యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూనే చాటింగ్ చేయవచ్చు

ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

|

ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త ఆప్షన్ ద్వారా యూజర్లు ఓ వైపు వీడియోలను వీక్షిస్తూనే మరోవైపు మిత్రులతో చాటింగ్ చేసుకునే వీలుంటుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా యూట్యూబ్ యాప్ నుంచి నిష్క్రమించాల్సిన అవసరం లేకుండానే చాటింగ్ నిర్వహించుకునే వీలుంటుంది. యూట్యూబ్ చాటింగ్ ఫీచర్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియాలో బ్యాన్ దిశగా వాట్సప్, ప్రభుత్వ కఠిన నిర్ణయానికి కారణం ఏంటీ ?ఇండియాలో బ్యాన్ దిశగా వాట్సప్, ప్రభుత్వ కఠిన నిర్ణయానికి కారణం ఏంటీ ?

ముందుగా మీ యూట్యూబ్ అకౌంట్‌ను ఓపెన్ చేసి..

ముందుగా మీ యూట్యూబ్ అకౌంట్‌ను ఓపెన్ చేసి..

ముందుగా యూట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేసి మీ అకౌంట్ ద్వారా అందులోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తరువాత స్ర్కీన్ క్రింది భాగంలో కనిపించే Activity tab బటన్ పై క్లిక్ చేయండి. యాక్టివిటీ ట్యాబ్‌లోకి వెళ్లిన తరువాత రెండు సబ్‌ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో ఒకటి Shared కాగా మరొకటి notifications.

Shared ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత..

Shared ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత..

ఇందులో Shared ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని అందులోని కాంటాక్ట్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెజెస్టెడ్ కాంటాక్ట్స్‌తో కూడిన జాబితా ఒకటి కనిపిస్తుంది. ఈ జాబితాలోకి మరికొన్ని కాంటాక్ట్స్‌ను చేర్చేందుకు రెండు ఆప్షన్స్ మీకు అందుబాటులో ఉంటాయి. అందులో మొదటి ఆప్షన్‌లో భాగంగా ఇన్విటేషన్ లింక్ పద్ధతిలో కొత్త కాంటాక్ట్‌లను యాడ్ చేసుకునే వీలుంటుంది, రెండవ పద్ధతిలో భాగంగా ఫోన్‌బుక్ ద్వారా కొత్త కాంటాక్ట్స్‌ను యూట్యూబ్ చాట్‌లోకి చేర్చుకునే వీలుంటుంది.

chat ఆప్షన్ పై క్లిక్ చేసి...

chat ఆప్షన్ పై క్లిక్ చేసి...

ఈ ప్రొసీజర్ పూర్తయిన తరువాత chat ఆప్షన్ పై క్లిక్ చేసి, మీరు చాట్ చేయాలనుకుంటోన్న వ్యక్తి తాలూకా పర్సనల్ చాట్ విండోను సెలక్ట్ చేసుకుని చాటింగ్‌ను ప్రారంభించండి. స్ర్కీన్ పై టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే త్రీ డాట్స్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే యాడింగ్ పార్టిసిపెంట్, లీవ్ ద చాట్, మ్యూట్ నోటిఫికేషన్స్ వంటి ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి.

కొత్త గ్రూప్‌ను క్రియేట్ చేసుకునే క్రమంలో..

కొత్త గ్రూప్‌ను క్రియేట్ చేసుకునే క్రమంలో..

ఒకవేళ మీరు గ్రూప్ చాటింగ్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా ఆ గ్రూప్‌ను క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది. కొత్త గ్రూప్‌ను క్రియేట్ చేసుకునే క్రమంలో Shared ఆప్ష‌న్‌లోని న్యూ గ్రూప్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని, గ్రూప్ పేరు ఆ తరువాత పార్టిసిపెంట్స్‌ను యాడ్ చేయవల్సి ఉంటుంది. యూట్యూబ్ చాట్ ద్వారా మీరు పంపే మెసేజెస్ అవతలి వ్యక్తికి చేరుకోవాలంటే వాళ్ల యూట్యూబ్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ తప్పనిసరిగా ‘ON'లో ఉండాలి.

యూట్యూబ్ వెబ్‌వర్షన్‌లోనూ ఇదే ప్రొసీజర్..

యూట్యూబ్ వెబ్‌వర్షన్‌లోనూ ఇదే ప్రొసీజర్..

ఈ చాటింగ్ ఫీచర్‌ను యూట్యూబ్ వెబ్‌వర్షన్‌లోనూ గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. యూట్యూబ్ వెబ్ యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ముందుగా తమ డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి, ఆ తరువాత తమ అకౌంట్ ద్వారా అందులోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

‘యాడ్ మోర్ కాంటాక్ట్స్’ ఆప్షన్ పై క్లిక్ చేసి...

‘యాడ్ మోర్ కాంటాక్ట్స్’ ఆప్షన్ పై క్లిక్ చేసి...

అకౌంట్‌లోకి లాగిన్ అయిన తరువాత హోమ్ పేజీ పై కనిపించే "Share" బటన్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఈ ఐకాన్ పై క్లిక్ చేసిన వెంటనే యూట్యూబ్ కాంటాక్ట్స్‌కు సంబంధించిన జాబితా ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొత్త కాంటాక్ట్‌ను యాడ్ చేయాలనుకుంటున్నట్లయితే ‘యాడ్ మోర్ కాంటాక్ట్స్' ఆప్షన్ పై క్లిక్ చేసి కొత్త కాంటాక్ట్ ను యాడ్ చేసుకోవచ్చు.

యూట్యూబ్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ తప్పనిసరిగా ‘ON’లో ఉండాలి...

యూట్యూబ్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ తప్పనిసరిగా ‘ON’లో ఉండాలి...

ఈ జాబితాలోకి మరికొన్ని కాంటాక్ట్స్‌ను చేర్చేందుకు రెండు ఆప్షన్స్ మీకు అందుబాటులో ఉంటాయి. అందులో మొదటి ఆప్షన్‌లో భాగంగా ఇన్విటేషన్ లింక్ పద్ధతిలో కొత్త కాంటాక్ట్‌లను యాడ్ చేసుకునే వీలుంటుంది, రెండవ పద్ధతిలో భాగంగా ఫోన్‌బుక్ ద్వారా కొత్త కాంటాక్ట్స్‌ను యూట్యూబ్ చాట్‌లోకి చేర్చుకునే వీలుంటుంది. మీరు పంపే మెసేజెస్ అవతలి వ్యక్తికి చేరుకోవాలంటే వాళ్ల యూట్యూబ్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ తప్పనిసరిగా ‘ON'లో ఉండాలి.

Best Mobiles in India

English summary
Did you know that there's also an option to chat while watching a video. This means you need not exit your YouTube app to chat or send an important message to someone.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X