Home
How to

ఈ యాప్‌ ద్వారా EPF బ్యాలెన్స్‌ను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు... పూర్తి వివరాలు..!

ఉద్యోగులు తమ EPF (ఎంప్లాయి ప్రొవిడెంట్‌ ఫండ్‌) బ్యాలెన్స్‌ ను తనిఖీ చేసుకోవడం అవసరం. ఇందుకు అనేక పద్ధతులున్నాయి. ఆఫ్‌ లైన్‌ విధానంలో SMS పద్ధతిలో ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ ను తనిఖీ చేసుకోవచ్చు. అదే ఆన్‌లైన్‌లో తనిఖీ చేసేందుకు రెండు పద్ధతులున్నాయి. EPFO అధికారిక వెబ్‌సైట్ సహా UMANG యాప్‌ ద్వారా బ్యాలెన్స్‌ సహా ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకు UAN (యూనివర్సల్‌ అకౌంట్ నంబర్‌), EPF తో రిజిస్టర్‌ చేయబడిన మొబైల్‌ నంబర్ అందుబాటులో ఉండాలి.

తొలుత UMANG యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి, రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది. అనంతరం హోం పేజీలోని సెర్చ్‌ బార్‌ వద్ద EPFO అని టైప్‌ చేయాలి. అనంతరం మీకు అందుకు సంబంధించిన సర్వీసులు ఓపెన్‌ అవుతాయి.

how to check EPF balance through UMANG app

UMANG యాప్‌లో సర్వీస్‌ సెక్షన్‌లో View Passbook అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అనంతరం మీకు మూడు రకాల ఆప్షన్‌లు కనిపిస్తాయి. ఎంప్లాయి సెంట్రిక్‌ సర్వీస్‌, జనరల్‌ సర్వీస్‌, ఎంప్లాయర్ సెంట్రిక్‌ సర్వీస్‌ వంటి ఆప్షన్‌లు కనిపిస్తాయి. అందులో ఎంప్లాయి సెంట్రిక్‌ సర్వీస్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

అనంతరం మీ UAN నంబర్‌ను అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత లాగిన్‌ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు రిజిస్టర్‌ చేసిన మొబైల్‌ నంబర్‌కు OTP వస్తుంది. ఆ నంబర్‌ను ఎంటర్‌ చేసి OK బటన్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంది. కొత్త పేజీ తెరుచుకొని EPF పాస్‌బుక్‌ కనిపిస్తుంది. ఈ ట్యాబ్‌లో మీరు బ్యాలెన్స్ సహా ఇతర వివరాలు తెలుసుకోవచ్చు.

ఆన్‌లైన్ విధానం లేదా UMANG యాప్‌ ద్వారా EPF బ్యాలెన్స్‌ సహా ఇతర వివరాలు తెలుసుకొనేందుకు తప్పని సరిగా రిజిస్టర్‌ చేయబడిన మొబైల్‌ నంబర్‌ను కలిగి ఉండాలి. మరియు ఆ ఫోన్ నంబర్‌ యాక్టివ్‌లో ఉండాలి. దీంతోపాటు UAN కూడా అందుబాటులో ఉంచుకోవాలి. లేకుంటే ఈ విధానంలో EPF బ్యాలెన్స్‌ తనిఖీ చేసే అవకాశం ఉండదు.

* గత నెలలో EPFO తన క్లెయిమ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. గతంలో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ కోసం బ్యాంకు పాస్‌బుక్‌ లేదా క్యాన్సిల్‌ చేసిన చెక్‌ బుక్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉండేది. దీనిపై EPFO కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని షరతులతో ఈ రెండింటిని అప్‌లోడ్‌ చేయకుండానే క్లెయిమ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

బ్యాంక్‌ ఆన్‌లైన్ KYC, ఆధార్ నంబర్‌ ధ్రువీకరణ, డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికేట్‌ వంటివి పూర్తి చేయడం ద్వారా బ్యాంకు పాస్‌బుక్‌ లేదా క్యాన్సల్‌ చేసిన చెక్‌బుక్‌ను అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ కోసం బ్యాంకు పాస్‌బుక్‌ లేదా క్యాన్సిల్‌ చేసిన చెక్‌ బుక్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉండేది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
how to check EPF balance through UMANG app here is the stepwise guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X