Airtel Broadband ప్లాన్‌ను మార్చడానికి ఈ పద్దతులను పాటించండి...

|

బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోకి టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ ప్రవేశించిన తరువాత మిగిలిన వారికి పోటీ ఇవ్వడానికి ఇప్పటికప్పుడు అద్భుతమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను అందిస్తున్నది. ఈ ఎయిర్‌టెల్ సంస్థ ఇటీవల తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో అపరిమిత డేటా ప్రయోజనంను అందించడం ప్రారంభించింది. 40Mbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ ప్రయోజనాలను రూ.499 ధర వద్దనే కంపెనీ ప్రకటించింది. తక్కువ ధర వద్దనే లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు మీరు మారాలని చూస్తున్నట్లయితే దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How To Change Your Airtel Broadband Unlimited Plans Follow These Steps

కస్టమర్ కేర్‌కు కాల్ చేసే విధానం

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ యొక్క కస్టమర్ కేర్‌ నెంబర్ 121 లేదా 199కు కాల్ చేయడం ద్వారా మీ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను సులభంగా మార్చవచ్చు. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ లేదా ఎయిర్‌టెల్‌ ల్యాండ్‌లైన్‌ను ఉపయోగించి 121 లేదా 199 డయల్ చేసి కస్టమర్ కేర్ ప్రతినిధిని చేరుకున్న తరువాత మీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను మార్చమని అడగవచ్చు.

How To Change Your Airtel Broadband Unlimited Plans Follow These Steps

మై ఎయిర్‌టెల్ యాప్ ను ఉపయోగించే విధానం

మై ఎయిర్‌టెల్ యాప్ ను ఉపయోగించడం అనేది కొంత మందికి గజిబిజిగా ఉండవచ్చు. ఇందులో బ్రాడ్‌బ్యాండ్ యొక్క చివరి బిల్లులను తనిఖీ చేయడం, పేమెంట్ లను చేయడం మరియు ఏదైనా ప్రీపెయిడ్ నంబర్లను రీఛార్జ్ చేయడం వంటి స్వేచ్ఛను అందిస్తుంది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మై ఎయిర్‌టెల్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత మీ నమోదిత ఫోన్ నంబర్కు వచ్చిన OTPను ఉపయోగించి సైన్ అప్ చేయండి. ఇది పూర్తయిన తర్వాత ల్యాండ్‌లైన్ నంబర్‌ను ఉపయోగించి మీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను యాప్ కు జోడించండి. ఈ యాప్ లో మై ప్లాన్ ఎంపికలను ఎంచుకొని ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఇందులో చేంజ్ ప్లాన్ బటన్‌ను నొక్కడం ద్వారా ప్లాన్‌ను మార్చవచ్చు. తరువాత మీకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. దీని తరువాత మీరు ప్లాన్‌ మార్పును నిర్ధారించే SMS నోటిఫికేషన్‌ను స్వీకరిస్తారు.

Best Mobiles in India

English summary
How To Change Your Airtel Broadband Unlimited Plans Follow These Steps

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X