Just In
- 7 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 9 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 13 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 15 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
Apple ID పాస్‌వర్డ్ చేంజ్ చేసుకోవాలా..! మార్గాలపై ఓ లుక్కేయండి!
Apple యూజర్లకు Apple ID అనేది చాలా కీలకం. ఎందుకంటే ఐక్లౌడ్, యాప్ స్టోర్, ఐ మెసేజ్, ఫేస్ టైం, యాపిల్ మ్యూజిక్ సహా ఇతర కంపెనీ సేవల్ని వినియోగించుకోవాలంటే Apple ID తప్పనిసరి కాబట్టి. అంతేకాకుండా, కొత్త iPhone లేదా మరేదైనా నూతన Apple డివైజ్ లాగిన్ చేయడానికి కూడా Apple ID చాలా అవసరం. కాబట్టి, యాపిల్ యూజర్లకు యాపిల్ ఐడీతో పాటు దాని పాస్‌వర్డ్ గుర్తుపెట్టుకోవడం ఎంతో ముఖ్యం. అందువల్ల యూజర్లు ఆ రెండింటిని భద్రంగా గుర్తు ఉంచుకోవాలి.

కొన్ని సందర్భాల్లో వినియోగదారులు వారి Apple ID పాస్‌వర్డ్‌ను మరచిపోయే పరిస్థితులు తలెత్తుతాయి. అలాంటి సందర్భాల్లో యూజర్లు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా పాస్‌వర్డ్ మరిచిపోయిన వారికి మళ్లీ కొత్తగా పాస్‌వర్డ్ మార్చుకోవడం లేదా క్రియేట్ చేసుకోవడం కోసం యాపిల్ కంపెనీ వెసులుబాటును కల్పిస్తోంది. వారికే కాకుండా మిగతా యూజర్లు కూడా సెక్యురిటీ పరంగా కూడా ప్రతి కొద్ది నెలలకు ఓ సారి పాస్‌వర్డ్ మార్చుకోవాలని కంపెనీయే స్వయంగా సూచిస్తోంది. కాబట్టి వివిధ యాపిల్ డివైజ్‌లలో Apple ID పాస్‌వర్డ్ మార్చుకునే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

IOS డివైజ్‌లో యాపిల్ ఐడీ పాస్‌వర్డ్ మార్చడం ఎలా:
* ముందుగా సెటింగ్స్(Settings) లోకి వెళ్లి, అక్కడ కనిపించే మీ పేరు(Name/Apple Id) పై ట్యాప్ చేయాలి. అనంతరం పాస్‌వర్డ్ లేదా సెక్యూరిటీ (Password & Security) అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
* ఆ తర్వాత చేంజ్ పాస్‌వర్డ్ (Change Password) అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం యూజర్లు అక్కడ తమ డివైజ్ యొక్క పాస్‌కోడ్ (Passcode) ఎంటర్ చేసి.. ఆ వెంటనే కొత్త పాస్‌వర్డ్ ఎంటర్ చేసి కన్‌ఫర్మ్ చేయాలి.
* అనంతరం చేంజ్ పాస్‌వర్డ్ (Change Password) అనే బటన్ కనిపిస్తుంది.. దానిపై ట్యాప్ చేయాలి.
* పై ప్రక్రియ పూర్తి అయితే మీ యాపిల్ ఐడీ పాస్‌వర్డ్ చేంజ్ విజయవంతమైనట్లే.
MAC డివైజ్‌లో యాపిల్ ఐడీ పాస్‌వర్డ్ మార్చడం ఎలా:
* ముందుగా MAC కంప్యూటర్ స్క్రీన్‌పై ఎడమవైపు పైభాగంలో కనిపించే యాపిల్ మెనూ (Menu) పై క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత సిస్టమ్ ప్రిఫరెన్సెస్ (System Preference) సెక్షన్‌లోకి వెళ్లి యాపిల్ ఐడీని ఎంపిక చేసుకోవాలి.
* అనంతరం పాస్‌వర్డ్ లేదా సెక్యూరిటీ(Password & Security) ని ఎంపిక చేసుకోవాలి.
* ఆ తర్వాత పాస్‌వర్డ్ చేంజ్(Change Password) ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని.. ప్రస్తుతం ఉన్న పాస్‌వర్డ్ టైప్ చేసి.. దాని కింద మీరు కొత్త గా పెట్టుకోవాలనుకుంటున్న పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి చేంజ్(Change Password) అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఇక మీ యాపిల్ ఐడీ పాస్‌వర్డ్ విజయవంతంగా మార్పు జరుగుతుంది.

ఇతర డివైజుల నుంచి యాపిల్ ఐడీ పాస్‌వర్డ్ మార్చడం ఎలా:
* ముందుగా appleid.apple.com వెబ్‌సైట్ లోకి ఎంటర్ అవ్వాలి.
* ఆ తర్వాత మీ యాపిల్ ఐడీ అకౌంట్‌ను సైన్ ఇన్(Sign In) చేయాలి.
* అనంతరం పాస్‌వర్డ్ లేదా సెక్యూరిటీ (Password & Security) అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
* ఆ తర్వాత చేంజ్ పాస్‌వర్డ్(Change Password) అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం యూజర్లు అక్కడ తమ డివైజ్ యొక్క పాస్ కోడ్ ఎంటర్ చేసి.. ఆ వెంటనే కొత్త పాస్‌వర్డ్ టైప్ చేసి కన్‌ఫర్మ్ చేయాలి.
* అనంతరం చేంజ్ అనే బటన్‌పై ట్యాప్ చేస్తే.. మీ యాపిల్ ఐడీ పాస్‌వర్డ్ విజయవంతంగా మారిపోతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470