స్మార్ట్‌ఫోన్‌ను వేగంగా ఛార్జింగ్ చేయాలా.. అయితే ఈ టిప్స్ కచ్చితంగా పాటించండి..!!
ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్ ఫోన్ వినియోగం గణనీయంగా పెరిగింది. వివిధ రకాల పనులను స్మార్ట్ ఫోన్ ద్వారా చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ తో విడదీయరాని బంధం ఏర్పడింది. వీటన్నింటికి ఛార్జింగ్ ఎంతో అవసరం.. అయితే కొన్నేళ్లుగా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయితే కొన్ని సార్లు మానవ తప్పిదం కారణంగా స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ ఆలస్యం అవుతుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఈ తప్పులు చేయకుండా ఉంటే స్మార్ట్ ఫోన్‌ను వేగంగా ( Smartphone Charging Tips ) ఛార్జింగ్ చేయవచ్చు.
ఫాస్ట్ ఛార్జర్ ను కొనుగోలు చేయాలి : ప్రస్తుతం సుమారుగా అన్ని స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో విడుదల అవుతున్నాయి. అయితే మీ స్మార్ట్ ఫోన్ గరిష్ఠ ఛార్జింగ్ వేగాన్ని తెలుసుకొని, అందుకు అనుగుణంగా ఛార్జర్ ను కొనుగోలు చేయాలి. ఫలితంగా గతం కంటే వేగంగా ఫోన్ ను ఛార్జింగ్ చేయగలుగుతాం.

వై ఫై, బ్లూటూత్ ఆఫ్ చేయాలి : స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ సమయంలో బ్లూటూత్, వై ఫై సహా హాట్ స్పాట్, GPS లను ఆఫ్ చేయడం ఉత్తమం. పైన తెలిపిన అన్ని ఫీచర్‌లు బ్యాటరీ త్వరగా డిశ్ఛార్జీ అయ్యేందుకు కారణం అవుతాయి. వీటిని ఆఫ్ చేయడం ద్వారా ఛార్జింగ్ వేగాన్ని పెంచుకోవచ్చు.
సంస్థకు చెందిన కేబుల్ ను వినియోగించండి : స్మార్ట్ ఫోన్ సంస్థకు చెందిన ఛార్జింగ్ కేబుల్ ను మాత్రమే వినియోగించాలి. సాధారణ లేదా తక్కువ ధర కేబుళ్ల కారణంగా ఛార్జింగ్ వేగం తగ్గుతుంది. దీంతోపాటు USB ఛార్జింగ్ పోర్టు ద్వారా కాకుండా వాల్ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ చేయడం ఉత్తమం.
ఛార్జింగ్ సమయంలో ఫోన్ వినియోగించవద్దు : ఛార్జింగ్ సమయంలో ఫోన్ ను వినియోగించవద్దు. దీని వల్ల బ్యాటరీ డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు స్మార్ట్ ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది. దీంతోపాటు అత్యవసరంగా ఫోన్ ను ఛార్జింగ్ చేయాల్సి వస్తే Flight Mode ఆన్ చేయాలి. ఇలా చేస్తే ఛార్జింగ్ వేగంగా పూర్తవుతుంది.
రాత్రంతా ఛార్జింగ్ చేస్తున్నారా : కొంత మంది రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ చేస్తుంటారు. అలా చేస్తే ఫోన్ బ్యాటరీ త్వరగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ సమయంలో 80 శాతం అయ్యేక.. ఛార్జింగ్ ను నిలిపివేయడం ఉత్తమం. ఫలితంగా ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








