CIBIL స్కోర్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడం ఎలా?

|

మీరు ఇల్లు లేదా కారు కొనాలనుకుంటున్నారా? మీ వద్ద దానికి సరిపోయే అంత డబ్బులు లేకపోతే కనుక లోన్ పొందడం కోసం తరచుగా బ్యాంకుని ఆశ్రయిస్తారు. అయితే బ్యాంకుకు వెళ్లే ముందు CIBIL స్కోర్‌ని చూసుకోవడం ఉత్తమం. CIBIL క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ అని అర్థం. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదించిన ఏజెన్సీ. ఇది వినియోగదారులు చేసే జాబ్స్ మరియు వ్యాపారంని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క క్రెడిట్ నివేదికలు మరియు స్కోర్‌లను అందిస్తుంది.

 
How to Check Your CIBIL Score Through Online: Here are Step-by-Step

ఒక వ్యక్తి యొక్క CIBIL స్కోర్ అనేది ముందు తీసుకున్న రుణాలు మరియు తిరిగి చెల్లించిన మరియు ఇతర విషయాల మీద ఆధారపడి ఉంటుంది. దీనితోపాటు భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల యొక్క క్రెడిట్ కార్డ్ వంటి విభిన్న సమాచారంపై ఆధారపడి ఉంటుంది. మీరు తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి ఇచ్చే అవకాశం ఎంత ఉందో ఇది ప్రాథమికంగా బ్యాంకుకు తెలియజేస్తుంది. CIBIL స్కోర్ 300 నుండి 900 స్కేల్‌లో గణించబడుతుంది. ఇందులో 300 అనేది తక్కువ స్కోర్ అయితే 900 అత్యధిక స్కోర్. ఒక వ్యక్తి యొక్క స్కోర్ ఎక్కువగా ఉంటే కనుక వారు బ్యాంకు నుండి రుణం పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి బ్యాంకులో లోన్ తీసుకోవడానికి ముందుగా మీ యొక్క CIBIL స్కోర్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా తనిఖీ చేయడం ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
How to Check Your CIBIL Score Through Online: Here are Step-by-Step

CIBIL స్కోర్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసే విధానం

స్టెప్ 1: ముందుగా అధికారిక CIBIL వెబ్‌సైట్ (https://www.cibil.com/)కి వెళ్లండి.

స్టెప్ 2: 'మీ CIBIL స్కోర్ పొందండి' ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 3: క్రిందికి స్క్రోల్ చేసి FAQ విభాగాన్ని ఎంచుకోండి. CIBIL క్రెడిట్ రిపోర్ట్ పొందడానికి నేను ఎంత చెల్లించాలి అని చెప్పే చివరి ప్రశ్నపై క్లిక్ చేయండి?

స్టెప్ 4: ఇక్కడ ఉచిత CIBIL క్రెడిట్ రిపోర్ట్ ఎంపికపై క్లిక్ చేయండి.

How to Check Your CIBIL Score Through Online: Here are Step-by-Step

స్టెప్ 5: తరువాత ఓపెన్ అయ్యే పేజీలో మీ ఫ్రీ CIBIL స్కోర్ ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 6: తెరుచుకునే పేజీలో మీకు ఇప్పటికే అకౌంట్ లేకుంటే కనుక ముందుగా మీరు కొత్త అకౌంటును సృష్టించాలి. పేజీలో మీ పేరు, మీ ఇమెయిల్ చిరునామా, మీరు ఉపయోగించాలనుకుంటున్న ID మరియు మీ మొబైల్ నంబర్ వంటి వివరాలను పూరించండి. మీరు మీ పాన్, పాస్‌పోర్ట్ నంబర్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ లేదా రేషన్ కార్డ్ నంబర్‌ను ఉపయోగించవచ్చు.

స్టెప్ 7: మీరు ఈ వివరాలన్నింటినీ నమోదు చేసిన తర్వాత 'అంగీకరించు' మరియు 'కొనసాగించు' ఎంపికలపై క్లిక్ చేయండి.

స్టెప్ 8: ఇప్పుడు మీ యొక్క వివరాలను ధృవీకరించడానికి మీ మొబైల్ నంబర్‌కు అందుకున్న OTPని టైప్ చేసి ఆపై 'కొనసాగించు' బటన్‌పై క్లిక్ చేయండి.

How to Check Your CIBIL Score Through Online: Here are Step-by-Step

స్టెప్ 9: ఇప్పుడు 'గో టు డాష్‌బోర్డ్' ఎంపికను ఎంచుకుని మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయండి.

స్టెప్ 10: ఇప్పుడు మీరు myscore.cibil.com అనే వెబ్‌సైట్‌కి మళ్లించబడతారు.

స్టెప్ 11: ఇప్పుడు మెంబర్ లాగిన్ ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 12: మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి. లాగిన్ అయిన తరువాత మీ CIBIL స్కోర్ డాష్‌బోర్డ్‌లో చూపబడుతుంది.

Best Mobiles in India

English summary
How to Check Your CIBIL Score Through Online: Here are Step-by-Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X