మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్‌ని మార్చడం ఎలా?

|

ప్రస్తుత స్మార్ట్ యుగంలో స్మార్ట్‌పరికరాలను అధికంగా ఉపయోగిస్తున్న వారికి గూగుల్ అసిస్టెంట్ వంటి వర్చువల్ అసిస్టెంట్‌లు వినియోగదారుల యొక్క జీవితాలను మరింత సులభతరం చేశాయి. వినియోగదారులు వారి యొక్క అన్ని రకాల పనులను హ్యాండ్స్-ఫ్రీ పద్ధతిలో నిర్వహించడానికి వర్చువల్ అసిస్టెంట్‌లు వీలును కల్పిస్తాయి. తద్వారా రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్‌ను నియంత్రించడం లేదా లైట్లను ఆపివేయడం వంటి వాటిని నియంత్రించడం వంటి రోజువారీ పనులను సులభతరం చేస్తుంది.

 

గూగుల్ అసిస్టెంట్

గూగుల్ అసిస్టెంట్ విషయానికి వస్తే సాధారణంగా మనం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్మార్ట్ అసిస్టెంట్‌ని ఒకే వాయిస్ స్టైల్‌లో వింటాము. కానీ మీరు ప్రతిరోజూ ఒకే స్వరాన్ని వినడం విసుగు చెంది ఉంటే మరియు గూగుల్ అసిస్టెంట్ వాయిస్‌ని మార్చాలని చూస్తుంటే కనుక అందుకు ఒక మార్గం ఉంది. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్, ఐఫోన్ మరియు మీ స్మార్ట్ డిస్‌ప్లేలో గూగుల్ అసిస్టెంట్ వాయిస్‌ని మార్చాలని చూస్తుంటే కనుక కింద తెలిపే సులభమైన గైడ్ ను అనుసరించండి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్‌ని మార్చే విధానం

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్‌ని మార్చే విధానం

స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ముందుగా 'హే గూగుల్' అని చెప్పడం ద్వారా లేదా మీ ఫోన్ వైపు ఉన్న Google అసిస్టెంట్ బటన్‌ను నొక్కడం ద్వారా గూగుల్ అసిస్టెంట్‌ని యాక్టివేట్ చేయండి.

స్టెప్ 2: ఇప్పుడు 'చేంజ్ యువర్ వాయిస్‌' అని చెప్పండి.

స్టెప్ 3: మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై కనిపించే మ్యానేజ్ వాయిస్ సెట్టింగ్‌స్ బటన్‌ను నొక్కండి.

స్టెప్ 4: ఇప్పుడు ప్రతి వాయిస్‌ని వినడానికి వాయిస్ ప్రీసెట్‌ల ద్వారా స్క్రోల్ చేయండి. మీకు నచ్చిన మరియు ఉపయోగించాలనుకునే వాయిస్ మీద నొక్కండి. ఇలా చేయడంతో మీరు కొత్త వాయిస్‌తో గూగుల్ అసిస్టెంట్ ని ఉపయోగించవచ్చు.

 

గూగుల్ యాప్‌ని ఉపయోగించి మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్‌ని మార్చే విధానం
 

గూగుల్ యాప్‌ని ఉపయోగించి మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్‌ని మార్చే విధానం

స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: యాప్ యొక్క కుడివైపు ఎగువ మూలలో ఉన్న మీ ప్రొఫైల్ గుర్తుపై నొక్కండి.

స్టెప్ 3: ఇప్పుడు సెట్టింగ్‌ల బటన్‌ను నొక్కండి.

స్టెప్ 4: స్క్రీన్‌లో కింది భాగంలో గూగుల్ అసిస్టెంట్‌ని ఎంచుకోండి.

స్టెప్ 5: ఇప్పుడు అన్ని సెట్టింగ్‌ల విభాగంలో అసిస్టెంట్ వాయిస్ & సౌండ్స్ ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 5: ప్రతి వాయిస్‌ని వినడానికి వాయిస్ ప్రీసెట్‌ల ద్వారా స్క్రోల్ చేయండి మరియు మీరు ఉపయోగించాలనుకుంటున్న దాన్ని ఎంచుకోండి.

 

స్మార్ట్ డిస్‌ప్లేలో గూగుల్ అసిస్టెంట్ వాయిస్‌ని మార్చే విధానం

స్మార్ట్ డిస్‌ప్లేలో గూగుల్ అసిస్టెంట్ వాయిస్‌ని మార్చే విధానం

స్టెప్ 1: మీ గూగుల్ అసిస్టెంట్ పవర్డ్ స్మార్ట్ డిస్‌ప్లేలో Google Home యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: డిస్ప్లే యొక్క కుడివైపు ఎగువ మూలలో ఉన్న మీ ప్రొఫైల్ ఫోటోని నొక్కండి.

స్టెప్ 3: ఇప్పుడు అసిస్టెంట్ సెట్టింగ్‌ల ఎంపికను కనుగొని దాని మీద నొక్కండి.

స్టెప్ 4: "అల్ సెట్టింగ్‌స్" విభాగంలో అసిస్టెంట్ వాయిస్ ఎంపికను కనుగొని దాని మీద నొక్కండి.

స్టెప్ 5: అందుబాటులో ఉన్న అన్ని వాయిస్‌ని స్క్రోల్ చేయండి మరియు మీరు ఉపయోగించాలనుకుంటున్న వాయిస్‌ని ఎంచుకోవడానికి దాని మీద నొక్కండి.

 

ఆపిల్ ఐఫోన్ లేదా ఐప్యాడ్ లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్‌ని మార్చే విధానం

ఆపిల్ ఐఫోన్ లేదా ఐప్యాడ్ లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్‌ని మార్చే విధానం

స్టెప్ 1: మీ ఆపిల్ ఐఫోన్ లేదా iPadలో గూగుల్ అసిస్టెంట్ యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: యాప్ యొక్క కుడివైపు ఎగువ మూలలో ఉన్న మీ ప్రొఫైల్ ఫోటో మీద నొక్కండి.

స్టెప్ 3: తర్వాత సెట్టింగ్‌ల మెనుకి వెళ్లండి.

స్టెప్ 4: ఇక్కడ అసిస్టెంట్ వాయిస్ ఎంపికను కనుగొని దాని మీద నొక్కండి.

స్టెప్ 5: ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని వాయిస్‌లని స్క్రోల్ చేయండి మరియు మీరు ఉపయోగించాలనుకుంటున్న దాన్ని ఎంచుకోవడానికి దాని మీద నొక్కండి.

 

Best Mobiles in India

English summary
How to Change Google Assistant Voice on Your Android Phone, iphone and Smart Display

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X