Gboardతో మీ ఫోన్ కీబోర్డ్ అదుర్స్, ఇప్పుడే ట్రై చేయండి..

ఈ స్మార్ట్‌ఫోన్‌లోని స్టాక్ ఆండ్రాయిడ్ కీబోర్డ్‌ను Gboard యాప్‌తో రీప్లేస్ చేసేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

|

ఫీచర్ ఫోన్‌లకు అప్‌డేటెడ్ మెడల్స్‌‌గా పుట్టుకొచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత సుఖమయం చేసేసాయి. స్మార్ట్‌ఫోన్‌లలోని టచ్‌స్ర్కీన్స్, ఆన్‌స్ర్కీన్ కీబోర్డ్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ యూజర్ ఫ్రెండ్లీ‌ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లకు చేరువచేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ కీబోర్డ్స్ విషయాని వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఫోన్‌లతో ఇన్‌బిల్ట్‌గా వస్తోన్న స్టాక్ ఆండ్రాయిడ్ కీబోర్డ్స్ యూజర్లను ఆకట్టుకోవటం విఫలమవుతున్నాయి.

కొత్త లుక్‌తో Redmi Note 4, ఈ రోజు నుంచే సేల్కొత్త లుక్‌తో Redmi Note 4, ఈ రోజు నుంచే సేల్

స్టాక్ ఆండ్రాయిడ్ కీబోర్డ్‌కు పూర్తిస్థాయి రీప్లేస్‌మెంట్‌గా

స్టాక్ ఆండ్రాయిడ్ కీబోర్డ్‌కు పూర్తిస్థాయి రీప్లేస్‌మెంట్‌గా

ఈ నేపథ్యంలో చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు థర్డ్ పార్టీ ఆండ్రాయిడ్ కీబోర్డ్ యాప్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో SwiftKey, GBoard వంటి కీబోర్డ్ యాప్‌లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. స్టాక్ ఆండ్రాయిడ్ కీబోర్డ్‌కు పూర్తిస్థాయి రీప్లేస్‌మెంట్‌గా భావిస్తోన్న గూగుల్ జీబోర్డ్ యాప్ అనేక ఆసక్తికర ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని స్టాక్ ఆండ్రాయిడ్ కీబోర్డ్‌ను Gboard యాప్‌తో రీప్లేస్ చేసేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి Gboard - the Google Keyboard
యాప్‌ను మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.

స్టెప్ 2

స్టెప్ 2

యాప్ ఇన్‌స్టాల్ అయిన తరువాత మీరు మెసేజ్ కంపోజ్ చేయాలనుకుంటున్న ఫ్లాట్‌ఫామ్‌(వాట్సాప్, జీమెయిల్, ఫేస్‌బుక్)లలోకి వెళ్లండి.

స్టెప్ 3

స్టెప్ 3

కీబోర్డ్ ఓపెన్ అయిన తరువాత నోటిఫికేషన్ సెంటర్‌ను స్వైప్ డౌన్ చేసినట్లయితే కీబోర్డ్‌కు సంబంధించిన పాపప్ సెట్టింగ్ కనిపిస్తుంది. ఆ పాపప్ పై క్లిక్ చేసినట్లయితే 'Languages and Input' పేజీలోకి మీరు రీడైరక్ట్ కాబడతారు. అక్కడ మీరు సిస్టం అండ్ లాంగ్వేజెస్‌ను మేనేజ్ చేసుకోవటంతో పాటు అదనపు భాషలను కూడా యాడ్ చేసుకునే వీలుంటుంది.

స్టెప్ 4

స్టెప్ 4

కీబోర్డ్స్ సెక్షన్‌లోకి వెళ్లి తాజాగా ఇన్‌స్లాల్ చేయబడిన Gboardను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ కీబోర్డ్ కాస్తా మినీ గూగుల్ సెర్చ్‌బార్‌లా మారిపోతుంది.

మేసెజింగ్ మరింత సౌకర్యవంతంగా

మేసెజింగ్ మరింత సౌకర్యవంతంగా

Gboard యాప్ ద్వారా మేసెజింగ్ మరింత సౌకర్యవంతంగానూ ఇదే సమయంలో అర్థవంతంగాను ఉంటుంది. GIF ఫైల్స్‌తో పాటు ఇమేజ్ ఫలితాలను కీబోర్డులోనే సెర్చ్ చేసుకునే వీలుంటుంది.

Best Mobiles in India

English summary
How to change the keyboard on your Android smartphone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X