మీ ఫోన్ త్వరగా చార్జ్ అవ్వాలంటే..?

కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్‌లు పూర్తిగా చార్జ్ అయ్యేందుకు నిర్ధేశిత సమయం కంటే అధిక సమయాన్ని తీసుకుంటాయి. అయితే, ఈ జాప్యానికి గల కారణాలు చాల మందికి తెలియదు. ఫోన్ వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు పాటించాల్సిన నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం.....
- ఫోన్ వేగవంతంగా చార్జ్ అవ్వాలంటే సదరు చార్జర్‌ను నేరుగా అవుట్ లెట్‌కే అనుసంధానించండి. కంప్యూటర్ ద్వారా చార్జింగ్ అంత ఉపయుక్తమైనది కాదు.
- చార్జింగ్‌కు సిద్ధమయ్యే క్రమంలో ఫోన్‌లో రన్ అవుతున్న అప్లికేషన్‌లను ఆఫ్ చేయటం మంచిది. ముఖ్యంగా జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్‌లను టర్న్ ఆఫ్ చేయాలి.
- ఫోన్ స్ర్కీన్‌ను టర్న్ ఆఫ్ చేయండి.
- చార్జింగ్ సమయంలో మీ ఫోన్ వైబ్రేషన్ మోడ్‌లో ఉన్నట్లయితే సాధారణ సౌండ్ మోడ్‌కు తీసుకురండి.
- చార్జింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మ్యూజిక్ వినటం అంత శ్రేయస్కరం కాదు.
బ్యాటరీ చార్జింగ్ ఎక్కువ కాలం నిలవాలంటే..?
మొబైల్ ఫోన్‌కు బ్యాటరీ గుండెకాయ అయితే, చార్జర్ ఆక్సిజన్ లాంటిది. ఈ రెండింటిలో ఏది సరిగా స్పందించకున్నా.. ఫోన్ మనుగడ కష్టతరమవుతోంది. అయితే, కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడటంతో బ్యాటరీ జీవిత కాలం రెట్టింపవుతుంది.
ఇవిగోండి చిట్కాలు:
- సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్నతరువాత రీచార్జ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది.
- బ్యాటరీని ఎప్పటికప్పడు క్లీన్ చేసుకోవాలి.
- బ్లూటూత్ అదేవిధంగా 3జీ రిసీవర్ కనెక్షన్‌లను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అవసరం లేని సమయంలో వాటిని ఆఫ్ చేయటం ఉత్తమం.
- బ్యాటరీ శక్తిని అధిక మొత్తంలో సేవించే మీడియా అప్లికేషన్‌లను మితంగా వాడుకోండి.
- అనవసర సౌండ్స్ అదేవిధంగా వైబ్రేషన్‌లను డిసేబుల్ చేయండి.
- స్ర్కీన్ సేవర్‌లను అధికంగా ఉపయోగించకండి, అలాగే ఫోన్ బ్రైట్‌నెస్, బ్యాక్ లైటింగ్‌ను తగ్గించుకోండి.
- ఫోన్‌కాల్స్‌కు బుదులుగా టెక్స్ట్ సందేశాలను పంపుకోండి.
- ఫోన్‌తో ఉపయోగం లేదనుకున్న సమయంలో టర్న్ ఆఫ్ చేయటం మంచిది.


Click it and Unblock the Notifications








