 అప్‌డేట్‌తో షియోమి రెడ్‌మి K20

పేమెంట్ పద్ధతి
 

స్టెప్ 4: తరువాత ఆ దేశానికి సంబందించిన పేమెంట్ పద్ధతిని జోడించడానికి మీరు స్క్రీన్ లో కనిపించే సూచనలను పాటించాలి.

స్టెప్ 5: మొదటి పేమెంట్ పద్ధతి మీ యొక్క ప్రొఫైల్‌కు జతచేస్తున్న దేశం నుండి ఉండాలి. మీరు ప్రొఫైల్‌ను సృష్టించిన తర్వాత ఇతర దేశాల పేమెంట్ పద్ధతులను కూడా జోడించవచ్చు.

స్టెప్ 6: ఇది క్రొత్త దేశానికి దానికి అనుసంధానించబడిన క్రొత్త గూగుల్ పేమెంట్ ప్రొఫైల్‌ను సృష్టిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ స్వయంచాలకంగా కొత్త దేశానికి మారుతుంది. మార్చడానికి 24 గంటలు పట్టవచ్చు.

ముఖ్యమైన గమనికలు

ముఖ్యమైన గమనికలు

**** ఇక్కడ గమనించదగిన కొన్ని ముఖ్యమైన గమనికలు కూడా ఉన్నాయి. మీరు సంవత్సరానికి ఒకసారి మాత్రమే గూగుల్ ప్లేలో దేశాన్ని మార్చగలరు. కాబట్టి మీరు మీ దేశాన్ని మార్చినట్లయితే దానిని 1 సంవత్సరం వరకు మళ్ళి మార్చలేరు.

**** గుర్తుంచుకోవలసిన మరొక విషయం క్రొత్త దేశంలో మీరు మీ దేశాన్ని మార్చినప్పుడు మీ పాత దేశంలో ఉన్న మీ గూగుల్ ప్లే బ్యాలెన్స్‌ను ఉపయోగించలేరు.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Change Country in Google Play Store Step by Step Guide

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X