Home
How to

మీ ఆధార్‌ కార్డును ఎవరైనా వినియోగిస్తున్నారా.. ఇలా సులభంగా 'ఆధార్‌ హిస్టరీ' తెలుసుకోండి..!

ఆధార్‌ ప్రస్తుతం భారత్‌లో ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ఉంది. ఆధార్‌ (Aadhaar Card) వివరాలు ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల్లో లబ్దిదారులను ఎంపిక చేస్తున్నాయి. బ్యాంకులు కూడా ఆధార్‌ వివరాల ఆధారంగా సేవలు అందిస్తున్నారు. అయితే ఇలా అనేక ఉపయోగాలు ఉన్నాయి. దీంతోపాటు గత సంవత్సరం UIDAI (యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా) ఆధార్‌ కార్డులను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. గత 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అప్‌డేట్‌ చేయని యూజర్లు వెంటనే చేయాలని సూచించింది.

ఆధార్‌ అప్‌డేట్‌ ఎప్పటి వరకు చేసుకోవచ్చు. ;
ఇప్పటికే ఉచితంగా ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేసుకొనేందుకు అనేకసార్లు గడువు పొడిగించిన UIDAI.. ఈ సంవత్సరం జూన్‌ 14 వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. మైఆధార్‌ యాప్‌ (Myaadhaar) ద్వారా ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అయితే ఆధార్‌ సేవా కేంద్రాల్లో అయితే నగదు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

how to check Aadhaar History

సిమ్ కార్డుల నుంచి బ్యాంకు ఖాతాల వరకు :
అయితే చాలా మంది అనేక సందర్భాల్లో తమ ఆధార్‌ కార్డులను ఇతరులకు అందిస్తున్నారు. లోన్లు, ఇతర పథకాలకు దరఖాస్తుల సమయంలో మరియు సిమ్‌ కార్డులను కొనుగోలు చేసే సమయంలోనూ ఆధార్‌ వివరాలను అందిస్తున్నారు. అయితే కొన్ని సందర్బాల్లో ఆధార్‌ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయి. కొంత మంది నేరగాళ్లు ఇతరుల ఆధార్‌ కార్డులను దుర్వినియోగం చేస్తున్నారు.

ఇతరులు దుర్వినియోగం చేయకుండా :
దీన్ని గుర్తించిన ఆధార్ ప్రాధికార సంస్థ UIDAI.. ఆధార్‌ దుర్వినియోగాన్ని అడ్డుకొనేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరూ తమ ఆధార్ హిస్టరీని (Aadhaar History) తెలుసుకొనేందుకు అవకాశం కల్పించింది. దీంతోపాటు ఆధార్ బయోమెట్రిక్‌ వివరాలను లాక్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. ఫలితంగా ఇతరులు దుర్వినియోగం చేయకుండా వీలు కల్పించింది.

ఆధార్‌ హిస్టరీని ఎలా తెలుసుకోవాలి ?
* మీ ఆధార్‌ దుర్వినియోగం అయిందా లేదా అని తెలుసుకొనేందుకు తొలుత మై ఆధార్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం మీ ఆధార్‌ కార్డు నంబర్‌ మరియు OTP, Captcha ద్వారా లాగిన్ కావాలి.
* అక్కడ Authentication హిస్టరీ ఆప్షన్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
* మీకు తెలియకుండా ఎక్కడైనా ఆధార్‌ను వినియోగించినట్లు గుర్తిస్తే.. వెంటనే ఫిర్యాదు చేయాలి.
* UIDAI టోల్‌ఫ్రీ నంబర్‌ 1947 లేదా [email protected] ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

ఆధార్‌ బయోమెట్రిక్‌ను లాక్‌ :
దీంతోపాటు ఆధార్‌ బయోమెట్రిక్‌ను లాక్‌ చేసేందుకు కూడా అవకాశం ఉంది. ఫలితంగా మీ అనుమతి లేకుండా మీ ఆధార్‌ వివరాలను ఎవరూ ఉపయోగించేందుకు అవకాశం ఉండదు. ఆధార్‌ వెబ్‌సైట్‌లోని Lock/unlock Biometrics ఆప్షన్‌ ద్వారా లాక్‌ చేయవచ్చు.

అయితే ఇందుకు వర్చువల్‌ ఐడీ, పిన్‌ కోడ్‌, క్యాప్చ కోడ్‌ను ఎంటర్‌ చేసి ప్రాసెస్‌ చేయాలి. అనంతరం మీ రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ను కూడా నమోదు చేయాలి. అన్ని వివరాలు సరిచూసుకున్నాక మీ ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్ అవుతాయి. అయితే అదే ఆప్షన్‌ ద్వారా అన్‌లాక్ చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
how to check Aadhaar History on UIDAI website and lock biometrics here is the guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X