మీ పాస్‌వర్డ్ ఎవరైనా దొంగిలించారో లేదో తెలుసుకోండి

|

ఈ రోజుల్లో చాలా వెబ్ సైట్లు పాస్‌వర్డ్‌లను లీక్ చేస్తున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం. యూజర్ల usernames and passwordsని తెలుసుకుని వారి అకౌంట్లను హ్యాక్ చేసి వారి డేటాను అటాకర్లు దొంగిలించడం అనేది సర్వ సాధారణమైపోయింది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మనం అనుకున్నంత సురక్షితంగా లేదు ప్రస్తుత డిజిటల్ ప్రపంచం. మన వ్యక్తిగత సమాచారం తెలుసుకొని నష్టపరిచేందుకు సైబర్ నేరగాళ్లు, కొన్ని వెబ్‌సైట్‌లు మన పాస్‌వర్డ్‌ను దొంగిలిస్తున్నాయి. మరి మీ పాస్‌వర్డ్ ఎవరికైనా తెలుసో లేదో ఇలా చెక్ చేసుకోవాలనే దానిపై చాలామంది మల్లగుల్లాలు పడుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు ఇస్తున్నాం వాటిని పాలో అవడం ద్వారా మీరు మీ పాస్‌వర్డ్ ఎవరైనా దొంగిలించారో లేదో తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

 

13,000 mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ లాంచ్, ధర, హైలెట్ ఫీచర్లు, ఇండియాకి ఎప్పుడంటే ?13,000 mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ లాంచ్, ధర, హైలెట్ ఫీచర్లు, ఇండియాకి ఎప్పుడంటే ?

Troy Hunt Have I Been Pwned

Troy Hunt Have I Been Pwned

Troy Hunt Have I Been Pwnedను గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో టైప్ చేస్తే.. మీకు ఈ పాస్‌వర్డ్ లకు సంబంధించిన వెబ్‌సైట్ ఒకటి వస్తుంది. దానిలో మీ మెయిల్ ఐడీని టైప్ చేసి pwned మీద ఎంటర్ చేస్తే మీ పాస్‌వర్డ్ హ్యాక్ అయిందా? లేదా? తెలుస్తుంది.

గ్రీన్ కలర్‌లో..

గ్రీన్ కలర్‌లో..

ఎవ్వరూ దొంగిలించకపోతే గుడ్‌న్యూస్ అని గ్రీన్ కలర్‌లో, ఎవరైనా దొంగిలిస్తే ఓ నో-pwned అని బ్రౌన్ కలర్‌లో కింద కనిపిస్తుంది. పాస్‌వర్డ్ దొంగిలించినట్లు తెలిస్తే వెంటనే కొత్త పాస్‌వర్డ్ మార్చుకోండి.

LastPass
 

LastPass

ఇదే కాకుండా మీ పాస్ వర్డ్ మరింత సెక్యూరిటీగా ఉంచుకునేందుకు మరో ఆప్సన్ కూడా ఉంది. LastPass అనే సైటుకి వెళ్లడం ద్వారా మీరు మీ సెక్యూరిటీని మరింతగా పెంచుకోవచ్చు.ఇందుకోసం మీరు LastPass ఓపెన్ చేసి అందులో More Options > Security Challengeని సెలక్ట్ చేసుకోవాలి.

 మీ పాస్ వర్డ్ లకు సంబంధించిన డేటా బేస్

మీ పాస్ వర్డ్ లకు సంబంధించిన డేటా బేస్

అక్కడ మీకు మీ పాస్ వర్డ్ లకు సంబంధించిన డేటా బేస్ కనిపిస్తుంది. అందులో మీరు ఎవరైనా మీ పాస్ వర్డ్ లను దొంగిలించేదు ప్రయత్నిస్తే దాన్ని ఈమెయిల్ కి పంపేలా సెట్ చేసుకోవచ్చు.

 

మీ పాస్‌వర్డ్  బలాన్ని బలహీనతను కూడా..

మీ పాస్‌వర్డ్ బలాన్ని బలహీనతను కూడా..

దీంతో పాటు మీ పాస్‌వర్డ్ బలాన్ని బలహీనతను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే మీరు ఎప్పుడు మీ పాస్‌వర్డ్ ఛేంజ్ చేశారు అన్న వివరాలు కూడా కనిపిస్తాయి. దీని ప్రకారం మీరు మీ పాస్‌వర్డ్ని అత్యంత బలంగా మార్చుకునేందుకు వీలు ఉంటుంది. ఏయే సైట్లలో మీ పాస్ వర్డ్ బలంగా ఉందన్న విషయాలు కూడా తెలుస్తాయి.

1Password

1Password

దీంతో పాటు 1Password అనే మరో వెబ్ సైటు కూడా ఈ రకమైన సెక్యూరిటీని అందిస్తోంది. అందులో మీరు ముందుగా రిజిస్టర్ అయి ఆ ఆ తర్వాత మీ పాస్‌వర్డ్ లీకులకి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.

థర్డ్‌పార్టీ వెబ్‌సైట్‌లను

థర్డ్‌పార్టీ వెబ్‌సైట్‌లను

ఏది ఏమైనా థర్డ్‌పార్టీ వెబ్‌సైట్‌లను అస్సలు నమ్మకండి. ఏదైనా అనుమానం కలిగితే కొత్త పాస్‌వర్డ్‌లు మార్చడం చాలా శ్రేయస్కరం. ఏదైనా వెబ్‌సైట్‌కు మీ వివరాలు ఇచ్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. లేకపోతే మీ విలువైన సమాచారం ఇతరులకు తెలిసే ప్రమాదం ఉంటుంది.

Best Mobiles in India

English summary
How to Check if Your Password Has Been Stolen more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X