WhatsApp ద్వారా రైలు PNR స్టేటస్ సమాచారం తెలుసుకోవడం ఎలా?

|

ఇండియాలో ఎక్కువ మంది దూర ప్రయాణాల కోసం ట్రైన్ జర్నీని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మీరు తరచూ రైళ్లలో ప్రయాణిస్తుంటే కనుక రైలు యొక్క బయలుదేరే సమయం మరియు గమ్యం చేరుకునే సమయం వంటి స్టేటస్ ల గురించి తెలుసుకోవడానికి PNR స్టేటస్ ని తనిఖీ చేయడం అనేది అనేక కీలకమైన మార్గాలలో ఒకటి అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు త్వరిత పరిష్కారం కోసం IRCTC వెబ్‌సైట్ లేదా ఇతర సైట్‌లకు వెళ్లి స్టేటస్ ను పొందడానికి PNR నంబర్‌లో ఉంచడం. అయితే ఇప్పుడు వాట్సాప్ ద్వారా PNR స్టేటస్ తెలుసుకునే ఒక గొప్ప పరిష్కారం అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్‌ రైలోఫీ సర్వీసు PNR స్టేటస్

వాట్సాప్‌ రైలోఫీ సర్వీసు PNR స్టేటస్

Railofy సర్వీసును ఇప్పుడు కొత్తగా వాట్సాప్‌లో ప్రారంభించింది. ఇది వినియోగదారులకు మెసేజ్ పంపడం ద్వారా రైలు యొక్క స్టేటస్ ను తనిఖీ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ కొత్త సర్వీస్ ద్వారా ప్రయాణికులు టికెట్ నుండి PNR స్టేటస్ సమాచారం తెలుసుకోవడానికి వాట్సాప్‌లో +91 98811 93322 నంబర్‌కు మెసేజ్ పంపాలి. తరువాత రైలు ఎక్కే ముందు మీ బుకింగ్ స్టేటస్ మరియు సీట్ల వివరాలను చూపుతుంది. అలాగే మీరు రైలు ఎక్కిన మీ స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత సర్వీస్ ఆలస్యం స్టేటస్ తో పాటు ఉహించిన రాక సమయం మరియు తదుపరి స్టేషన్ వివరాలను చూపిస్తుంది. వినియోగదారులు PNR నంబర్‌ను పంపిన తర్వాత సర్వీస్ ఆటోమ్యాటిక్ గా అన్ని వివరాలతో మీ నంబర్‌కు అన్ని వివరాలను పంపుతుంది.

 

Also Read: Infinix Zero 8i స్మార్ట్‌ఫోన్ లాంచ్!!! బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్స్...Also Read: Infinix Zero 8i స్మార్ట్‌ఫోన్ లాంచ్!!! బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్స్...

వాట్సాప్ ద్వారా రైలు PNR స్టేటస్ ను తనిఖీ చేసే విధానం

వాట్సాప్ ద్వారా రైలు PNR స్టేటస్ ను తనిఖీ చేసే విధానం

1. మొదట మీ యొక్క ఫోన్ లో +91 98811 93322 ఫోన్ నంబర్‌ను సేవ్ చేయండి.

2. వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్ ను పంపడానికి +91 98811 93322 కోసం శోధించండి.

3. మీరు చాట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క PNR నంబర్‌ను పంపండి.

4. ఆ తరువాత సబ్స్క్రిప్షన్ యొక్క నిర్ధారణతో బోట్ ప్రత్యుత్తరం ఇస్తుంది.

5. మీరు మీ రైలు ప్రయాణంలో ఎప్పటికప్పుడు అప్ డేట్ లను పొందుతూ ఉంటారు.

 

వాట్సాప్‌లో రైలోఫీ సర్వీస్

వాట్సాప్‌లో రైలోఫీ సర్వీస్

వాట్సాప్‌లో రైలోఫీ సర్వీస్ ఉచితంగా లభిస్తుందని గమనించండి. అలాగే ఈ సేవను పొందటానికి మీరు రైలోఫీ ద్వారా టికెట్ బుక్ చేసుకోవలసిన అవసరం లేదు. ప్రయాణించేటప్పుడు ముఖ్యంగా మీరు పేలవమైన నెట్‌వర్క్ ప్రాంతాలను దాటినప్పుడు ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. అంతేకాక "STOP" మెసేజ్ పంపడం ద్వారా మీరు ఎప్పుడైనా ఈ సేవను ఆపవచ్చు.

Best Mobiles in India

English summary
How to Check Train PNR Status Directly Through WhatsApp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X