విండోస్ 11 అప్‌డేట్లు మీకూ వస్తున్నాయా... కొత్త OS కి అప్‌గ్రేడ్ అయ్యేందుకు కనీస అర్హతలు తెలుసా?
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 2021 అక్టోబర్‌లో విండోస్ 11 (Windows 11) ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేసింది. ఈ OS విండోస్ 10 కు తర్వాత తరం వెర్షన్‌గా అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం విండోస్ 10ను వినియోగిస్తున్న వారు ఉచితంగానే అప్‌డేట్ చేసుకోవచ్చు.
అయితే ఇప్పటికీ చాలా మంది యూజర్లు విండోస్ 11 కు అప్‌గ్రేడ్ కాలేదు. దీంతోపాటు గత 10 సంవత్సరాల నుంచి ఉన్న కంప్యూటర్లు సహా ఇతర పరికరాలు విండోస్ 11కు సపోర్టు చేస్తాయి. మీరు వినియోగిస్తున్న పరికరాలు విండోస్ 11 కు సపోర్టు చేస్తాయా లేదా సందేహాలుంటే ఈ విధంగా తనిఖీ చేసి విండోస్ 11 కు అప్‌గ్రేడ్ కావచ్చు.

మీ కంప్యూటర్ విండోస్ 11 ను సపోర్టు చేస్తుందా లేదా అని ముందుగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ అధికారిక వెబ్ సైట్ ఆధారంగా విండోస్ 11 ఇన్‌స్టాల్ చేసుకొనేందుకు ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ సహా అనేక తనిఖీలు చేయాల్సి ఉంటుంది.
విండోస్ 11 ఇన్‌స్టాల్ చేసేందుకు కనీసం 1GHz స్పీడ్ ప్రాసెసర్‌ను కలిగి ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు 64 బిట్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉండాల్సి ఉంటుంది. మరియు కంప్యూటర్ కనీసం 4GB ర్యామ్‌ను కలిగి ఉండాలి. దీంతోపాటు కనీసం 64GB లేదా అంతకంటే ఎక్కువ స్టోరేజీని కలిగి ఉండాలి.
దీంతోపాటు విండోస్ 11 ను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు.. కంప్యూటర్ UEFI లేదా సెక్యూర్ బూట్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. మరియు ట్రస్టడ్ ప్లాట్‌ఫాం మాడ్యూల్ (TPM) వెర్షన్ 2.0 ను కలిగి ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా గ్రాఫిక్స్ కార్డును కలిగి ఉండాలి. డైరెక్ట్X 12 లేదా WDDM 2.0 డ్రైవర్ సపోర్టు చేయాల్సి ఉంటుంది.
గత సంవత్సరం మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. Windows 10 ఓఎస్ సేవలు చివరి దశకు చేరుకున్నాయని వెల‌్లడించింది. వినియోగదారులు ఇక నుంచి ఈ OSపై ఎటువంటి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు పొందలేదని ప్రకటన చేసింది. 22H2.. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్(OS)కు చివరి వెర్షన్‌గా ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రస్తుత OS విండోస్ 10 వినియోగిస్తున్న వారికి నెలవారీగా విడుదల చేస్తున్న అప్‌డేట్లు మాత్రం కొన్ని సంవత్సరాల వరకు కొనసాగుతాయని తెలిపింది. ఆ అప్‌డేట్లు కూడా 2025 అక్టోబర్ 14 నుంచి నిలిచిపోతాయని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్ కూడా తన వినియోగదారులకు విండోస్ 11కు అప్‌గ్రేడ్ కావాలని సూచిస్తోంది.
ప్రస్తుతం విండోస్ 10ను వినియోగిస్తున్న వారు ఉచితంగానే విండోస్ 11కు అప్‌గ్రేడ్ కావొచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే ఇప్పటికీ విండోస్ 7 సహా అంతకు ముందు వెర్షన్ల OS వినియోగిస్తున్న వారు మాత్రం విండోస్ 11 సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇప్పటికీ చాలా మంది వినియోగిస్తున్న విండోస్ 7 2009లో రిలీజ్ అయింది. అనంతరం మూడేళ్ల తర్వాత విండోస్ 8 విడుదల అయింది. 2013 సంవత్సరంలో విండోస్ 8.1 అందుబాటులోకి వచ్చింది. విండోస్ 8, 8.1 పెద్దగా పాపులర్ కాలేదు. 2015లో విండోస్ 10ను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. అనంతరం 2021లో విండోస్ 11 అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications








