Home
How to

Paytm యాప్ ద్వారా COVID-19 టీకా స్లాట్‌ను కనుగొనడం ఎలా?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి ఉపశమనం పొందడానికి COVID-19 వ్యాక్సిన్లను వేసుకోవలసిందిగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. వ్యాక్సిన్ కేంద్రాలలో స్లాట్‌లను కొనుగొనడానికి అనేక విధానాలు ఉన్నాయి. ఇప్పుడు Paytm యాప్ లోపల కూడా కొత్తగా ఒక టూల్ ని ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు వారి ప్రాంతంలోని COVID-19 వ్యాక్సిన్ల కోసం అందుబాటులో ఉన్న స్లాట్‌లను కనుగొనడంలో సహాయాన్ని అందిస్తుంది. "COVID-19 వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్ టూల్" పేరుతో గల కొత్త టూల్ ఇప్పుడు ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాల కోసం Paytm యాప్ లో అందుబాటులో ఉంది. వినియోగదారులు ఇది కోవిన్ ప్లాట్‌ఫాం నుండి టీకా స్లాట్‌లను కనుగొని రియల్ టైమ్ డేటాను చూపుతుంది.

Paytm

Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ట్విట్టర్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్లు రోల్ అవుట్ వార్తలను ప్రకటించారు. Paytm యాప్ లో వినియోగదారులు తమ పిన్ కోడ్ లేదా జిల్లాను నమోదు చేయడం ద్వారా టీకా స్లాట్ సమాచారాన్ని పూర్తిగా తనిఖీ చేయగలరు. దీనితో పాటుగా మరిన్ని స్లాట్లు అందుబాటులోకి వచ్చినప్పుడు వారికి నోటిఫికేషన్ కూడా వస్తుంది.

Paytm వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్

Paytm యొక్క వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్ ప్రస్తుతం 18+ మరియు 45+ వయస్సు గలవారికి టీకాలను ఎంచుకోవడం కోసం రాబోయే నాలుగు వారాల పాటు అందుబాటులో ఉన్న స్లాట్‌లను చూపిస్తుంది. యాప్ అందుబాటులో ఉన్న స్లాట్‌లను చూపించకపోతే కనుక వినియోగదారులు స్లాట్ ఓపెన్ చేసినప్పుడు Paytm చాట్ ద్వారా తెలియజేయడానికి ఎంచుకోవచ్చు. ఒక స్లాట్ అందుబాటులో ఉంటే కనుక వినియోగదారుడు వారి అపాయింట్‌మెంట్ ను బుక్ చేసుకోవడానికి కో-విన్ వెబ్‌సైట్ లేదా యాప్ కి మళ్ళించబడతారు. Paytm యొక్క వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్ కోవిన్ ప్లాట్‌ఫాం నుండి డేటాను సేకరించడం ద్వారా నిజ సమయంలో స్లాట్‌ల లభ్యతను మాత్రమే తనిఖీ చేయగలదు. కాని టీకాలను బుక్ చేయడానికి దీనిని ఉపయోగించడం కుదరదు. కోవిన్, ఉమాంగ్ మరియు ఆరోగ్య సేతు వంటి యాప్ లను ఉపయోగించి మాత్రమే టీకా స్లాట్ లను బుక్ చేయవచ్చు.

COVID-19 టీకా స్లాట్‌లను Paytm లో తనిఖీ చేసే విధానం

COVID-19 టీకా స్లాట్‌లను Paytm లో తనిఖీ చేసే విధానం

** Paytm యాప్ ను ఓపెన్ చేసి మినీ యాప్ స్టోర్ విభాగానికి క్రిందికి స్క్రోల్ చేయండి.

** అక్కడ మీరు వ్యాక్సిన్ ఫైండర్ ఎంపికను కనుగొంటారు దానిపై నొక్కండి.

** మీ పిన్ కోడ్ లేదా జిల్లాను ఎంటర్ చేసి, ఆపై మీ యొక్క వయస్సును ఎంచుకోండి.

** అందుబాటులో ఉన్న స్లాట్‌లను తనిఖీ చేయడానికి "చెక్ ఎవైలబిలిటీ" ఎంపికపై క్లిక్ చేయండి.

** స్లాట్ అందుబాటులో లేకపోతే "స్లాట్లు అందుబాటులో ఉన్నప్పుడు నాకు తెలియజేయండి" ఎంపికపై నొక్కండి.

** స్లాట్ అందుబాటులో ఉంటే కనుక కోవిన్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లి మీ వివరాలతో నమోదు చేసుకోవచ్చు.

 

More from GizBot

Best Mobiles in India

English summary
How to Check Available COVID-19 Vaccine Slots Through Paytm App?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X