Home
How to

SMS, మిస్డ్‌ కాల్‌ ద్వారా PF బ్యాలెన్స్‌ ఎలా తెలుసుకోవాలి..?

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO - ఎంప్లాయిస్ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌) సభ్యుల.. PF బ్యాలెన్స్‌, క్లైయిమ్‌ వివరాలు తెలుసుకొనేందుకు గతంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే ఇటీవల కాలంలో పరిస్థితి కొంత మెరుగుపడినా, చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఇంకా ఎదురవుతున్నాయి. UAN నంబర్ లేదా పాస్‌వర్డ్‌ గుర్తులేకపోయినా సందర్భాల్లో PF బ్యాలెన్స్‌ తెలుసుకోవడం చాలా కష్టమవుతోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు కొన్ని ప్రత్యామ్నయాలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

అయితే UAN నంబర్‌ లేకుండానే PF ఖాతా బ్యాలెన్స్‌ తనిఖీ, నగదు విత్‌డ్రా సహా ఇతర వివరాలను తెలుసుకొనేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం సాధారణంగా EPFO వెబ్‌సైట్‌ లో UAN, పాస్‌వర్డ్‌ ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. అయితే సింపుల్‌గా మరో ఆప్షన్‌ కూడా ఉంది.

How to Check PF Balance through SMS and missed Call

ఎలా మెసేజ్‌ చేయాలి :
UAN నంబర్‌ అవసరం లేకుండానే SMS, మిస్డ్‌ కాల్‌ ద్వారా PF బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ ఫోన్‌ నుంచి EPFOHO UAN ENG అని టైప్‌ చేసి 7738299899 నంబర్‌ కు మెసేజ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం EPFO నుంచి PF బ్యాలెన్స్‌ సహా ఇతర వివరాలు మెసేజ్‌ రూపంలో వస్తాయి.

మీ సొంత భాషలోనూ తెలుసుకోవచ్చు :
ప్రస్తుతం ఈ అవకాశం 10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌, హిందీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాళీ భాషల్లో PF వివరాలను పొందవ‌చ్చు. అయితే ఇంగ్లీష్‌కు బదులుగా మీ భాషల్లో వివరాలు కావాలంటే మెసేజ్ లో ENG బదులుగా మీ భాషలోని మొదట మూడు అక్షరాలను టైప్‌ చేసిన పంపాల్సి ఉంటుంది.

ఉదాహరణకు తెలుగులో మీకు PF సమాచారం కావాలంటే EPFOHO UAN TEL అని టైప్‌ చేసి 7738299899 నంబర్‌కు మెసేజ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మేసేజ్‌ పంపితే, PF బ్యాలెన్స్‌ సహా KYC వివరాలు వస్తాయి. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌తోనే మెసేజ్‌ పంపాల్సి ఉంటుంది. SMS విధానంలో PF బ్యాలెన్స్‌ సహా ఇతర వివరాలు పొందేందుకు, UAN నంబర్‌ ను ముందే యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

మిస్డ్‌ కాల్‌ ద్వారా ఎలా తెలుసుకోవాలి :
మిస్డ్‌ కాల్ విధానంలో PF వివరాలు తెలుసుకొనేందుకు 9966044425 నంబర్‌ కు కాల్‌ చేయాల్సి ఉంటుంది. మీరు కాల్‌ చేసిన తర్వాత ఆటోమేటిక్‌ గా కాల్‌ డిస్‌ కనెక్ట్‌ అవుతుంది. అనంతరం మెసేజ్‌ రూపంలో పూర్తి వివరాలు అందుతాయి.

ఉద్యోగులు తమ PF ఖాతాలోని నగదును ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి మరింత సులభంగా విత్‌డ్రా చేసుకొనే అవకాశం ఉంటుంది. UPI ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగులు తమ ఖాతాల నుంచి అనుమతించిన మొత్తాన్ని సులభంగా ఉపసంహరించుకోవచ్చు. ఏప్రిల్ 2026 నాటికి ఈ యాప్‌ను తీసుకొచ్చేందుకు సంబంధిత వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Check PF Balance through SMS and missed Call here is the guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X