అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్ లో మీ ప్రొఫైల్ ఫోటోను మార్చడం ఎలా?

|

అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్ లలో అమెజాన్ ఒరిజినల్స్, మూవీస్ మరియు షోలలోని ప్రముఖ పాత్రల ద్వారా స్ఫూర్తి పొందిన ప్రొఫైల్ ఇమేజ్‌లను సెట్ చేసే సామర్థ్యాన్ని ప్రస్తుతం అందుబాటులోకి తెస్తోంది. కొన్ని కొత్త ప్రొఫైల్ ఫోటో ఎంపికలలో ది మార్వెలస్ మిసెస్ మైసెల్ నుండి మిడ్జ్ మరియు ది బాయ్స్ నుండి మదర్స్ మిల్క్ (లాజ్ అలోన్సో) వంటి పాత్రలు ఉంటాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలోని వినియోగదారులతో సహా వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోకి మద్దతు ఇచ్చే అన్ని పరికరాల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. మీరు మీ ప్రొఫైల్ పేజీలో ఫోటోని మార్చడానికి ఎడిట్ బటన్‌పై నొక్కడం ద్వారా ఈ కొత్త ప్రొఫైల్ ఫోటో ఎంపిక కనిపిస్తుంది.

 

అమెజాన్

అమెజాన్ కంపెనీ ఈ కొత్త ఫీచర్‌ను బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత్రలు అందుబాటులో ఉన్న సినిమాలు మరియు టీవీ సీరియల్స్ అయిన బోరాట్ సబ్ సీక్యూన్ట్ మూవీఫిల్మ్, బాష్, ది బాయ్స్, కమింగ్ 2 అమెరికా, ఫ్లీబాగ్, గుడ్ ఒమెన్స్, ది మార్వెలస్ మిసెస్ మైసెల్, ఇన్విన్సిబుల్, సిల్వీస్ లవ్, టామ్ క్లాన్సి జాక్ ర్యాన్, వన్ నైట్ ఇన్ మయామి, మేకింగ్ ది కట్, హుంటర్స్, ది టుమారో వార్, ది వైల్డ్స్, అప్‌లోడ్, ట్రూప్ జీరో, హన్నా, ది ఎక్స్‌పాన్స్ మరియు కార్నివాల్ రో వంటి మొదలైన వాటి నుండి పొందాయి.

ప్రైమ్ వీడియో యాప్, వెబ్‌సైట్, కనెక్ట్ చేయబడిన పరికరాల్లో మీ ప్రొఫైల్ ఫోటోను మార్చే విధానం
 

ప్రైమ్ వీడియో యాప్, వెబ్‌సైట్, కనెక్ట్ చేయబడిన పరికరాల్లో మీ ప్రొఫైల్ ఫోటోను మార్చే విధానం

IOS, Android మరియు Fire టాబ్లెట్ పరికరాల్లోని ప్రైమ్ వీడియో యాప్‌లోని ప్రొఫైల్ ఇమేజ్‌ని మార్చడానికి మొదటగా ప్రైమ్ వీడియో యాప్ హోమ్‌పేజీ దిగువన ఉన్న 'మై స్టఫ్' ఆప్షన్‌కి వెళ్లండి. డ్రాప్-డౌన్ మెనుని ఓపెన్ చేసి ప్రొఫైల్ పేరుపై క్లిక్ చేయండి. తరువాత మేనేజ్ ప్రొఫైల్‌ ఎంపికను ఎంచుకోండి. తరువాత మీకు నచ్చిన ప్రొఫైల్‌ని ఎంచుకోండి (ఒకవేళ మీకు ఒక ఖాతాలో బహుళ ప్రొఫైల్‌లు ఉంటే). ఎడిట్ ప్రొఫైల్ స్క్రీన్‌పై మీరు అనేక ఎంపికలను చూస్తారు. ఇవి కనిపించే షోలు మరియు సినిమాల ఆధారంగా వర్గీకరించబడతాయి. అందుబాటులో ఉన్న జాబితా నుండి మీకు నచ్చినదాన్ని ఎంచుకుని సేవ్ ఎంపిక మీద క్లిక్ చేయండి.

వెబ్‌సైట్‌

అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్‌సైట్‌లో వినియోగదారులు స్క్రీన్ కుడివైపు ఎగువన ఉన్న హూస్ వాచింగ్ పక్కన ఉన్న ప్రొఫైల్ పేరుపై క్లిక్ చేసి ప్రొఫైల్‌లను మేనేజ్ చేయడాన్ని ఎంచుకోవచ్చు. ఎడిట్ ప్రొఫైల్ ఎంపికపై క్లిక్ చేయడంతో మీరు మార్చాలనుకుంటున్న ప్రొఫైల్‌ని ఎంచుకోవచ్చు. ప్రొఫైల్ ఇమేజ్ క్రింద ఉన్న ఎడిట్ ఎంపికను ఎంచుకోని అందుబాటులో ఉన్న జాబితా నుండి ఎంపిక చేసుకోవచ్చు. తరువాత ఇది మొత్తం పూర్తయిన తర్వాత మార్పును చూడటానికి 'సేవ్' ఎంపికపై క్లిక్ చేయండి.

ప్రొఫైల్ ఇమేజ్‌

మీరు కనెక్ట్ చేయబడిన ఇతర పరికరాల్లో ప్రొఫైల్ ఇమేజ్‌ని మార్చాలనుకుంటే కనుక టాప్ మెనూలోని ప్రొఫైల్ ఇమేజ్‌ని ఎంచుకోండి. మీరు సవరించాలనుకుంటున్న ప్రొఫైల్‌ని హైలైట్ చేయడానికి మీ పరికరం యొక్క రిమోట్ కంట్రోల్‌ని ఉపయోగించండి. ఆపై దాని దిగువన ఉన్న ఎడిట్‌ను ఎంచుకోండి. ప్రొఫైల్ చిత్రాన్ని ఎంచుకోండి మరియు అందుబాటులో ఉన్న జాబితా నుండి ఎంపిక చేసుకోండి. కొత్త ప్రొఫైల్‌ని సృష్టించేటప్పుడు మీ డివైస్ యొక్క రిమోట్ కంట్రోల్‌ని ఉపయోగించి ప్రొఫైల్ ఇమేజ్‌పై క్లిక్ చేయండి మరియు అందుబాటులో ఉన్న జాబితా నుండి ఎంచుకోండి.

Best Mobiles in India

English summary
How to Change Your Profile Photo in Amazon Prime Video App?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X