ఇప్పటి వరకు మీ ఆధార్ కార్డు ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవడం ఎలా ?
దేశంలో ఇప్పుడు ఏ పని చేయలన్నా ఆధార్ అనేది తప్పనిసరి అయింది. ప్రతి ఒక్క పనికి ఆధార్ ఫ్రూప్ అడుగుతున్నారు.
దేశంలో ఇప్పుడు ఏ పని చేయలన్నా ఆధార్ అనేది తప్పనిసరి అయింది. ప్రతి ఒక్క పనికి ఆధార్ ఫ్రూప్ అడుగుతున్నారు. పాన్ కార్డ్, మొబైల్, బ్యాంక్ లోన్లు ఇలా ప్రతి అంశమూ ఆధార్‌తోనే ముడిపడింది. ఈ కార్డులో మన వ్యక్తిగత సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది.

చాలా చోట్ల ఆధార్ వాడుతున్న నేపథ్యంలో మనం ఆధార్ ఎక్కడెక్కడ వాడామో తెలుసుకోవడం ఎలా అనే సందేహం రావచ్చు.. అలా తెలుసుకునేందుకు ఆధార్ కార్డు జారీ చేసే యూఏడీఏఐ వెబ్‌సైట్ మీకు అవకాశం కల్పిస్తోంది. ఈ కింది స్టెప్స్ పాటించడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

స్టెప్ 1
ఈ సమాచారం కావాలనుకున్న వారు ముందుగా యూఐడీఏఐ ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ పేజ్‌కు వెళ్లాలి.. ఈ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 2
అక్కడ మీకు కనిపించే పేజీలో మీ UID నంబర్ , క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి. జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే.. రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.

స్టెప్ 3
ఆ తరువాత పేజీలో మీకు ఎటువంటి సమాచారం కావాలో మీకు కొన్ని ఆప్షన్స్ డిస్‌ప్లే అవుతాయి. బయోమెట్రిక్, డెమొగ్రాఫిక్‌లాంటివి. ప్రస్తుత తేదీ నుంచి గరిష్ఠంగా ఆరు నెలల కిందటి వరకు మీరు ఆధార్‌ను ఎలా ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు.

స్టెప్ 4
బయోమెట్రిక్, డెమొగ్రాఫిక్‌లాంటివి. ప్రస్తుత తేదీ నుంచి గరిష్ఠంగా ఆరు నెలల కిందటి వరకు మీరు ఆధార్‌ను ఎలా ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆప్సన్స్ ఎంటర్ చేయాలి లేకుంటే మీకు ఎర్రర్ చూపించే అవకాశం ఉంది.

స్టెప్ 5
అన్ని వివరాలు ఎంటర్ చేశాక చివరి కాలంలో ఓటీపీ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. మీరు ఏ రోజు, ఏ సమయానికి, ఎలాంటి పని కోసం ఆధార్‌ను ఇచ్చారన్న వివరాలు వస్తాయి.

ఆధార్ వాడిన కంపెనీ లేదా ఏజెన్సీ పేర్లు ..
అయితే ఈ పేజీలో మీ ఆధార్ వాడిన కంపెనీ లేదా ఏజెన్సీ పేర్లు మాత్రం చూపించదు. దానికి సంబంధించిన వివరాలను మాత్రమే అది చూపిస్తుంది.


Click it and Unblock the Notifications








