మీ పీఎఫ్ బాలన్స్ ను స్మార్ట్‌ఫోన్లో చెక్ చేసుకోవడం ఎలా...?

మీరు ఉద్యోగం చేస్తున్నారా..మీకు ప్రావిడెంట్ ఫండ్ వస్తోందా..అయితే దాన్ని తెలుసుకోవడానికి మీరు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా..అయితే మీకు ఇంకా ఆ శ్రమ అవసరం లేదు..మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు..

|

మీరు ఉద్యోగం చేస్తున్నారా..మీకు ప్రావిడెంట్ ఫండ్ వస్తోందా..అయితే దాన్ని తెలుసుకోవడానికి మీరు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా..అయితే మీకు ఇంకా ఆ శ్రమ అవసరం లేదు..మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు..అందులో నెట్ ఉంటే చాలు మీరు ఈజీగా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.గతంలోలాగా మీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) బ్యాలెన్స్‌ను తెలుసుకోవడం కోసం పనివేళలు వృథా చేసుకొని హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.చాలా సింపుల్ గా మీకు దానికి సంబంధించిన వివరాలు లభిస్తాయి..మీ చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా క్షణాల్లో ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చుఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం కోసం నాలుగు రకాల ఆప్షన్స్‌ను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) అందుబాటులోకి తీసుకొచ్చింది.

జీసిరీస్ లో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసిన మోటోరోలాజీసిరీస్ లో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసిన మోటోరోలా

Umang App

Umang App

మీ స్మార్ట్‌ఫోన్లో Umang App ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా మీ పీఎఫ్ బాలన్స్ ను చెక్ చేసుకోవచ్చు.

- ప్లే స్టోర్ లో Umang App ను డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి
- మీ రిజిస్టర్ నెంబర్ తో యాప్ లో లాగ్ ఇన్ అవ్వండి
- టాప్ లెఫ్ట్ కార్నెర్ లో ఉన్న హారిజాంటల్ బార్లను నొక్కండి
- సర్వీస్ డైరెక్టరీ'లో నొక్కండి మరియు EPFO ​​ఎంపిక కోసం     సెర్చ్ చేయండి
- ఇప్పుడు కిందకి స్క్రాల్ చేసి ‘View Passbook' నొక్కి మీ మీ  పీఎఫ్ బాలన్స్ ను చెక్ చేసుకోండి

 

UAN portalలోకి లాగిన్ అవ్వండి..

UAN portalలోకి లాగిన్ అవ్వండి..

ఒకవేల యాప్ ను యూజ్ చేయడం ఇష్టం లేకపోతే UAN portal ద్వారా లాగిన్ అవ్వండి.

- అకౌంట్ లోకి లాగిన్ అయిన తరువాత మీ KYC డిటెయిల్స్ వెరిఫై కాబడ్డాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ కానట్లయితే తప్పనిసరిగా
వెరిఫై చేసుకోవల్సి ఉంది.
- తదుపరి స్టెప్‌లో భాగంగా full PF Settlement ఆప్షన్‌ను మీరు సెలక్ట్ చేసుకుని మీ పీఎఫ్ క్లెయిమ్‌ను వన్‌టైమ్ పాస్‌వర్డ్ ద్వారా చెక్
చేసుకోవల్సి ఉంటుంది.
- ఈ వన్‌టైమ్ పాస్‌వర్డ్ అనేది మీ యూఏఎన్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు పంపబడుతుంది.
- తదుపరి స్టెప్‌లో భాగంగా ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ మీ వివరాలను పూర్తిగా వెరిఫై చేసి క్లెెయిమ్ మొత్తాన్ని బ్యాంక్
అకౌంట్‌లోకి ప్రాసెస్ చేస్తుంది.

 

మిస్‌డ్ కాల్ సర్వీస్

మిస్‌డ్ కాల్ సర్వీస్

ఏ నంబర్ అయితే ఇస్తారో ఆ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కి మిస్ట్ కాల్ ఇస్తే మీ పీఎఫ్ ఖాతా వివరాలన్నీ మీ మీమొబైల్ SMS ద్వారా క్షణాల్లో అందుతాయి. కాగా ఈ సేవలు పూర్తిగా ఉచితం. మీరు ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ యూఏఎన్ కి రిజిస్టర్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. వేరే నంబర్ ని ట్రే చేస్తే SMS రాదు.

ఎస్‌ఎంఎస్‌తో ఈపీఎఫ్ వివరాలు

ఎస్‌ఎంఎస్‌తో ఈపీఎఫ్ వివరాలు

మీరు EPFO ​​తో మీ UAN ను రిజిస్టర్ చేసుకుంటే, మీ PF ఖాతాకు సంబంధించి మీ ఇటీవలి లావాదేవీ వివరాలను పొందడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను ఉపయోగించి 7738299899 కు 'EPFOHO UAN ENG' ను టైప్ చేసి SMS పంపండి.

Best Mobiles in India

English summary
How to check PF account balance on your smartphone.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X