Just In
- 16 hrs ago
Signal యాప్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చే వాట్సాప్ ఫీచర్లు ఇవే...
- 1 day ago
WhatsApp వెబ్ ఇంటర్ఫేస్లో కాలింగ్ ఫీచర్స్!! న్యూ అప్డేట్ మీద ఓ లుక్ వేయండి...
- 1 day ago
విద్యార్థులకు ఉచిత laptop లు, గ్రామాల్లో Unlimited ఇంటర్నెట్. AP సర్కార్ ఆలోచన.
- 1 day ago
JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ అరుదైన రికార్డ్!!
Don't Miss
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
WhatsAppలోని చాటింగ్ మిస్ అవ్వకుండా మొబైల్ నంబర్ మార్చడం ఎలా?
వాట్సాప్ ప్రపంచంలో అధిక మంది క్రియాశీల వినియోగదారులను కలిగి ఉండి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ లలో ఒకటిగా ఉంది. వినియోగదారులు ఎవరైనా సరే తమ యొక్క మొబైల్ నంబర్‌తో వాట్సాప్ అకౌంటును ఓపెన్ చేయవచ్చు. కాని వారు తమ యొక్క మొబైల్ నంబర్‌ను మార్చాలనుకుంటే మాత్రం వారు తమ యొక్క అన్ని చాట్లు మరియు డేటాను కోల్పోవలసి ఉంటుంది. ఇది ఎంత వరకు నిజం వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
వాట్సాప్ వినియోగదారుల కోసం దాదాపు ప్రతిరోజూ కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. కొన్ని నెలల క్రితం వాట్సాప్ తన వినియోగదారుల యొక్క చాటింగ్ సమాచారం, ఫోటోలు మరియు వీడియోలను కోల్పోకుండా వారి యొక్క మొబైల్ నెంబర్లను మార్చుకోవడానికి ఒక మార్గాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ప్రస్తుతం iOS మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందరికి అందుబాటులో ఉంది. కింద ఉన్న కొన్ని సాధారణ పద్దతులను పాటించి మీ యొక్క వాట్సాప్ నెంబర్‌ను సులభంగా మార్చవచ్చు.
మీ వాట్సాప్ నెంబర్‌ను మార్చే విధానం
స్టెప్ 1: మొదట మీరు మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: మీ యొక్క ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3: సెట్టింగ్ మెనుని ఎంచుకోండి.
స్టెప్ 4: ఆ తరువాత అకౌంట్ ఎంపికను ఎంచుకోవడానికి క్రిందికి స్క్రోల్ చేయండి.
స్టెప్ 5: ఇందులో అందుబాటులో గల చాలా ఎంపికలలో 'చేంజ్ నెంబర్' ఎంపిక మీద క్లిక్ చేయండి.
స్టెప్ 6: ఆ తరువాత "నెక్స్ట్" మీద క్లిక్ చేయండి. అలాగే తరువాత మీ యొక్క కొత్త మొబైల్ నెంబర్‌ను జోడించండి.
స్టెప్ 7: వాట్సాప్ మీ కొత్త నంబర్‌ను OTTతో ధృవీకరించిన తరువాత మొబైల్ నెంబర్ పూర్తిగా మారినట్లు చూడవచ్చు.
వాట్సాప్ యొక్క ఫోన్ నంబర్ మార్చబడిన తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ లకు మార్చినట్లు తెలియజేయబడతాయి. వ్యక్తిగత పరిచయాలకు మాత్రమే కాకుండా గ్రూపులలో కూడా మీ కొత్త వాట్సాప్ నంబర్ గురించి తెలియజేయబడుతుంది. ఈ ఫీచర్ తో మీ యొక్క అన్ని చాట్లు, మీడియా ఫైల్లు మరియు వాట్సాప్‌లో షేర్ చేయబడిన ఇతర డేటా పూర్తిగా డెలిట్ అవ్వకుండా అలాగే ఉంటాయి. వాట్సాప్ ఫోన్ నంబర్ మార్చడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190