ఇలా చేస్తే, మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలు అత్యంత వేగంగా ఛార్జ్ అవుతాయ్!
స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిగా చార్జ్ అవ్వాలంటే గంటల తరబడి సమయాన్ని తీసుకుంటాయి. అయితే కొన్ని ముఖ్యమైన చిట్కాలను అనుసరించటం ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఫోన్‌లను వేగవంతంగా చార్జ్ చేసుకోగలుగుతారు.
Read More : నిమిషాల్లో మీ జియో సిమ్ యాక్టివేషన్ పూర్తవ్వాలా..?

#1
ఫోన్‌లను చార్జ్ చేసేందుకు కంపెనీ చార్జర్‌లను మాత్రమే ఉపయోగించండి. ఫోన్‌తో పాటుగా వచ్చే కంపెనీ చార్జర్‌లు మన్నికైన పనితీరును కనబరుస్తాయి.

#2
వాల్ చార్జర్‌ను ఉపయోగించటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వేగవంతంగా చార్జ్ అవుతంది.

#3
యూఎస్బీ 3.0 పోర్ట్, స్టాండర్డ్ ఏసీ వాల్ చార్జర్‌లతో పోలిస్తే శక్తిని మరింత వేగవంతంగా సప్లై చేస్తుంది.

#4
యూఎస్బీ 3.0 పోర్ట్ గరిష్ట వేగం 900ఎమ్ఏ. కాబట్టి, యూఎస్బీ 3.0 పోర్ట్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని వేగవంతంగా చార్జ్ చేసుకోవచ్చు.

#5
యూఎస్బీ హబ్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను చార్జ్ చేయటం వల్ల ప్రాసెసింగ్ 50శాతానికి పైగా తగ్గిపోతుంది. కాబట్టి, యూఎస్బీ హబ్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను చార్జ్ చేసే అలవాటుకు స్వస్తి పలకండి.

#6
ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే డెస్క్‌టాప్‌లు ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌ను డెస్క్‌టాప్ యూఎస్బీ పోర్ట్ ద్వారా చార్జ్ చేయటం ద్వారా మరింత ప్రయోజనాన్ని పొందవచ్చు.

#7
ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లను టర్నాఫ్ చేయటం మంచిది. తద్వారా ఫోన్ వేగవంతంగా చార్జ్ అవుతుంది.

#8
సాధ్యమైనంత వరకు చార్జ్ అవుతోన్న సమయంలో ఫోన్‌ను స్విచాఫ్ చేయటం మంచిది.

#9
ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచటం ద్వారా ఫోన్ వేగవంతంగా ఛార్జ్ అవుతుంది. అయితే, ఈ మోడ్‌లో ఉన్నప్పుడు ఎటువంటి ఫోన్ కాల్స్ మీకు రావు.


Click it and Unblock the Notifications








