IRCTC టికెట్‌లో ప్యాసింజర్ పేరును మార్చుకోవడం ఎలా ?
నిత్యమూ కోట్లాది మంది ప్రయాణించే రైళ్లలో వెయిటింగ్ లిస్టు జాబితా చాంతాడంత ఉంటుందన్న సంగతి విదితమే. టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదోనన్న టెన్షన్ ప్రయాణికులను కలవర పెడుతుంది.
నిత్యమూ కోట్లాది మంది ప్రయాణించే రైళ్లలో వెయిటింగ్ లిస్టు జాబితా చాంతాడంత ఉంటుందన్న సంగతి విదితమే. టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదోనన్న టెన్షన్ ప్రయాణికులను కలవర పెడుతుంది. అయితే, అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకున్న ఆన్ లైన్ రైల్వే టికెటింగ్ సేవల సంస్థ ఐఆర్సీటీసీ, ఇకపై బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎంత ఉన్నాయన్న విషయాన్ని ఎప్పటికప్పుడు చెబుతుంటుంది. భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) ఇప్పుడు యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ ని అందిస్తోంది. మీరు బుక్ చేసిన టికెట్లో పేరును మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ ప్రాసెస్ ఎలాగో చూద్దాం.

స్టెప్ 1
ముందుగా మీరు టికెట్ ఎవరిపేర మీద అయితే బుక్ చేసుకున్నారో ఆ వివరాలను ప్రింట్ రూపంలో తీసుకోవాలి.

స్టెప్ 2
ఆ వివరాలతో మీ సమీపంలోని రైల్వే స్టేషన్ కి వెళ్లాలి. దగ్గర్లో ఉన్న ఏ రైల్వే స్టేషన్ లో ఉండే రిజర్వేషన్ కౌంటర్ దగ్గరకు అయినా వెళ్లవచ్చు.

స్టెప్ 3
మీరు మీతో పాటుగా ఎవరైతే ప్రయాణం చేయాలలనుకుంటున్నారో వారి ఐడీ ఫ్రూపులను తీసుకువెళ్లాలి. అలాగే బుకింగ్ వివరాల టికెట్ ని కూడా మరచిపోకుండా తీసుకువెళ్లాలి.

స్టెప్ 4
అక్కడ రిజర్వేషన్ కౌంటర్ దగ్గరకు వెళ్లి ఎవరి పేరు మీదకు అయితే ఆ టికెట్ ను బదలాయించాలనుకుంటున్నారో వారి వివరాలను చెప్పి మార్చుకోవచ్చు. అయితే ఇది కేవలం 24 గంటల ముందు వరకే అనుమతి ఉంటుంది. కాబట్టి మీరు 24 గంటల లోపలే దీన్ని మార్చుకోవాల్సి ఉంటుంది.

స్టెప్ 5
ఐఆర్ సీటీసీలో పొందుపరిచిన వివరాల ప్రకారం మీ టికెట్ ను మీ బ్లడ్ రిలేషన్ ఉన్న సంబంధీకులకు father, mother, brother, sister, son, daughter, husband and wife లాంటి వారికి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

pnr స్టేటస్ వాట్సప్ ద్వారా....
కాగా రైల్వే సేవలను మెరుగు పరచడంలో భాగంగా ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా వివరాలను అందించడానికి మేక్ మై ట్రిప్ తో భారతీయ రైల్వే భాగస్వామ్యం చేసుకుంది. ప్రయాణీకులు pnr స్టేటస్ వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు. pnr స్టేటస్ కనుగొనడానికి ప్రజలు 139 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. ఇందుకోసం..

Steps to follow:
- మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న dailer యాప్ ను ఓపెన్ చేయండి
- ఫోన్ బుక్ లో 7349389104(official MakeMyTrip WhatsApp) నెంబర్ ను సేవ్ చేసుకోండి.
- నెంబర్ సేవ్ చేసుకున్న తరువాత వాట్సాప్ ఓపెన్ చేసి కాంటాక్ట్స్ లిస్ట్ ను రీఫ్రెష్ చేయండి
- సేవ్ చేసుకున్న కాంటాక్ట్ ను క్లిక్ చేసి చాట్ విండో ను ఓపెన్ చేయండి
- లైవ్ స్టేటస్ కోసం రైలు నెంబర్ ను అలాగే pnr స్టేటస్ కోసం pnr నెంబర్ ను enter చేయండి
- మెసేజ్ పంపిన వెంటనే మీకు లైవ్ స్టేటస్, pnr స్టేటస్,అప్ డేట్ వస్తుంది.
- వాట్సాప్ ఓపెన్ చేసి అందులో బాటమ్ రైట్ కార్నర్ లో ఉన్న ‘New message' ఐకాన్ ను నొక్కండి .
- ఇప్పుడు ఫై మూల లో ఉన్న మూడు డాట్స్ ను నొక్కండి అక్కడ మీకు 'Refresh' ఆప్షన్ కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్స్ లిస్ట్ రీఫ్రెష్ అయిపోతుంది.

To refresh your contact list:

Things to keep in mind:
మీరు పంపిన WhatsApp సందేశాల్లో 'బ్లూ' టిక్ మార్క్ ని చూసాక MakeMyTrip స్పందిస్తుంది. ప్రతి స్పందన సమయం కూడా విచారణల సంఖ్య లేదా సర్వర్ లోడ్ పై ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








