గూగుల్ అసిస్టెంట్‌లో వాయిస్‌ను ఛేంజ్ చేయటం ఎలా..?
మనలోని చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటారు.
మనలోని చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటారు. ఈ ఫీచర్‌ను మీరు మరింత క్రియేటివ్‌గా వినియోగించుకోవాలనుకునేవారు ఓ సింపుల్ ట్రిక్‌ను యాడ్ చేయటం ద్వారా మల్టిపుల్ వాయిస్‌లను గూగుల్ అసిస్టెంట్‌కు యాడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత నుంచి నచ్చిన వాయిస్‌తో గూగుల్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేసుకునే వీలుంటుంది. ఆ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా యాప్‌ను ఓపెన్ చేసి..
గూగుల్ అసిస్టెంట్ వాయిస్‌ను ఛేంజ్ చేేసే క్రమంలో ముందుగా యాప్‌ను ఓపెన్ చేసిన స్ర్కీన్ టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే Blue icon పై క్లిక్ చేయిండి. ఇప్పుడు Explore window ఓపెన్ అవుతుంది. ఈ విండో టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే మెనూ బటన్ పై క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

preferences పేరుతో ఓ ఆప్షన్ కనిపిస్తుంది...
సెట్టింగ్స్‌లోకి వెళ్లి తరువాత preferences పేరుతో ఓ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే వెదర్, అసిస్టెంట్ వాయిస్, గెట్టింగ్ గ్రౌండ్ పేర్లతో మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో అసిస్టెంట్ వాయిస్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే వివిధ రకాల వాయిస్ టోన్‌లకు సంబంధించి బటన్లు మీకు కనిపిస్తాయి. వాటిలో నచ్చిన టోన్‌ను సెలక్ట్ చేసుకుని వినియోగించుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ సర్వీసుకు సంబంధించి వాయిస్ ఛేంజ్ చేయవల్సి వచ్చిన ప్రతిసారి ఇదేవిధమైన ప్రొసీజర్‌ను ఫోలో అయితే సరిపోతుంది.

అన్ని ఫోన్‌లలో ఇన్‌బిల్ట్ ఫీచర్‌గా..
గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌బిల్ట్ ఫీచర్‌గా వాస్తోంది. గూగుల్ నౌ యాప్‌తో కలిసి యూజర్లకు అసిస్టెంట్ సేవలందిస్తోంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ద్వారా అన్ని రకాల సెర్చ్ ఫలితాలను పొందే వీలుంటుంది. గూగుల్ అసిస్టెంట్ ద్వారా రిమైండర్స్‌తో పాటు అలర్ట్‌లను కూడా సెట్ చేసుకోవచ్చు.

విమాన రిజర్వేషన్స్ దగ్గర నుంచి హోటల బుకింగ్స్ వరకు..
గూగుల్ అసిస్టెంట్ ద్వారా విమాన రిజర్వేషన్లు, హోటల్ బుకింగ్స్, రాబోయే పర్యటన వివరాల కోసం Gmailను చెక్ చేసుకోవచ్చు. మీరు వివరాలు అడిగినప్పుడు, మీరు ఇతర పట్టణాలకు వెళ్లాలనుకున్నప్పుడు తేదీలను తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రోజు జరిగిన వార్తల అప్‌డేట్స్‌ను కూడా చెబుతుంది.


Click it and Unblock the Notifications








