మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? మీరే సరిచేసుకోండి

మీ పాన్ కార్డులో తప్పులున్నాయా..? వాటిని సరిచేసు కోవాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. పాన్ కార్డులలో చోటుచేసుకునే ఎర్రర్స్‌ను ఇక పై ఓ సింపుల్ ఆన్‌లైన్ ప్రాసెస్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు.

|

మీ పాన్ కార్డులో తప్పులున్నాయా..? వాటిని సరిచేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. పాన్ కార్డులలో చోటుచేసుకునే ఎర్రర్స్‌ను ఇక పై ఓ సింపుల్ ఆన్‌లైన్ ప్రాసెస్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ పాన్ కార్డులో చోటుచేసుకున్న ఎర్రర్స్‌ను NSDL లేదా UTITSL వెబ్‌సైట్స్ ద్వారా సవరించుకోవచ్చు. NSDL వెబ్‌సైట్ ద్వారా మీ పాన్ కార్డును అప్‌డేట్ చేసుకునేందుకు ఈ క్రింది ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి.

సరికొత్త నోకియా 8 సిరోకో ఫీచర్లు చూస్తారా..!సరికొత్త నోకియా 8 సిరోకో ఫీచర్లు చూస్తారా..!

ముందుగా ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి...

ముందుగా ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి...

ముందుగా ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. సైట్‌లోకి వెళ్లిన తరువాత అప్లికేషన్ టైప్‌లో Changes or Correction in existing PAN Data / Reprint of PAN Card (No changes in existing PAN Data) అనే ఆప్షన్‌ను మీరు సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. తదుపరి స్టెప్‌లో భాగంగా క్యాటగిరీని సెలక్ట్ చేసుకుని మిగిలిన్ డిటెయిల్స్‌ను ఫిల్ చేయవల్సి ఉంటుంది. వివరాలు మొత్తం ఫిల్ చేసిన తరువాత captcha కోడ్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.

డాక్యుమెంట్స్‌ను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది...

డాక్యుమెంట్స్‌ను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది...

తరువాత ఓపెన్ అయ్యే పేజీలో మీ పాన్ డాక్యుమెంట్స్‌ను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. వెరిఫికేషన్ నిమిత్తం ఉపయోగించబడే ఈ డాక్యుమెంట్స్‌ను రెండు పద్థతుల్లో సబ్మిట్ చేయవచ్చు. మొదటి పద్థతిలో భాగంగా e-KYC ద్వారా, రెండవ పద్థతిలో భాగంగా ఫిజికల్‌గా డాక్యుమెంట్‌లను సబ్మిట్ చేయవల్సి ఉంటుంది.

ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి..
 

ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి..

తరువాతి స్టెప్‌లో red asteriskతో మార్క్ చేసి ఉన్న అన్ని ఖాళీల్లో మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఈ ఖాళీల్లో ఎంటర్ చేసిన వివరాలు మీ ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో ఖచ్చితంగా మ్యాచ్ అయి ఉండాలి. వివరాల ఎంట్రీలో ఏదైనా మిస్‌మ్యాచ్ జరిగినట్లయితే అథంటికేషన్ ప్రక్రియ అనేది సజావుగా సాగదు. కాబట్టి డిటెయిల్స్ ఎంటర్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.

 e-KYC ద్వారా డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలనుకుంటున్నట్లయితే...

e-KYC ద్వారా డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలనుకుంటున్నట్లయితే...

వివరాలను ఎంటర్ చేసిన తరువాత అప్లికేషన్ తో పాటు మీరు సబ్మిట్ చేయాలనుకుంటోన్న డాక్యుమెంట్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఒకవేళ మీరు e-KYC ద్వారా డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలనుకుంటున్నట్లయితే డిటెయిల్స్‌ను ఎంటర్ చేసిన ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేయండి.

పేమెంట్ ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది..

పేమెంట్ ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది..

తరువాతి స్టెప్‌లో భాగంగా రివిజన్ ఆఫ్ పాన్‌కార్డ్ లేదా రీప్రింట్ ఆఫ్ పాన్‌కార్డ్ నిమిత్తం రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించేందుకు Confirm బటన్ పై క్లిక్ చేసి మీ పేమెంట్ డిటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. లావాదేవీ విజయవంతంగా పూర్తయిన వెంటనే, మీరు చేసిన ఆన్‌లైన్ పేమెంట్ తాలుకా బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్ అలానే లావాదేవీ రిఫరెన్స్ నెంబర్లు ఓ పేజీలో మీకు అందుతాయి. ఈ రెండు నెంబర్లను మీరు సేవ్ చేసుకోవల్సి ఉంటుంది.

Authenticate బటన్ పై క్లిక్ చేసినట్లయితే..

Authenticate బటన్ పై క్లిక్ చేసినట్లయితే..

తరువాతి స్టెప్లో భాగంగా మీ ఆధార్ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్‌ను అథంటికేట్ కావల్సి ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ క్రింద కనిపించే బాక్స్‌కు టిక్ చేసి Authenticate బటన్ పై క్లిక్ చేసినట్లయితే మీ డిటెయిల్స్ వెరిఫై కాబడతాయి. ఈ ప్రొసీజర్ పూర్తయిన వెంటనే Continue with e-Sign / e-KYC ఆప్షన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది.

 

 

 Generate OTP పై క్లిక్ చేసినట్లయితే...

Generate OTP పై క్లిక్ చేసినట్లయితే...

తరువాతి స్టెప్‌లో భాగంగా చెక్ బాక్స్ పై టిక్ చేసి Generate OTP పై క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్‌కు OTP జనరేట్ అవుతుంది. ఈ ఓటీపీ కోడ్‌ను సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తవుతుంది. దీంతో పాటు acknowledgement కూడా మీ ఈ-మెయిల్ కు అందుతుంది. అప్‌డేట్ అయిన పాన్‌కార్డ్‌ను కొద్ది రోజుల్లోనే మీకు ఇష్ట్యూ చేయటం జరుగుతంది.

 

 

Best Mobiles in India

English summary
Applying for a PAN card online is an easy process that does not require submission of documents via post or courier. If you have lost your PAN card or if you want to change name on PAN card or update other details, then you can follow another simple process that is completely online.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X