PF బ్యాలెన్స్ ను SMS ద్వారా తెలుసుకోవడం ఎలా?
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి PF గురించి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ప్రోవిడెంట్ ఫండ్ (PF) అనేది ఒక సంస్థ ప్రతి నెలా వారి ఉద్యోగుల జీతం నుండి కొంత మొత్తంలో తీసి వారి యొక్క EPF అకౌంట్ లో జమ చేస్తుంది. PF క్రమం తప్పకుండా జమ అవుతుందా లేదా అని ఒక SMS ను పంపి కూడా తెలుసుకోవచ్చు.

ప్రోవిడెంట్ ఫండ్ (PF) ఎంత మొత్తం ఉంది అని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ అతి సరళమైనది మీ స్మార్ట్‌ఫోన్ నుండి ఒక SMS ఉపయోగించి దాన్ని తనిఖీ చేయడం. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒక ఎస్ఎంఎస్ ద్వారా PF బ్యాలన్స్ ఎంత ఉందొ తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ముందు జాగ్రత్తలు
*** ప్రోవిడెంట్ ఫండ్ (PF) SMS పద్ధతి ద్వారా తెలుసుకోవడానికి ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటి కంటే మొదటగా మీ యొక్క UAN యాక్టీవేట్ చేయబడి ఉండాలి. UANను యాక్టీవేట్ చేయడానికి EPFO వెబ్‌సైట్‌లోని కొన్ని సాధారణ దశలను అనుసరించడం ద్వారా చేయవచ్చు.
**** అలాగే మీరు కలిగి ఉండవలసిన మరో విషయం ఏమిటంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో SMS సర్వీస్ ఖచ్చితంగా ఉండడం.

PF బ్యాలెన్స్ ను SMS ద్వారా తెలుసుకోవడం ఎలా?
పైన తెలిపిన రెండు విషయాలను మీరు కనుక కలిగి ఉంటే కింద ఉన్న మూడు దశలను పాటించడం ద్వారా ప్రోవిడెంట్ ఫండ్ (PF) బ్యాలన్స్ ను ఒక చిన్న SMS ద్వారా తెలుసుకోవచ్చు.
**** మీ స్మార్ట్‌ఫోన్‌లోని మెసేజ్ యాప్ ను ఓపెన్ చేయండి.
**** మెసేజ్ బాక్స్ లో EPFOHO UAN అని టైప్ చేయండి.
**** తరువాత దీన్ని '7738299899' కు SMS పంపండి.

దీని తరువాత మీరు PF బ్యాలెన్స్‌తో సహా అన్ని వివరాలతో ఒక ఎస్‌ఎంఎస్ అందుకుంటారు .
ఒకవేళ UAN యాక్టీవేట్ చేయబడకపోతే EPFO వెబ్‌సైట్‌కు వెళ్లి, దిగువ నుండి యాక్టివేట్ UAN ఎంపికపై క్లిక్ చేయండి. దీని తరువాత, UAN నంబర్ (సాధారణంగా పేస్‌లిప్ పైభాగంలో కనిపిస్తుంది), పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు కాప్చా వంటి అన్ని అవసరమైన వివరాలను పూరించండి, ఆపై ప్రామాణీకరణ పిన్ పొందండి నొక్కండి.


Click it and Unblock the Notifications








