గూగుల్ క్రోమ్‌లో భాషను మార్చటం ఎలా..?

|

ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసిస్తోన్న అత్యంత శక్తివంతమైన బ్రౌజర్‌లలో Google Chrome ఒకటి. అత్యధిక మార్కెట్ షేర్‌ను కలిగి ఉన్న ఈ బ్రౌజర్‌ను ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలు మాట్లాడుతోన్న యూజర్లు వినియోగించుకుంటున్నారు. క్రోమ్ బ్రౌజర్‌లో డీఫాల్ట్ లాంగ్వేజ్‌గా ఇంగ్లీష్ అందుబాటులో ఉంటుంది. ఇంగ్లీష్.. యూనివర్శల్ భాష కావటంతో ప్రతి ఒక్కరు ఈ భాషను సలువుగా అర్థం చేసుకోగలుగుతున్నారు.

ఇంటర్నెట్ లేకుండానే వెబ్‌ సర్ఫ్ చేయవచ్చు,మీకోసం కొత్త ఫీచర్

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే
భాషను మార్చుకునే అవకాశాన్ని గూగుల్ క్రోమ్ కల్పిస్తోంది...
 

భాషను మార్చుకునే అవకాశాన్ని గూగుల్ క్రోమ్ కల్పిస్తోంది...

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వేరు భాషల్లో వినియోగించుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇటువంటి వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా భాషను మార్చుకునే అవకాశాన్ని గూగుల్ క్రోమ్ కల్పిస్తోంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ ఇంకా Mac ప్లాట్‌ఫామ్‌లలో క్రోమ్ బ్రౌజర్ ను వినియోగించుకుంటోన్న యూజర్లు తమ బ్రౌజర్ లాంగ్వేజ్‌ను ఏ విధంగా మార్చుకోవాలి అనేదాని పై స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

ఆండ్రాయిడ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా..

ఆండ్రాయిడ్ డివైసెస్‌లో క్రోమ్ బ్రౌజర్ భాషను మార్చాలనుకుంటున్నట్లయితే ఆండ్రాయిడ్ సిస్టం సెట్టింగ్స్‌లో పలు మార్పు చేర్పులను చేయవల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ భాషను మార్చటం ద్వారా క్రోమ్ ఆ భాషకు సంబంధించిన యూఐ ఎలిమెంట్స్‌ను డిస్‌ప్లే చేయగలుతుంది. ఇలా చేసేందుకు ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెర్చ్ సెట్టింగ్స్ కాలమ్‌లో Language అని టైప్ చేసి magnifying glass ఐకాన్ టాప్ ఇవ్వండి.

అన్ని యూఐ ఎలిమెంట్స్ అదే భాషలో..

ఇప్పుడు ఓపెన్ అయ్యే రిజల్ట్స్‌లో Languages ఆప్షన్ మీకు కనిపిస్తుంది. లాంగ్వేజెస్ ఆప్షన్ సెలక్ట్ చేసుకున్న వెంటనే వివిధ భాషలతో కూడిన జాబితా స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. వాటిలో మీకు కావల్సిన భాషను సెలక్ట్ చేసుకన్నట్లయితే ఫోన్ డీఫాల్ట్ లాంగ్వేజ్ ఆటోమెటిక్‌గా మారిపోతుంది. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్‌ను మీరు ఓపెన్ చేసినట్లయితే అన్ని యూఐ ఎలిమెంట్స్ కూడా అదే భాషలో కనిపిస్తాయి.

విండోస్ డివైస్‌లో క్రోమ్ బ్రౌజర్ భాషను మార్చాలనుకుంటున్నట్లయితే..
 

విండోస్ డివైస్‌లో క్రోమ్ బ్రౌజర్ భాషను మార్చాలనుకుంటున్నట్లయితే..

విండోస్ ప్లాట్‌ఫామ్‌లలో క్రోమ్ బ్రౌజర్ భాషను మార్చాలనుకుంటున్నట్లయితే ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి ఈ యూఆర్ఎల్‌ను chrome://settings/?search=language అడ్రస్ బార్‌లో పేస్ట్ చేసి, ఆ తరువాత ఎంటర్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ పేజీలోకి వెళ్లిన తరువాత language ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే, ఆ ప్రదేశంలోనే మరికొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి.

వెర్టికల్ డాట్స్ ఐకాన్ పై క్లిక్ చేసి..

వాటిలో Add Languages ఆప్షన్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన భాషను సెలక్ట్ చేసుకుని Add బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఆ భాష విజయవంతంగా యాడ్ అవుతుంది. మీరు యాడ్ చేసుకున్న భాషను క్రోమ్ డీఫాల్ట్ లాంగ్వేజ్‌గా సెట్ చేయాలనుకున్నట్లయితే పక్కనే కనిపించే వెర్టికల్ డాట్స్ ఐకాన్ పై క్లిక్ చేసి Display Google Chrome in this language ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీరు యాడ్ చేసుకున్న భాషను క్రోమ్ డీఫాల్ట్ లాంగ్వేజ్‌గా మారిపోతుంది.

Mac కంప్యూటర్‌లో క్రోమ్ బ్రౌజర్ భాషను మార్చాలనుకుంటున్నట్లయితే...

Mac కంప్యూటర్‌లో క్రోమ్ బ్రౌజర్ భాషను మార్చాలనుకుంటున్నట్లయితే ముందుగా System preferencesను ఓపెన్ చేసి Language and Region విభాగంలోకి వెళ్లాలి. ఇక్కడ లెఫ్ట్ ప్యానల్ క్రింద కనిపించే + బటన్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన భాషను యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసిన భాషను డీఫాల్ట్ భాషగా ఉంచాలనుకుంటున్నారా అంటూ ఓ ప్రాంప్ట్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఈ ప్రాంప్ట్‌ను Accept చేసినట్లయితే మీరు యాడ్ చేసుకున్న భాష్ క్రోమ్ డీఫాల్ట్ లాంగ్వేజ్‌గా మారిపోతుంది.

ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో క్రోమ్ బ్రౌజర్ భాషను మార్చాలనుకుంటున్నట్లయితే..

ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో క్రోమ్ బ్రౌజర్ భాషను మార్చాలనుకుంటున్నట్లయితే ముందుగా డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి General > Language & Regionలోకి వెళ్లండి. ఇక్కడ Add language ఆప్షన్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన భాషను సెలక్ట్ చేసుకోండి. భాష సెలక్ట్ అయిన తరువాత టాప్ రైట్‌లో కనిపించే Edit ఆప్షన్ పై క్లిక్ చేసి మీ preferred languageను టాప్ పొజీషన్‌కు మూవ్ చేసుకోండి. దీంతో మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్‌కు సంబంధించి డీఫాల్ట్ మీరు ఎంపిక చేసుకున్న విధంగా మారిపోతుంది. ఇదే సమయంలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో కూడా మార్పు చేర్పులు చోటు చేసుకుంటాయి.

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

English summary
Google Chrome is probably the world’s most popular browser in terms of market share. That means different people, who speak various languages, use the browser. If you aren’t happy with the default language on Google Chrome (English) and you want to change it, you can change it on all platforms fairly easily.

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more