రైల్వే టికెట్‌లో పేరు మార్చుకోవడం ఎలా... ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసేందుకు వీలుందా..!
భారతీయ రైల్వేలో గతంలో పోలిస్తే టికెట్ల బుకింగ్ వ్యవస్థ ప్రస్తుతం సౌకర్యవంతంగా ఉంది. టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లో నిల్చొనే అవసరం లేకుండా.. IRCTC వెబ్ సైట్ మరియు యాప్ ద్వారా సులభంగా టికెట్ల ను బుకింగ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఆన్ లైన్ టికెట్లు రద్దు చేయడం కూడా సులభం. అయితే కొన్ని సార్లు ప్రయాణికుల పేర్లు తప్పుగా నమోదవుతాయి. అంటే ఒకరికి బదులుగా మరొకరికి టికెట్లు బుకింగ్ చేయడం వంటివి జరగవచ్చు. దీంతోపాటు టికెట్ల పై ప్రయాణికుల పేర్లను ( Railway Tickets ) మార్చుకొనే అవకాశం ఉంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంది. తప్పుగా నమోదైన పేర్లు లేదా ప్రయాణికుల పేర్లను సరిదిద్దుకొనే అవకాశం ఉంది. అయితే టికెట్, బుకింగ్ విధానం, మీరు పేరు మార్చేందుకు ప్రయత్నిస్తున్న సమయం వంటివి ప్రభావం చూపుతాయి. సాధారణంగా టికెట్ పై పేరు మార్చుకొనేందుకు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కు వెళ్లి ఐడీ కార్డు సహా అవసరం అయిన పత్రాలు అందించి మార్చుకోవచ్చు.

IRCTC ఖాతాలోకి. : అదే ఆన్ లైన్ విధానంలో టికెట్ పైన పేరు మార్చుకొనేందుకు IRCTC ఖాతాలోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. అనంతరం బోర్డింగ్ పాయింట్ మార్పు మరియు ప్రయాణికుల పేరు మార్పు ఫారంకు సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయాలి.
ఫారమ్ డౌన్ లోడ్ చేసి, అవసరం అయిన వివరాలను నమోదు చేయాలి. అనంతరం ఆ ఫారమ్ ను తిరిగి ఆన్ లైన్ లో అప్‌లోడ్ చేయాలి. ఈ పద్ధతి ద్వారా సులభంగా రైల్వే టికెట్ లో పేరు మార్చుకొనేందుకు అవకాశం ఉంది.
గుర్తింపు కార్డులు ఉండాలి :
దీంతోపాటు రైల్వే టికెట్ ను తమ కుటుంబ సభ్యులకు బదిలీ చేసేందుకు కూడా రైల్వే శాఖ అనుమతిస్తోంది. ఇందుకోసం రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కు వెళ్లాల్సి ఉంటుంది. టికెట్, గుర్తింపు కార్డు, మీరు ఎవరికి టికెట్ బదిలీ చేయాలని భావిస్తున్నారో వారి గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది.
దరఖాస్తు సహా వివరాలను అందించాలి :
ఆ పత్రాలు సమర్పించి టికెట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. దీంతోపాటు మీరు టికెట్ బదిలీ చేస్తున్న వ్యక్తి వివరాలను అందించాలి. అనంతరం కొత్త టికెట్ ను రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నుంచి పొందాలి. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని టికెట్ కౌంటర్ ను సంప్రదించాలి. ఫలితంగా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్ల కు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








