Just In
- 5 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 6 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 9 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 12 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Sports
భారత్ తొండాట ఆడకుంటే ఆస్ట్రేలియాదే విజయం: మాజీ క్రికెటర్
- News
Telangana gets zero: సిటీలో మోడీ లక్ష్యంగా బీఆర్ఎస్ భారీ పోస్టర్లు!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మీ Voter ఐడీ వివరాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవటం ఎలా..?
18 సంవత్సరాల నిండిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు అనేది తప్పనిసరి. ప్రభుత్వాలను ఎన్నుకునే విషయంలో ఓటు హక్కు అనేది సామాన్యుడికి ఓ అస్త్రంలో పని చేస్తుంది. దేశ భవిష్యత్‌ను మార్చగల సత్తా ఒక్క ఓటు హక్కుకు మాత్రమే ఉందంటే, అది ఎంతటి శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు. 2019 ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో ఎలక్ట్రరోల్ కమీషన్ ఓటర్ల జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. చాలా మంది తమ వ్యాపారాల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం చాలా ప్రాంతాలకు మారుతుంటారు. ఈ క్రమంలో వారి ఓటర్ ఐడీ అడ్రస్ లను కూడా మార్చుకుంటుంటారు. ఈ క్రమంలో ఓటర్ల జాబితా నుంచి మీ పేరు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి.

ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునేందుకు అనేక మార్గాలు
రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలనుకుంటోన్న ఓటర్లు ముందుగానే తమ ఓటర్ ఐడీ వివరాలను ఆన్ లైన్ లో చెక్ చేసుకోవటం మంచిది. ఓటు హక్కును ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పడు తెలుసుకుందాం...

బోల్డ్ అక్షరాలతో ముద్రించబడి ఉంటుంది..
ముందుగా నేషనల్ ఓటర్ సర్వీసెస్ పొర్టల్ (ఎన్‌విఎస్‌పి) ఎలక్టోరల్ సెర్చ్ పేజీలోకి వెళ్లండి. అక్కడ మీ పేరును రెండు రకాలుగా సెర్చ్ చేసుకోవచ్చు. అందులో మొదటి పద్ధతిలో భాగంగా మీ ఓటర్ ఐడీ కార్డ్ వివరాలను మాన్యువల్ గా ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఎలక్టోరల్ ఫోటో ఐడీ కార్డ్ (EPIC) నెంబర్ అనేది ఓటర్ ఐడీ పై బోల్డ్ అక్షరాలతో ముద్రించబడి ఉంటుంది.

ప్రొసీజర్ 1
నేషనల్ ఓటర్ సర్వీసెస్ పొర్టల్ (ఎన్‌విఎస్‌పి) ఎలక్టోరల్ సెర్చ్ పేజీలోకి వెళ్లిన తరువాత Search by EPIC No అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ సెలక్ట్ అయిన తరువాత మీ EPIC నెంబర్‌ను ఎంటర్ చేసి క్రింద కనింపచే డ్రాప్‌డౌన్ మెనూలో మీరు ఉంటోన్న రాష్ట్రాన్ని సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్ విజయవంతంగా పూర్తి అయిన తరువాత పేజీ దిగువున కనిపించే సెర్చ్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే మీ ఓటర్ ఐడీ తాలుకా వివరాలు క్రింద ప్రత్యక్షమవుతాయి. అలా జరగని పక్షంలో ఓటర్ ఐడీలో మీ పేరులేదని గుర్తించాలి.

ప్రొసీజర్ 2
మరొక ప్రొసీజర్‌లో భాగంగా నేషనల్ ఓటర్ సర్వీసెస్ పొర్టల్ (ఎన్‌విఎస్‌పి) ఎలక్టోరల్ సెర్చ్ పేజీలోకి వెళ్లిన తరువాత Search by Details అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఆప్షన్ సెలక్ట్ అయిన తరువాత అందులో మీ పేరు, జెండర్, వయసు, నియోజక వర్గం పరిధి వంటి వివరాలను ఎంటర్ చేయవల్సి ఉంటంది. వివరాలు ఎంటర్ చేయటం పూర్తి అయిన తరువాత పేజీ దిగువున కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే మీ ఓటర్ ఐడీ తాలుకా వివరాలు క్రింద ప్రత్యక్షమవుతాయి. అలా జరగని పక్షంలో ఓటర్ ఐడీలో మీ పేరులేదని గుర్తించాలి.

మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన విషయాలు..
భారత ఎలక్షన్ కమీషన్ నిబంధనల ప్రకారం ఒక్కో పౌరుడు ఒక ఓటర్ ఐడీని మాత్రమే కలిగి ఉండాలి. ఓటర్ ఐడీ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో ధరకాస్తు చేసుకునే క్రమంలో సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ధరఖాస్తు చేసుకున్న ఓటర్ ఐడీ నేరుగా వ్యక్తి చిరునామాకే డెలివరీ చేయబడుతుంది. ఆన్‌లైన్ ప్రాసెస్‌లో ఓటర్ ఐడీకి ధరఖాస్తు చేసుకువటం ద్వారా కేవలం నెల రోజుల వ్యవధిలో ఓటు గుర్తింపు కార్డును పొందవచ్చు. ఆఫ్‌లైన్ ప్రాసెస్‌లో ఈ ప్రక్రియకు 6 నెలల వరకు సమయం పట్టొచ్చు.

ఆన్‌లైన్‌లో ఓటర్ ఐడీకి ధరఖాస్తు చేసుకునేందుకు బై స్టెప్ ప్రొసీజర్...
ముందుగా ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా అదికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ హోమ్ పేజీలో కనిపించే Apply online for Registraion of new Voter అనే టాబ్ పై క్లిక్ చేయండి. Form 6తో కూడిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్‌లో మీ రాష్ట్రం, పార్లమెంటరీ నియోజికవర్గ పరిధి, పేరు, పుట్టిన తేదీ, జన్మ స్థలం వివరాలను పొందుపరచటంతో పాటు ఫోటో తదితర సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయవల్సి ఉంటుంది.

స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు...
Form 6ను పూర్తిగా ఫిల్ చేసిన తరువాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని submit బటన్ పై ప్రెస్ చేయండి. మీ అప్లికేషన్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తి అయినట్లయితే, అప్లికేషన్‌లో మీరు వెల్లడించిన ఈ-మెయిల్ ఐడీకి, ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా నుంచి ఓ లింక్ అందుతుంది. ఆ లింక్ పై క్లిక్ చేసినట్లయితే మీ పర్సనల్ ఓటర్ ఐడీ పేజీకి రీడైరక్ట్ అవుతారు. ఈ లింక్ ద్వారా మీ ఓటర్ ఐడీ సంబంధించిన స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470