పాన్‌కార్డ్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవటం ఎలా..?

Posted By: BOMMU SIVANJANEYULU

కొత్తగా పాన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారా..? అయితే మీ పాన్ అప్లికేషన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా పాన్ కార్డులను ఇష్యూ చేస్తోన్న NSDL ఇంకా UTITSL సంస్థలు తమ వినియోగదారుల సౌకర్యార్థం ఆన్‌లైన్ స్టేటస్ చెక్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఈ సదుపాయంతో పాన్‌కార్డ్ కోసం అప్లై చేసిన యూజర్లు తమ అప్లికేషన్ నెంబర్‌ను ఉపయోగించుకుని కార్డ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఆ ప్రొసీజర్‌‍ను ఇప్పుడు తెలుసుకుందాం...

మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? మీరే సరిచేసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1, స్టెప్ 2

ముందుగా మీ కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ నుంచి NSDL పాన్ అప్లికేషన్ స్టేటస్ ట్రాకింగ్ పేజీలోకి వెళ్లిండి. (https://tin.tin.nsdl.com/pantan/StatusTrack.html). పేజీలోకి వెళ్లిన తరువాత అప్లికేషన్ టైప్‌ను సెలక్ట్ చేసుకోవాలి. పాన్‌కార్డ్ అప్లికేషన్‌ను ట్రాక్ చేయాలనుకునే వారు PAN - New / Change Request ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5...

అప్లికేషన్ టైప్‌ను సెలక్ట్ చేసుకన్న తరువాత మీకు కేటాయించిన Acknowledgement నెంబర్‌ను సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేయాలి. Acknowledgement నెంబర్‌ను మెయిల్ ద్వారా మీకు NSDL ఇష్యూ చేస్తుంది. అప్లికేషన్ నెంబర్‌ను ఎంటర్ చేసిన తరువాత క్రిందిగా కనిపించే మరో కాలమ్‌లో ఇమేజ్‌లో ఉన్నట్లుగా captcha codeను ఎంటర్ చేసిన సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ పాన్‌కార్డ్ అప్లికేషన్‌కు సంబంధించిన స్టేటస్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది.

 

 

మరొక పద్ధతిలో...

మరొక పద్ధతిలో భాగంగా UTITSL ద్వారా మీ పాన్‌కార్డ్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్‌ను కూడా ఇప్పుడు తెలుసుకుందాం...
ముందుగా UTITSL PAN కార్డ్ అప్లికేషన్ స్టేటస్ పేజీలోకి వెళ్లాలి. (http://www.trackpan.utiitsl.com/PANONLINE/#forward). పేజీలోకి వెళ్లిన తరువాత మీకు కేటాయించిన అప్లికేషన్ కూపన్ నెంబర్‌ను సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేయాలి. అప్లికేషన్ కూపన్ నెంబర్‌ను మెయిల్ ద్వారా మీకు UTITSL ఇష్యూ చేస్తుంది.

స్టెప్ 3, స్టెప్ 4

కూపన్ కోడ్‌ను ఎంటర్ చేసిన తరువాత క్రిందిగా కనిపించే మరో కాలమ్‌లో ఇమేజ్‌లో ఉన్నట్లుగా captcha codeను ఎంటర్ చేసిన సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ పాన్‌కార్డ్ అప్లికేషన్‌కు సంబంధించిన స్టేటస్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
If you’ve applied for a new PAN card online or if you’ve asked for a reprint of your PAN card, you’re probably wondering how to check the status of the application.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot