వాట్సప్‌లో మీ ఫోన్ నంబర్ మార్చడం ఎలా ?
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లతో అందరినీ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కొత్తగా కొన్ని ఫీచర్లను విడుదల చేసింది.
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లతో అందరినీ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కొత్తగా కొన్ని ఫీచర్లను విడుదల చేసింది. ఇప్పటికే అనేక రకాల ఫీచర్లను విడుదల చేసింది. ఇందులో వాట్సప్ గ్రూప్ వాయిస్, వీడియో కాలింగ్, స్టిక్కర్స్ ఫీచర్, ఛాటింగ్ ఫీచర్లు, ఇంకా అధునాతన ఫీచర్లను జోడించి వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తూ వస్తోంది. అయితే వాట్సప్ వాడుతున్నవారు ఒక్కోసారి నంబర్ ను మార్చుకోవాల్సి వచ్చిన సమయంలో కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. నంబర్ ఛేంజ్ ఎలా చేయాలో చాలామందికి తెలియడం లేదు. ఈ శీర్షికలో భాగంగా నంబర్ ఎలా మార్చాలి అనేదాని మీద కొన్ని రకాల ట్రిక్స్ను అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

ట్రిక్ 1
ముందుగా మీ కొత్త నంబర్ ఏదైతే తీసుకున్నారో దాన్ని మీ డివైస్ లో వేయండి.

ట్రిక్ 2
తరువాత వాట్సప్ ఓపెన్ చేయండి. మొబైల్ లో లేకుంటే ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోండి.

ట్రిక్ 3
వాట్సప్ ఓపెన్ చేయగానే మీ పాత నంబర్ వెరిఫై చేయాలా అని దానిని చెక్ చేసుకోండి. ఇందుకోం మీరు WhatsApp > Menu Button > Settingsలో కెళ్లి మీ ప్రొఫైల్ పిక్చర్ ని ట్యాప్ చేయండి.

ట్రిక్ 4
ఆ తరువాత WhatsApp > Menu Button > Settings > Account > Change number అనే ఆప్సన్ సెలక్ట్ చేసుకోండి.

ట్రిక్ 5
అక్కడ మీకు రెండు ఆప్సన్లు కనిపిస్తాయి. మొదటి ఆప్సన్లో మీ పాత నంబర్ ని ముందుగా ఎంటర్ చేయండి. రెండవ ఆప్సన్లో మీ కొత్త నంబర్ ఎంటర్ చేయండి.

ట్రిక్ 6
ఈ ప్రాసెస్ అయిన తరువాత మీరు దాన్ని ఒకే చేయండి. ఒకే అయిన తరువాత మీ కొత్త నంబర్తో వాట్సప్ చాట్ చేయవచ్చు.
ఐఫోన్ యూజర్లు వాట్పప్ సెట్టింగ్స్ ఓపన్ చేసి అక్కడ అకౌంట్ లో కెళితే ఛేంజ్ నంబర్ కనిపిస్తుంది. అక్కడ మీరు పైన చెప్పిన విధంగానే ప్రాసెస్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది.


Click it and Unblock the Notifications








