EPFO లో UAN అకౌంట్ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్‌ను మార్చడం ఎలా?

|

ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి నెలా తమ యొక్క జీతం నుండి కొద్ది మొత్తంలో కట్ చేసే ప్రావిడెంట్ ఫండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రావిడెంట్ ఫండ్ యొక్క అన్ని విషయాలను సులభతరం చేయడానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల కోసం UAN అని పిలువబడే యూనివర్సల్ అకౌంట్ నంబర్‌ను ప్రారంభించింది. ఇది తమ యొక్క అకౌంటులో జరుగుతున్న అన్ని రకాల లావాదేవీలు మరియు డిపాజిట్ల గురించి తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

How to Change Your Registered Mobile Number in EPFO UAN Account

ఇతర బ్యాంక్ అకౌంటుల మాదిరిగానే UAN లో కూడా వినియోగదారులు తమ యొక్క ఫోన్ నంబర్‌ను నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. పొరపాటున మీ యొక్క నెంబర్ పోయిన లేదా క్రొత్త నంబర్‌ను పొందిన తరువాత మునుపటిది ఇకపై వాడటం కుదరకపోతే కనుక UAN అకౌంటులో మీ ఫోన్ నంబర్‌ను అప్ డేట్ చేయడం కూడా చాలా ముఖ్యం. EPFO పోర్టల్ ఉపయోగించి మీ ఫోన్ నంబర్‌ను ఎలా మార్చాలో లేదా ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Change Your Registered Mobile Number in EPFO UAN Account

*** మొదటగా Https://www.epfindia.gov.in/site_en/index.php ని ఓపెన్ చేయండి. తరువాత మీ యొక్క UAN మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.

*** మేనేజ్ టాబ్ పై క్లిక్ చేసి డ్రాప్-డౌన్ మెను నుండి కాంటాక్ట్ వివరాలు ఎంపికను ఎంచుకోండి.

*** ఇక్కడ మీ మొబైల్ నంబర్ చేంజ్ చెక్ బాక్స్ ఎంపికను ఎంచుకోండి.

*** మీ క్రొత్త మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, దాన్ని ధృవీకరించడానికి తిరిగి నమోదు చేయండి.

*** OTP ను స్వీకరించడానికి Get Authorization Pin బటన్ పై క్లిక్ చేయండి.

*** ఇప్పుడు కొత్తగా నమోదు చేసిన మీ క్రొత్త మొబైల్ నంబర్‌కు అందుకున్న OTP ని ఎంటర్ చేసి మార్పులను సేవ్ చేయి బటన్ పై క్లిక్ చేయండి.

*** దీని తరువాత కాంటాక్ట్ వివరాలు విజయవంతంగా అప్‌డేట్ చేయబడ్డాయి అని కొత్త మెసేజ్ కనిపిస్తుంది.

Best Mobiles in India

English summary
How to Change Your Registered Mobile Number in EPFO UAN Account

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X