MyJio App ద్వారా SSID పేరు మరియు పాస్‌వర్డ్‌ను మార్చడం ఎలా?

|

బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో జియోఫైబర్ పేరుతో రిలయన్స్ జియో ప్రవేశించినప్పటి నుంచి విభిన్నమైన ప్లాన్లతో చందాదారులను ఆకట్టుకుంటూ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. జియోఫైబర్ వినియోగదారుల అనుభవాన్ని పెంచడానికి జియో వివిధ సేవలను అందిస్తుంది. వినియోగదారులు భద్రత మరియు ఇతర కారణాల వల్ల JioFiber కనెక్షన్ యొక్క యూసర్ నేమ్ మరియు పాస్‌వర్డ్‌ను తరచూ మార్చడానికి ప్రయత్నిస్తారు. సాధారణంగా వినియోగదారులు తమ సెట్టింగులను వెబ్ బ్రౌజర్ ద్వారా కాన్ఫిగర్ చేస్తారు. జియో వినియోగదారులు మైజియో యాప్ ద్వారా SSID పేరు మరియు పాస్‌వర్డ్‌ను కాన్ఫిగర్ చేయడానికి వారిని అనుమతిస్తుంది.

 
How to Change JioFiber Wi-Fi SSID Name and Password Through MyJio App?

MyJio App ద్వారా SSID పేరు మరియు పాస్‌వర్డ్‌ను మార్చే విధానం

 

జియోఫైబర్ SSID పేరు మరియు పాస్‌వర్డ్‌ను మార్చడానికి మీ స్మార్ట్‌ఫోన్‌లో MyJio యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి.

** ఈ యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత మీ నమోదిత మొబైల్ నంబర్ ద్వారా సైన్-ఇన్ చేసి మీ సంబంధిత JioFiber అకౌంటును ఎంచుకోండి.

** జియో యాప్ లోని 'మై డివైస్' విభాగానికి నావిగేట్ చేయండి.

** తదుపరి స్క్రీన్‌లో కనెక్ట్ చేయబడిన డివైస్ లకు సంబంధించిన అన్ని వివరాలను చూడవచ్చు.

** Wi-Fi సెట్టింగులను ఓపెన్ చేసి మీ JioFiber కనెక్షన్ యొక్క SSID పేరు మరియు పాస్‌వర్డ్‌ను మార్చండి.

How to Change JioFiber Wi-Fi SSID Name and Password Through MyJio App?

** MyJio యాప్ ను ఉపయోగించి 2.4Ghz మరియు 5Ghz బ్యాండ్ నెట్‌వర్క్‌ల కోసం SSID పేరు మరియు పాస్‌వర్డ్‌ను మార్చడానికి మీకు ఎంపిక లభిస్తుంది.

** మీరు పేరు మరియు పాస్‌వర్డ్‌ను మార్చిన తర్వాత మీ JioFiber కనెక్షన్‌లోని డివైస్ లను తిరిగి కనెక్ట్ చేయండి.

జియోఫైబర్ రూటర్ సెట్టింగులను మార్చే ఇతర పద్ధతి

How to Change JioFiber Wi-Fi SSID Name and Password Through MyJio App?

జియోఫైబర్ కనెక్షన్ యొక్క రౌటర్ సెట్టింగులను మార్చడానికి వేరే పద్ధతి కూడా ఉంది. జియో యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా రౌటర్ సెట్టింగులను మార్చవచ్చు. అధికారిక సైట్‌ను ఓపెన్ చేసి JioFiber విభాగంలో సర్వీస్ ID మరియు మీ నమోదిత ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో OTP ప్రత్యేకమైన కోడ్‌ను అందుకున్న తర్వాత సెట్టింగులకు నావిగేట్ చేయండి. SSID మరియు పాస్‌వర్డ్ ఎంపికపై క్లిక్ చేసి అవసరమైన మార్పులు చేయండి.

Best Mobiles in India

English summary
How to Change JioFiber Wi-Fi SSID Name and Password Through MyJio App?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X