WiFi Password ఐఫోన్, ఐప్యాడ్‌లో వైఫై పాస్‌వర్డ్‌ను తెలుసుకోవడం ఎలా.. ఈ కొత్త అప్‌డేట్ ఎలా పనిచేస్తుంది?
వైఫై పాస్‌వర్డ్‌ను ఆపిల్ పరికరాల మధ్య సులభంగా షేర్ చేయవచ్చు. అయితే ఆపిల్ పరికరాల నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు వైఫై పాస్‌వర్డ్‌ను షేర్ చేసే అవకాశాన్ని ఆపిల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా మీరు ఇప్పటికే వినియోగిస్తున్న వైఫై నెట్‌వర్క్ (WiFi Password) పాస్‌వర్డ్‌ను ఆండ్రాయిడ్ పరికరాలు కూడా కనెక్ట్ అయ్యేందుకు వీలుంది. ఇందుకు iOS 16, iPadOS 16 అప్‌డేట్ ద్వారా ఇందుకు అవకాశం ఉంది. ఫలితంగా ఐఫోన్ లేదా ఐప్యాడ్ ద్వారా ఈ వివరాలను ఆండ్రాయిడ్ ఫోన్‌కు షేర్ చేయవచ్చు.
ఐఫోన్, ఐప్యాడ్ ద్వారా మీరు ఇప్పటికే కనెక్ట్ అయిన వైఫై పాస్‌వర్డ్ ను షేర్ చేసేందుకు.. తొలుత మీ ఆపిల్ పరికరాలను కొత్త OS వెర్షన్‌లకు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ప్రస్తుతం వినియోగిస్తున్న ఆపిల్ పరికరాల్లో వైఫై పాస్‌వర్డ్ సేవ్ చేసి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.

స్టెప్ 1 : ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
స్టెప్ 2 : అనంతరం వైఫై ఆప్షన్‌కు వెళ్లా్ల్సి ఉంటుంది.
స్టెప్ 3 : వైఫై నెట్‌వర్క్ వద్దనున్న More Info ఆప్షన్ ను ఎంచుకోవాలి.
స్టెప్ 4 : అనంతరం పాస్‌వర్డ్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 5 : ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ ద్వారా ధ్రువీకరించాలి.
స్టెప్ 6 : ధ్రువీకరణ అనంతరం వైఫై పాస్‌వర్డ్ ను చూసేందుకు వీలుంటుంది.
స్టెప్ 7 : ఈ పాస్‌వర్డ్ ను ఇతర డివైస్ లకు షేర్ చేసేందుకు అవకాశం ఉంది.
*ఇప్పటికే ఆండ్రాయిడ్‌లోనూ ఈ తరహా విధానం అందుబాటులో ఉంది. ఫలితంగా పాస్‌వర్డ్‌ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే సులభంగా ఇతరులకు షేర్ చేయవచ్చు. అయితే ఆండ్రాయిడ్ 10 కంటే అప్‌డేట్ వెర్షన్‌లో మాత్రమే ఈ అవకాశం ఉంది. వైఫై రేంజ్‌లో ఉండి.. ఇతరులకు కూడా పాస్‌వర్డ్‌ను షేర్ చేయవచ్చు. అయితే అవతలి వ్యక్తులకు గూగుల్ లెన్స్ లేదా కెమెరా యాప్ ద్వారా స్కాన్ చేసేందుకు అవకాశం ఉండాలి.
ఆండ్రాయిడ్ ఫోన్లో వైఫై పాస్‌వర్డ్ ను గుర్తించడం ఎలా..?
స్టెప్ 1 : ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చెయ్యాలి.
స్టెప్ 2 : అనంతరం నెట్‌వర్క్ మరియు ఇంటర్నెట్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 3 : ఆ తర్వాత ఇంటర్నెట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
స్టెప్ 4 : అక్కడ కనిపించిన నెట్‌వర్క్ లలో మీకు కావాల్సిన వాటికి ఎంచుకోవాలి.
స్టెప్ 5 : ఆ నెెట్‌వర్క్ పైన క్లిక్ చేసి, QR కోడ్‌ను గుర్తించవచ్చు.
స్టెప్ 6 : ఈ కోడ్‌ను ఇతరులకు షేర్ చేయవచ్చు.
ఈ QR కోడ్ రూపంలో ఉన్న వైపై పాస్‌వర్డ్ ను కొత్త ఫోన్ లు లేదా ట్యాబ్లెట్ లు స్కాన్ చేసి సులభంగా కనెక్ట్ కావచ్చు. గూగుల్ లెన్స్, కెమెరా యాప్, లేదా వైఫై సమీపంలో ఉన్న స్కానర్ ద్వారా స్కాన్ చేసిన కనెక్ట్ కావచ్చు. కార్యాలయాల్లో మీకు అవసరం ఉంటే ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవచ్చు.


Click it and Unblock the Notifications







