ఇవి పాటిస్తే.. మీ మొబైల్ ఛార్జింగ్ నిమిషాల్లో ఫుల్!

కొన్ని ముఖ్యమైన చిట్కాలను అనుసరించటం ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఫోన్‌లను వేగవంతంగా చార్జ్ చేసుకోగలుగుతారు.

|

పెద్దదైన డిస్‌ప్లే ఇంకా శక్తివంతమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌లతో లభ్యమవుతోన్న నేటికాలం స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువ బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తున్నాయి. దీంతో వాడటం మొదలుపెట్టిన కొన్ని గంటల్లోనూ ఫోన్ చార్జింగ్ సున్నా స్థాయికి చేరుకుంటోంది.

 ఇవి పాటిస్తే.. మీ మొబైల్ ఛార్జింగ్ నిమిషాల్లో ఫుల్!

మళ్లీ స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిగా చార్జ్ అవ్వాలంటే గంటల తరబడి సమయాన్ని తీసుకుంటాయి. అయితే కొన్ని ముఖ్యమైన చిట్కాలను అనుసరించటం ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఫోన్‌లను వేగవంతంగా చార్జ్ చేసుకోగలుగుతారు.

 కంపెనీ చార్జర్‌లను మాత్రమే..

కంపెనీ చార్జర్‌లను మాత్రమే..

ఫోన్‌లను చార్జ్ చేసేందుకు కంపెనీ చార్జర్‌లను మాత్రమే ఉపయోగించండి. ఫోన్‌తో పాటుగా వచ్చే కంపెనీ చార్జర్‌లు మన్నికైన పనితీరును కనబరుస్తాయి.వాల్ చార్జర్‌ను ఉపయోగించటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వేగవంతంగా చార్జ్ అవుతంది.

యూఎస్బీ 3.0 పోర్ట్

యూఎస్బీ 3.0 పోర్ట్

యూఎస్బీ 3.0 పోర్ట్, స్టాండర్డ్ ఏసీ వాల్ చార్జర్‌లతో పోలిస్తే శక్తిని మరింత వేగవంతంగా సప్లై చేస్తంది. యూఎస్బీ 3.0 పోర్ట్ గరిష్ట వేగం 900ఎమ్ఏ. కాబట్టి, యూఎస్బీ 3.0 పోర్ట్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ‌ని వేగవంతంగా చార్జ్ చేసుకోవచ్చు. యూఎస్బీ హబ్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను చార్జ్ చేయటం వల్ల ప్రాసెసింగ్ 50శాతానికి పైగా తగ్గిపోతుంది. కాబట్టి, యూఎస్బీ హబ్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను చార్జ్ చేసే అలవాటుకు స్వస్తి పలకండి.

డెస్క్‌టాప్ యూఎస్బీ పోర్ట్ ద్వారా...

డెస్క్‌టాప్ యూఎస్బీ పోర్ట్ ద్వారా...

ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే డెస్క్‌టాప్‌లు ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌ను డెస్క్‌టాప్ యూఎస్బీ పోర్ట్ ద్వారా చార్జ్ చేయటం ద్వారా మరింత ప్రయోజనాన్ని పొందవచ్చు.

డాకింగ్ స్టేషన్ మరో బెస్ట్ ఆప్షన్

డాకింగ్ స్టేషన్ మరో బెస్ట్ ఆప్షన్

మీ స్మార్ట్‌ఫోన్‌లను వేగవంతంగా చార్జ్ చేసేందుకు డాకింగ్ స్టేషన్ మరో బెస్ట్ ఆప్షన్. ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లను టర్నాఫ్ చేయటం మంచిది. తద్వారా ఫోన్ వేగవంతంగా చార్జ్ అవుతుంది.

ఆ సమయంలో ఫోన్‌ను వాడటం శ్రేయస్కరం కాదు

ఆ సమయంలో ఫోన్‌ను వాడటం శ్రేయస్కరం కాదు

చార్జ్ అవుతోన్న సమయంలో ఫోన్‌ను వాడటం శ్రేయస్కరం కాదు. సాధ్యమైనంత వరకు చార్జ్ అవుతోన్న సమయంలో ఫోన్‌ను స్విచాఫ్ చేయటం మంచిది.

Best Mobiles in India

English summary
How to charge your Android phone battery faster. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X