Aadhaar : మీ ఆధార్ వివరాలను ఇంకా ఎవరైనా ఉపయోగించారా.. ఎలా తెలుసుకోవాలి..?
Aadhaar History : ఆధార్ వివరాల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాల్లో లబ్దిదారులను ఎంపిక చేస్తున్నాయి. దీంతోపాటు బ్యాంకులు సహా ఇతర సంస్థలు కూడా ఆధార్ వివరాల ఆధారంగా సేవలు అందిస్తున్నాయి. అయితే ఆధార్ వివరాలు అనేక చోట్ల దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అందువల్ల UIDAI (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) అనేక ప్రైవసీ, భద్రతా చర్యలు తీసుకుంటోంది.
ఆధార్ దుర్వినియోగాన్ని కట్టడి చేసుకోవచ్చు :
ఇందులో భాగంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ హిస్టరీ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా 6 నెలల్లో ఆధార్ వివరాలను ఎక్కడెక్కడ వినియోగించారో తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా ఈ వివరాలను తనిఖీ చేసుకోవడం ఉత్తమం. దీంతో ఆధార్ వివరాలు దుర్వినియోగాన్ని కట్టడి చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఆధార్ వివరాలను ప్రభుత్వ పథకాలు, eKYC, సబ్సిడిలు, EPF, బీమా, బ్యాంకులు సహా అనేక ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు. రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఆధార్ అథెంటికేషన్ ఇటీవలే తప్పనిసరి అయింది. ఆధార్ హిస్టరీ ఫీచర్ ద్వారా మీ అనుమతి లేకుండా ఆధార్ వినియోగించకుండా కట్టడి చేయవచ్చు.
ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీ కావాల్సి ఉంటుంది :
ఆధార్ హిస్టరీ వివరాలు తెలుసుకొనేందుకు మీ ఆధార్ నంబర్ లేదా ఆధార్ వర్చువల్ ఐడీ ( VID ) వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి. మరియు ఆధార్ నంబర్ తో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ కూడా అందుబాటులో ఉండాలి. ఈ ఫోన్ నంబర్ కు వచ్చే OTP ను నమోదు చేయాల్సి ఉంటుంది.
> UIDAI వెబ్‌సైట్ ను సందర్శించాలి. అనంతరం ఆధార్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి.
> అనంతరం ఆధార్ అథెంటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.
> అక్కడ ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీని నమోదు చేయాలి.
> అక్కడ కనిపించిన Security Captcha ను నమోదు చేయాలి.
> ఆధార్ తో రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ కు వచ్చిన OTP ను ఎంటర్ చేయాలి.
> ఆధార్ హిస్టరీ వివరాలను ఏ సమయంలో తెలుసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి.
> గరిష్ఠంగా 6 నెలల సమయంలో ఏ సమయంలో ఆధార్ ఎక్కడెక్కడ వినియోగించారో తెలుసుకోవచ్చు.
> అథెంటికేషన్ టైప్ లేదా All అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని, Submit పైన క్లిక్ చేయాలి.
> తేదీ, సమయం సహా పూర్తి వివరాలతో ఎక్కడెక్కడ ఆధార్ ను వినియోగించారో తెలుసుకోవచ్చు.
మీరు ఆధార్ వినియోగించిన సందర్భాలను, అక్కడ వచ్చిన ఆధార్ వివరాలతో సరిపోల్చుకోవాలి. ఎక్కడైనా అనుమానాస్పదంగా అనిపిస్తే, వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. దీంతోపాటు ఆధార్ వివరాలను mAadhaar యాప్, వెబ్‌సైట్ ఆధారంగా లాక్ చేసుకోవచ్చు.
ఇప్పటికే ఆధార్ యాప్ అందుబాటులో ఉండగా.. తాజాగా పరిమిత ఫీచర్లతో మరో ఆధార్ యాప్‌ను UIDAI తీసుకొచ్చింది. డిజిటల్ రూపంలో ఆధార్ వివరాలను ఆ యాప్‌లో స్టోరేజీ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








